అన్వేషించండి

Chikkaballapur: దుండగులు గొంతు నులిమి గోతిలో పడేశారు - 'యోగా'తో ప్రాణాలు నిలబెట్టుకుంది

Crime News: యోగా సాధన ఓ నిండు ప్రాణాన్ని నిలబెట్టింది. యువతిని కిడ్నాప్ చేసి చంపాలని యత్నించిన దుండగులు ఆమె పూడ్చిపెట్టగా యోగా సాయంతో ప్రాణాలతో బయటపడింది.

Yoga Helps Teacher To Escape From Death: యోగా, ప్రాణాయామం వంటి వాటితో సంపూర్ణ ఆరోగ్యం అని మనకు తెలుసు. కానీ, అదే యోగ విద్య ఆమె ప్రాణాలు నిలిచేలా చేసింది. కొందరు దుండగులు ఆమెను హత్య చేయాలని యత్నించగా.. యోగా సాయంతో చాకచక్యంగా ప్రాణాపాయం నుంచి బయటపడింది. పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లా దిబ్బూరహళ్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. దేవనహళ్లికి చెందిన యువతి (34) భర్త నుంచి విడిపోయి దిబ్బూరహళ్లిలో ఒంటరిగా ఉంటున్నారు. సంతోష్‌కుమార్‌రెడ్డి అనే వ్యక్తితో ఆమెకు పరిచయమై అది కాస్త ప్రేమగా మారింది. అయితే, ఏం జరిగిందో ఏమో కానీ సదరు యువతిని హత్య చేసేందుకు సంతోష్.. ఆమె దగ్గర యోగా నేర్చుకుంటోన్న సతీష్‌రెడ్డి సాయం కోరాడు. ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ నడుపుతోన్న సతీష్ రెడ్డి, తన సహచరులు రమణ, సల్మాన్, రవిలతో పాటు సంతోష్ కలిసి యువతిని అక్టోబర్ 23న కిడ్నాప్ చేశారు. 

యోగా సాయంతో..

నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి యువతిపై అత్యాచారానికి యత్నించారు. ఆమె కేకలు వేయడంతో గొంతు నులిమారు. ఊపిరి తీసుకోకపోవడంతో ఆమె చనిపోయిందనుకుని.. అక్కడే గుంత తీసి అందులో పడేసి పరారయ్యారు. అయితే, యోగా సాధనలో పరిణతి ఉన్న యువతి శ్వాసను నియంత్రించి చనిపోయినట్లు నటించింది. నిందితులు అక్కడి నుంచి వెళ్లిన అనంతరం గుంత నుంచి ప్రాణాలతో బయటపడింది. స్థానికుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ కుశాల్ చౌక్సే తెలిపారు. పరారీలో ఉన్న కీలక నిందితుడు సంతోష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Also Read: Shalimar Express Accident: పట్టాలు తప్పిన సికింద్రాబాద్‌- షాలిమార్ ఎక్స్‌ప్రెస్‌, హౌరాకు సమీపంలో ఘటన

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget