అన్వేషించండి

Amalapuram News : అమలాపురం అల్లర్ల కేసు, మరో 26 మంది అరెస్టు

Amalapuram News : అమలాపురం అల్లర్ల కేసులో మరో 26 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకూ 176 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.

Amalapuram News : కోనసీమ జిల్లా అమలాపురం అల్లర్ల కేసులో మరో 26 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు.  ఇవాళ్టి అరెస్టులతో ఇప్పటి వరకు 176 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అల్లర్ల కేసుకు సంబంధించి సమగ్ర దర్యాప్తు జరుగుతోందని పోలీసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అరెస్ట్ చేసిన వ్యక్తులు అల్లర్లలోను, వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్నట్లు తెలిపారు. సీసీ టీవీ కెమెరా, పలు వీడియోలు ద్వారా నిందితులను గుర్తించామన్నారు.  కోనసీమ వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ 30తో పాటు 144 సెక్షన్ అమలులో ఉన్నందున ర్యాలీలు, బహిరంగ సమావేశాలు నిషేధమని మరోసారి స్పష్టం చేశారు. అమలాపురం పట్టణంలో పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. 

మంత్రి అనుచరులే! 

కోనసీమ జిల్లా పేరు మార్పు విషయంలో చెలరేగిన అల్లర్ల వ్యవహారంలో పోలీసులు నిందితులను గుర్తించారు. అందులో మంత్రి పినిపే విశ్వరూప్ అనుచరులే ఉన్నట్లుగా పోలీసులు తేల్చారు. ఈ మేరకు నలుగురు వైఎస్ఆర్ సీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మంత్రి విశ్వరూప్ అనుచరులుగా ఉన్న సత్యరుషి, మట్టపర్తి మురళీ, వాసంశెట్టి సుభాష్, మట్టపర్తి రఘులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయి ఉన్న వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు వీరిపై కేసులు పెట్టారు. అయితే, ప్రస్తుతం వీరు పరారీలో ఉన్నారని, వీరిని వెతికి పట్టుకొనే ప్రయత్నం చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.

మే 24న ఘటన

కోనసీమ జిల్లా పేరును అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తూ జీవో విడుదల చేసిన వెంటనే అమలాపురంలో పెద్ద ఎత్తున అల్లర్లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే 258 మంది నిందితులను పోలీసులు నిందితులుగా చేర్చారు. వీరిలో 176 మందిని ఇప్పటిదాకా అరెస్టు చేశారు. మిగతా నిందితులు పరారీలో ఉన్నారని అన్నారు. వారి కోసం పోలీసులు వెతుకుతున్నారు. మే 24వ తేదీన కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. ఈ హింసాత్మక ఘటనల్లో అల్లరి మూకలు మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్లని తగలబెట్టారు. దీంతో ఆ అల్లర్ల ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేశారు. దొరికిన వారిని అరెస్టు చేశారు.

Also Read : Pawan Kalyan : ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోదీతోనే విభేదించాను - పవన్ కల్యాణ్

Also Read : Ysrcp Internal Issues : వైసీపీలో అంతర్గత కుమ్ములాటలకు జగన్ పుల్ స్టాప్, వివాదాలకు దూరంగా ఉండాలని ఆదేశాలు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: తల్లిపై కేసు వేసిన కొడుకు - మేనల్లుడి, మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామ - జగన్‌పై షర్మిల విమర్శలు
తల్లిపై కేసు వేసిన కొడుకు - మేనల్లుడి, మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామ - జగన్‌పై షర్మిల విమర్శలు
Waqf Bill YSRCP:  Waqf Bill YSRCP: వక్ఫ్ బిల్లుపై రాజ్యసభ ఓటింగ్‌లో వైసీపీ పాల్గొనలేదా ? ఓట్ల లెక్కల్లో తేడాలు ఏం చెబుతున్నాయి?
Waqf Bill YSRCP: వక్ఫ్ బిల్లుపై రాజ్యసభ ఓటింగ్‌లో వైసీపీ పాల్గొనలేదా ? ఓట్ల లెక్కల్లో తేడాలు ఏం చెబుతున్నాయి?
HCU Land Dispute: ఆ వీడియోనే రేవంత్ సర్కార్ కొంపముంచిందా? HCU భూవివాదంలో ఊహించని ట్విస్ట్!
ఆ వీడియోనే రేవంత్ సర్కార్ కొంపముంచిందా? HCU భూవివాదంలో ఊహించని ట్విస్ట్!
Andhra Pradesh Liquor Scam:  ఏపీ లిక్కర్ స్కాంలో సిట్ దూకుడు - కసిరెడ్డికి హైకోర్టులో లభించని ఊరట
ఏపీ లిక్కర్ స్కాంలో సిట్ దూకుడు - కసిరెడ్డికి హైకోర్టులో లభించని ఊరట
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Angkrish Raghuvanshi 50 vs SRH | ఐపీఎల్ చరిత్రలో ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేసిన రఘువంశీKamindu Mendis Ambidextrous Bowling vs KKR | IPL 2025 లో చరిత్ర సృష్టించిన సన్ రైజర్స్ ప్లేయర్Sunrisers Flat Pitches Fantasy | IPL 2025 లో టర్నింగ్ పిచ్ లపై సన్ రైజర్స్ బోర్లాSunrisers Hyderabad Failures IPL 2025 | KKR vs SRH లోనూ అదే రిపీట్ అయ్యింది

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: తల్లిపై కేసు వేసిన కొడుకు - మేనల్లుడి, మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామ - జగన్‌పై షర్మిల విమర్శలు
తల్లిపై కేసు వేసిన కొడుకు - మేనల్లుడి, మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామ - జగన్‌పై షర్మిల విమర్శలు
Waqf Bill YSRCP:  Waqf Bill YSRCP: వక్ఫ్ బిల్లుపై రాజ్యసభ ఓటింగ్‌లో వైసీపీ పాల్గొనలేదా ? ఓట్ల లెక్కల్లో తేడాలు ఏం చెబుతున్నాయి?
Waqf Bill YSRCP: వక్ఫ్ బిల్లుపై రాజ్యసభ ఓటింగ్‌లో వైసీపీ పాల్గొనలేదా ? ఓట్ల లెక్కల్లో తేడాలు ఏం చెబుతున్నాయి?
HCU Land Dispute: ఆ వీడియోనే రేవంత్ సర్కార్ కొంపముంచిందా? HCU భూవివాదంలో ఊహించని ట్విస్ట్!
ఆ వీడియోనే రేవంత్ సర్కార్ కొంపముంచిందా? HCU భూవివాదంలో ఊహించని ట్విస్ట్!
Andhra Pradesh Liquor Scam:  ఏపీ లిక్కర్ స్కాంలో సిట్ దూకుడు - కసిరెడ్డికి హైకోర్టులో లభించని ఊరట
ఏపీ లిక్కర్ స్కాంలో సిట్ దూకుడు - కసిరెడ్డికి హైకోర్టులో లభించని ఊరట
Andhra Latest News:ఏపీ సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కొత్త విధానం- పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి
ఏపీ సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కొత్త విధానం- పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి
SSMB 29: మహేష్ బాబు సినిమా కోసం రాజమౌళి కీలక నిర్ణయం... సీక్వెల్ ట్రెండ్‌కు ఎండ్ కార్డ్... కారణం ఇదేనా?
మహేష్ బాబు సినిమా కోసం రాజమౌళి కీలక నిర్ణయం... సీక్వెల్ ట్రెండ్‌కు ఎండ్ కార్డ్... కారణం ఇదేనా?
LYF Movie Review - 'లైఫ్' రివ్యూ: కొడుక్కి మాత్రమే కనిపించే తండ్రి ఆత్మ... అఘోరలు వచ్చి అబ్బాయిని బతికిస్తే?
'లైఫ్' రివ్యూ: కొడుక్కి మాత్రమే కనిపించే తండ్రి ఆత్మ... అఘోరలు వచ్చి అబ్బాయిని బతికిస్తే?
Waqf Amendment Bill 2025: రెండు సభలు వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదించిన తర్వాత నెక్స్ట్‌ స్టెప్ ఏంటీ? చట్టం ఎలా పని చేస్తుంది?
రెండు సభలు వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదించిన తర్వాత నెక్స్ట్‌ స్టెప్ ఏంటీ? చట్టం ఎలా పని చేస్తుంది?
Embed widget