అన్వేషించండి

Ayesha Meera murder case: ఆయేషా మీరా కేసులో సంచలనం - సత్యంబాబు పనేనని సీబీఐ తేల్చిందా ?

Satyam Babu: ఆయేష్ మీరా హత్య కేసులో సీబీఐ దర్యాప్తులోనూ సత్యంబాబుపైనే అనుమానాలు వ్యక్తమయినట్లుగా తెలుస్తోంది . అతనిపై 376, 302 సెక్షన్లు నమోదుకు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

CBI investigation in Ayesha Meera murder case: 2007లో విజయవాడలో జరిగిన బీ.ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు కీలక మలుపు తిరిగింది.  నిర్దోషిగా విడుదలైన సత్యంబాబుపై 376, 302 సెక్షన్లు నమోదుకు సంబంధించి అభ్యంతరాలు ఉంటే తెలపాలని  సీబీఐ కోర్టు అయేషా తల్లిదండ్రులు బాషా, సంషేద బేగంకు నోటీసులు ఇచ్చింది. సీబీఐ దర్యాప్తు పూర్తి చేసి నివేదికను కోర్టుకు సమర్పించడంతో ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. 

ఈ కేసులో సత్యంబాబుపై నమోదు చేయాలనుకుంటున్న రెండు సెక్షన్లు అత్యాచారం, హత్య  నేరాలకు చెందినవే. అంటే సీబీఐ దర్యాప్తులోనూ అన్ని ఆధారాలు.. సత్యంబాబు నేరం చేసినట్లుగా నిరూపించేలా బయటడ్డాయన్న అభిప్రాయం న్యాయనిపుణులు వ్యక్తం చేస్తున్నారు.                 

భారతీయ శిక్షాస్మృతి (IPC) ప్రకారం...  సెక్షన్ 302 (హత్య) కేసు. హత్య చేసినవారికి మరణశిక్ష (డెత్ పెనాల్టీ) లేదా జీవిత కాలం ఖైదు (లైఫ్ ఇంప్రిజన్‌మెంట్), అలాగే జరిమానా విధించవచ్చు. ఇది అతి తీవ్రమైన నేరం,   కోర్టు ఆధారాల ఆధారంగా శిక్ష నిర్ణయిస్తుంది. సెక్షన్ 376 ( అత్యాచారం). కనీసం 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష (రిగరస్ ఇంప్రిజన్‌మెంట్), ఇది జీవిత ఖైదు వరకు పొడిగించవచ్చు,   జరిమానా కూడా విధిస్తారు.  ఒకవేళ  అత్యాచారంవల్ల మరణం లేదా శాశ్వత కోమా (పర్సిస్టెంట్ వెజిటేటివ్ స్టేట్) జరిగితే, శిక్ష జీవిత ఖైదు లేదా మరణశిక్షగా మారవచ్చు. ఈ కేసులో రేప్-మర్డర్ కాంబినేషన్ కాబట్టి, శిక్షలు మరింత కఠినంగా (డబుల్ లైఫ్ లేదా డెత్) ఉండవచ్చు.
 
2007 డిసెంబర్ 27న విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలోని హాస్టల్‌లో 17-19 ఏళ్ల ఆయేషా మీరాని అత్యాచారం చేసి హత్య చేశారు.   పిడతల సత్యంబాబును నిందితుడిగా గుర్తించి  2010లో  కోర్టు జీవిత కైదు విధించారు.  కానీ 2017లో హైకోర్టు అతన్ని నిర్దోషిగా విడుదల చేసింది. 2018లో హైకోర్టు ఆదేశాలతో సీబీఐకి కేసు అప్పగించారు.                   
  
2018 నుంచి 7 ఏళ్ల పాటు దర్యాప్తు చేసిన సీబీఐ, జూన్ 2025లో తుది నివేదికను హైకోర్టు సూచనలతో విజయవాడ సీబీఐ స్పెషల్ కోర్టుకు సమర్పించింది.   260 మంది సాక్షుల్ని ను విచారించారు.  సత్యంబాబు స్వగ్రామం లో అతన్ని ప్రశ్నించారు.  ఆయేషా మృతదేహాన్ని ఖననం చేసి రీ-పోస్ట్ మార్టం, డీఎన్‌ఏ టెస్టులు చేశారు. మొదటి దర్యాప్తులో ఆధారాల  ట్యాంపరింగ్ పై 50 పోలీసులు, సాక్షులను ప్రశ్నించారు.

 సీబీఐ నివేదికలో అసలు దోషులు ఎవరు అన్నది నివేదిక ఇంకా పూర్తిగా బయటకు రాలేదు.కోర్టుకు సీల్డ్ కవర్‌లో సమర్పించారు. అయితే కోర్టు తాజాగా   సత్యంబాబు  పై సెక్షన్లు 376, 302 కింద అభియోగాలు (FIR) నమోదు చేయాలని సీబీఐ సూచించినట్టు, దానికి అభ్యంతరాలు ఉంటే తెలపాలని కోర్టు అడిగింది. తల్లిదండ్రులు సెప్టెంబర్ 19న కోర్టులో హాజరు కావాల్సి ఉంది. అప్పుడే అసలు విషయం బయటపడే అవకాశం ఉంది.                

 

టాప్ హెడ్ లైన్స్

UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Software Engineer Suicide: ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jailer 2 Twitter Review - 'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
AP Sarpanch Elections Schedule: ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
Dussehra Navratri Day 5 : అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
Embed widget