అన్వేషించండి

Vijayawada Crime News: విజయవాడలో శాతవాహన కాలేజీ ప్రిన్సిపల్ కిడ్నాప్, సీసీ కెమెరాలో అంతా రికార్డ్

విజయవాడలో శాతవాహన కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాస్‌ను కొందరు గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. ఇందుకు సంబంధించిన ఘటన సీసీ కెమెరాలో అంతా రికార్డ్ అయింది.

విజయవాడ: బెజవాడలో శుక్రవారం రాత్రి ఓ వ్యక్తి కిడ్నాప్ కలకలం రేపింది. శాతవాహన కళాశాల ప్రిన్సిపాల్ వంకాయలపాటి శ్రీనివాస్‌ను కొందరు గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. బందర్ రోడ్డులోని డి అడ్రస్ మాల్ వద్ద కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ను కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లారు. బాధితుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వందల కోట్ల విలువైన కాలేజీ ఆస్తిపై వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రిన్సిపాల్ కిడ్నాప్ కావడం పలు అనుమానాలకు తావిస్తోంది.

శుక్రవారం రాత్రి డీ అడ్రస్ మాల్ వద్ద కొందరు గుర్తుతెలియని దండగులు శ్రీనివాస్‌ను బలవంతంగా కారులో ఎక్కించి తీసుకెళ్లారు. డీ అడ్రస్ మాల్ ఓనర్ సైతం విజయవాడ పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. మరోవైపు కుటుంబసభ్యులు సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి శ్రీనివాస్ కిడ్నాప్ పై ఫిర్యాదు చేశారు. విజయవాడ సీపీ కృష్ణలంక పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు సీసీ ఫుటేజ్ పరిశీలించారు. శ్రీనివాస్‌ను కిడ్నాప్ చేసిన తీసుకెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డైంది. అయితే శ్రీనివాస్ గాంధీనగర్ కి చెందిన వ్యక్తి కావిడంతో అనంతరం కృష్ణలంక పోలీసులు  సత్యనారాయణపురం పోలీసులకు కేసు ట్రాన్స్‌ఫర్ చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Tirupati Janasena: టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
AP Local Body Elections: ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
Formula E Car Race Case: ఫార్ములా ఈ రేసు కేసు.. విచారణకు హాజరు కాని కేటీఆర్- డిసెంబర్ 4కు వాయిదా
ఫార్ములా ఈ రేసు కేసు.. విచారణకు హాజరు కాని కేటీఆర్- డిసెంబర్ 4కు వాయిదా
Vatsala Rajagopal : సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం - అదుర్స్ బామ్మ ఇక లేరు
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం - అదుర్స్ బామ్మ ఇక లేరు

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Janasena: టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
AP Local Body Elections: ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
Formula E Car Race Case: ఫార్ములా ఈ రేసు కేసు.. విచారణకు హాజరు కాని కేటీఆర్- డిసెంబర్ 4కు వాయిదా
ఫార్ములా ఈ రేసు కేసు.. విచారణకు హాజరు కాని కేటీఆర్- డిసెంబర్ 4కు వాయిదా
Vatsala Rajagopal : సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం - అదుర్స్ బామ్మ ఇక లేరు
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం - అదుర్స్ బామ్మ ఇక లేరు
Hyderabad Water Crisis: హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
TDP Rebel Candidates: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. వేటు పడుతుందని రెబల్స్‌కు టీడీపీ నోటీసులు
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. వేటు పడుతుందని రెబల్స్‌కు టీడీపీ నోటీసులు
FASTag Pass: ఫాస్టాగ్‌ యాన్యువల్‌ పాస్‌ vs లోకల్‌ పాస్‌ vs రెగ్యులర్‌ రీఛార్జ్‌.. మీకు ఏది బెస్ట్?
హైవేపై మీ ప్రయాణానికి ఏ FASTag పాస్ ప్రయోజనం? మీ ఖర్చు తగ్గించే ఆప్షన్ ఇదే!
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Embed widget