Madras Filter Coffe: ఫ్రాంచైజీ పేరుతో మద్రాస్ ఫిల్టర్ కాఫీ యజమాని మోసం - రెండు చోట్ల కేసులు నమోదు
Madras: మద్రాస్ ఫిల్టర్ కాఫీ ఫ్రాంచైజీ ఇస్తామని డబ్బులు వసూలు చేసి మోసం చేశారని యశ్వంత్ అనే వ్యక్తిపై కేసులు నమోదయ్యాయి.

Brand theft: మద్రాస్ ఫిల్టర్ కాఫీ పేరుతో పలు చోట్ల ఏర్పాటు చేసిన ఫ్రాంచైజీ దుకాణాలు ఏర్పాటయ్యాయి. కొన్ని చోట్ల ఫ్రాంచైజీ పేరుతో మోసం చేశాడని యశ్వంత్ కుమార్ అనే వ్యక్తి పై కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు పోలీసు స్టేషన్ లో ఇతని మీద చీటింగ్ , ఫోర్జరీ కేసు నమోదు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 318(4), 336(3) BNS 2023, 0/W 3(5) 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
మద్రాస్ ఫిల్టర్ కాఫీ ఫ్రాంచైజీల పేరుతో మోసాలు
నిందితుడు పరుచూరి యశ్వంత్ కుమార్ పై గతంలో కూడా రాష్ట్రంలోని పలు స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయన్న ఆరోపణలు ఉన్నాయి. విజయవాడ సింగ్ నగర్ పోలిస్ స్టేషన్ లో డబ్బులు కోసం బెదిరింపు, చీటింగ్ కేస్ 29/2025 316 (2), 351(2), 0/w 3(5) సెక్షన్ల కింద ఇతని అనుచరులతో సహా కేసులు నమోదు అయ్యాయిని చెబుతున్నారు.
యశ్వంత్ కుమార్ పై పలు కేసులు
అలాగే ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తోటి వ్యాపారులను బెదిరించిన నేరంపై 351(2), 0/1 3(5) BNS 66-C ITA - 2000 సెక్షన్ల కింద విశాఖ సైబర్ క్రైం పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ కేసులు కూడా వి చారణలో ఉన్నాయి.
లబోదిబోమంటున్న ఫ్రాంఛైజీ ఓనర్లు
ఫ్రాంచైజీల పేరుతో డబ్బులు వసూలు చేసి.. ఇవ్వలేదన్న ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.





















