X

AP Crime News: ఆస్తి రాసిస్తావా.. సిలిండర్‌ పేల్చి చంపేయాలా? అత్తను బెదిరించిన అల్లుడు

అమ్మలా ఆలనా పాలనా చూసిన అత్తనే చంపేందుకు సిద్ధమయ్యాడో కర్కశుడు.. కిడ్నాప్‌ చేసి ఆమెను ఇంట్లో బంధించి సిలిండర్‌తో తగులబెట్టేందుకు ప్రయత్నించాడు.

FOLLOW US: 

ఆస్తి కోసం బంధాలను మర్చిపోయి దారుణాలకు ఒడిగడుతోన్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. నిన్న వరంగల్‌ నగరంలోని ఎల్బీ నగర్‌లో వ్యాపార లావాదేవీ గొడవల కారణంగా సొంత అన్న, వదినలను తమ్ముడు హత్య చేసిన విషయం తెలిసిందే. ఇది జరిగిన రోజు వ్యవధిలోనే ఏపీలో మరో ఘటన చోటుచేసుకుంది. ఆస్తి కోసం అత్తను మట్టుబెట్టాలనుకున్నాడో కర్కశుడు. ఆస్తి రాయకపోతే గ్యాస్ సిలిండర్ పేల్చి చంపేస్తానని బెదరించాడు. బాధితురాలి కూతురు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటన ప్రకాశం జిల్లా సంతమాగులూరులో జరిగింది. 

పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సంతమాగులూరుకు చెందిన బాలిరెడ్డి గతంలో హత్యకు గురయ్యాడు. బాలిరెడ్డికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు (చిన వెంకట రెడ్డి) ఉన్నారు. తండ్రి చనిపోవడంతో మేనత్త మందాల బాలేశ్వరి అతడిని పెంచి పెద్ద చేసింది. ఆమె గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేమవరంలో నివసిస్తోంది. వేమవరం వెళ్లిన చిన వెంకట రెడ్డి.. తనతో పాటు సంతమాగులూరు రావాలని లేకుంటే ఇనుప రాడ్‌తో కొట్టి చంపుతానని బాలేశ్వరిని బెదిరించాడు. దీంతో ఆమె సంతమాగులూరు వెళ్లింది. అక్కడకు చేరుకున్నాక.. ఆస్తి అంతా తన పేరున రాయాలని లేకుంటే గ్యాస్‌ సిలిండర్‌ పేల్చి తగలబెట్టేస్తానని చిన వెంకట రెడ్డి బెదిరించాడు. 

పోలీసుల చాకచక్యం..
అనుకున్నదే తడవుగా బాలేశ్వరిని ఒక గదిలో బంధించి.. ఇనుప గ్రిల్స్‌కు, ఇంటికి చిన వెంకట రెడ్డి తాళాలు వేశాడు. ఈ విషయం బాలేశ్వరి కుమార్తెకు తెలియడంతో ఆమె స్థానిక పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. చిన వెంకట రెడ్డితో సంప్రదింపులు జరిపారు. అతడిని మాటల్లో పెట్టి ఇంటి వెనుక వైపు చాకచక్యంగా లోపలికి వెళ్లగలిగారు. గమనించిన చిన వెంకట రెడ్డి.. పోలీసులపై దాడికి దిగాడు. గ్యాస్‌ సిలిండర్‌ పేల్చేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, బాధితురాలి కుమార్తె పోలీసులకు సమాచారం ఇవ్వడం ఏ మాత్రం ఆలస్యమైనా పెను ప్రమాదం వాటిల్లేదని స్థానికులు అంటున్నారు. 

Also Read: Warangal Crime: వరంగల్‌లో దారుణం.. సొంత అన్న ఫ్యామిలీపై కత్తులతో దాడి.. ముగ్గురు అక్కడికక్కడే మృతి

Also Read: Hyderabad News: బోటి కూర కోసం మందుబాబు రచ్చరచ్చ.. వేడి వేడిగా ఇవ్వలేదంటూ కాగుతున్న నూనె పోసి దాడి..

Tags: AP AP Crime news AP Crime Santamagaluru Prakasham district Gas cylinder blast

సంబంధిత కథనాలు

Indian family: అమెరికా సరిహద్దుల్లో భారత కుటుంబం దుర్మరణం.. చలికి గడ్డకట్టుకుపోయి..!

Indian family: అమెరికా సరిహద్దుల్లో భారత కుటుంబం దుర్మరణం.. చలికి గడ్డకట్టుకుపోయి..!

Mahesh Bank Hacking: మహేశ్ బ్యాంక్ హ్యాకింగ్ కేసు... ముగ్గురి ఖాతాల్లో రూ.12.4 కోట్లు జమ... అక్కడి నుంచి 128 ఖాతాలకు బదిలీ...

Mahesh Bank Hacking: మహేశ్ బ్యాంక్ హ్యాకింగ్ కేసు... ముగ్గురి ఖాతాల్లో రూ.12.4 కోట్లు జమ... అక్కడి నుంచి 128 ఖాతాలకు బదిలీ...

Yediyurappa Granddaughter Dead: మాజీ సీఎం మనవరాలు ఆత్మహత్య.. కారణమిదే!

Yediyurappa Granddaughter Dead: మాజీ సీఎం మనవరాలు ఆత్మహత్య.. కారణమిదే!

Hyderabad Drugs Case: డ్రగ్స్ కేసులో రేపటి నుంచి పోలీసు కస్టడీకి టోనీ... పరారీలో ఉన్న వ్యాపారవేత్తల కోసం పోలీసుల గాలింపు

Hyderabad Drugs Case: డ్రగ్స్ కేసులో రేపటి నుంచి పోలీసు కస్టడీకి టోనీ... పరారీలో ఉన్న వ్యాపారవేత్తల కోసం పోలీసుల గాలింపు

Bhadradri Kottagudem: కూలీల వాహనాన్ని ఢీకొట్టిన టిప్పర్... పనికి వెళ్తూ అనంతలోకాలకు...నలుగురు మృతి, 8 మందికి గాయాలు

Bhadradri Kottagudem: కూలీల వాహనాన్ని ఢీకొట్టిన టిప్పర్... పనికి వెళ్తూ అనంతలోకాలకు...నలుగురు మృతి, 8 మందికి గాయాలు
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్... త్వరలో సర్వదర్శనం ఆఫ్ లైన్ టికెట్లు...!

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్... త్వరలో సర్వదర్శనం ఆఫ్ లైన్ టికెట్లు...!

Redmi Note 11: రూ.14 వేలలోపే రెడ్‌మీ నోట్ 11 సిరీస్ లాంచ్.. 5జీ స్మార్ట్ ఫోన్లు కూడా!

Redmi Note 11: రూ.14 వేలలోపే రెడ్‌మీ నోట్ 11 సిరీస్ లాంచ్.. 5జీ స్మార్ట్ ఫోన్లు కూడా!

Punjab Politics : సిద్ధూ డబ్బు మనిషి ..తల్లిని కూడా పట్టించుకోలేదు.. సోదరి తీవ్ర ఆరోపణలు !

Punjab Politics :  సిద్ధూ డబ్బు మనిషి ..తల్లిని కూడా పట్టించుకోలేదు..  సోదరి తీవ్ర ఆరోపణలు !

Elon Musk: నీకు రూ.3.75 లక్షలు ఇస్తా.. నన్ను వదిలేయ్ బ్రో.. యువకుడికి ఎలాన్ మస్క్ రిక్వెస్ట్.. ఆ టీనేజర్ ఏం చేశాడంటే?

Elon Musk: నీకు రూ.3.75 లక్షలు ఇస్తా.. నన్ను వదిలేయ్ బ్రో.. యువకుడికి ఎలాన్ మస్క్ రిక్వెస్ట్.. ఆ టీనేజర్ ఏం చేశాడంటే?