Former MLA Daughter Suiside : మాజీ ఎమ్మెల్యే కుమార్తె ఆత్మహత్యకు కారణం ఏమిటి ? పోలీసులకు సూసైడ్ నోట్ దొరికిందా ?
అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కుమార్తె ఆత్మహత్యకు కారణాలేమిటన్నదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. సూసైడ్ నోట్ లాంటిదేమీ దొరకలేదని తెలుస్తోంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ( Thati Venkateswarlu )కుమార్తె మహాలక్ష్మి ఆత్మహత్య వ్యవహారం కలకలం రేపుతోంది. సారపాక గ్రామంలోని తన నివాసంలో మహాలక్ష్మి ఉరి వేసుకున్న స్థితిలో కనిపించారు. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆమెను భద్రాచలంలోని ( Bhadrachalam )ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె చనిపోయినట్లుగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన బూర్గంపాడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుమార్తె మరణవార్త తెలిసిన వెంటనే దమ్మపేట నివాసంలో ఉంటున్న వెంకటేశ్వర్లు సారపాక చేరుకున్నారు.
వీహెచ్ ఇంటిపై రాళ్ల దాడి, కారు ధ్వంసం! నిందితుడు ఇతనే - VHను పరామర్శించిన రేవంత్
తాటి మహాలక్ష్మి ( Thali Mahalakshmi ) వైద్యురాలు. ఇటీవలే ఆమె కరీంనగర్ మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. పీజీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎంట్రన్స్ కోసం ప్రిపేరవుతున్నారు. ఉజ్వలమైన భవిష్యత్ ఉన్న మహాలక్ష్మి హఠాత్తుగా ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో కుటుంబసభ్యులు కూడా చెప్పలేకపోతున్నారు. మహాలక్ష్మి సూసైడ్ నోట్ ( Suisid Note ) ఏమైనా రాశారా లేదా అన్నదానిపై పోలీసులు నోరు మెదపడం లేదు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబసమస్యలు ఏమైనా ఉన్నాయా లేదా అకడమిక్ పరంగా ఎమైనా ఒత్తిడి ఎదుర్కొంటున్నారా అన్న అంశాలపైనా దర్యాప్తు చేస్తున్నారు.
రైతులతో పెట్టుకుంటే అట్లుంటది మరి- అధికారులకు చుక్కలు చూపిస్తున్న అన్నదాత
తాటి మహాలక్ష్మి చదువులో మొదటి నుంచి చురుకుగా ఉంటారు. ఆత్మహత్య చేసుకునేంత పిరికితనం ఆమెకు లేదని కుటుంబసభ్యులు అంటున్నారు. తాటి వెంకటేశ్వర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అశ్వారావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్‌లో చేరారు. గత ఎన్నికల్లో అశ్వారావు పేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత టీఆర్ఎస్ రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. ఆయన దమ్మపేటలో ఉంటూ రాజకీయాలు చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులు సారపాకలో ఉంటారని తెలుస్తోంది.
టీఆర్ఎస్ నేత కుమార్తె ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులు కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. సూసైడ్ నోట్ ఏమైనా ఉందోమో చూసి... ఆమె సోషల్ మీడియా ఖాతాలు.. ఇతరులతో ఏమైనా వివాదాలున్నాయా వంటి వాటిని పరిశీలిస్తున్నారు. ఆత్మహత్య ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. మెడికో కావడంతో ఏం జరిగిందా అని చర్చించుకుంటున్నారు.
టీఆర్ఎస్ నేత కుమార్తె ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులు కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. సూసైడ్ నోట్ ఏమైనా ఉందోమో చూసి... ఆమె సోషల్ మీడియా ఖాతాలు.. ఇతరులతో ఏమైనా వివాదాలున్నాయా వంటి వాటిని పరిశీలిస్తున్నారు. ఆత్మహత్య ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. మెడికో కావడంతో ఏం జరిగిందా అని చర్చించుకుంటున్నారు.