Hyderabad News: బోటి కూర కోసం మందుబాబు రచ్చరచ్చ.. వేడి వేడిగా ఇవ్వలేదంటూ కాగుతున్న నూనె పోసి దాడి..
మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు బోటి కూర కావాలని వైన్ షాప్ నిర్వాహకుడిని అడిగాడు. కూర వేడిగా లేదు, వేడి చేసి మళ్లీ తీసుకురమ్మని విసిగించాడు. కూర తీసుకురానుందుకు మసిలే నూనెను నిర్వాహకుడిపై పోశాడు.
మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు బోటి కూర కావాలని వైన్ షాప్ నిర్వాహకుడిని అడిగాడు. అతడు కూర తెచ్చి ఇచ్చాడు. కూర వేడిగా లేదు, వేడి చేసి మళ్లీ తీసుకురమ్మని విసిగించాడు. తాగిన మత్తులో గట్టిగా అరుస్తూ కేకలు పెట్టాడు. కూర తీసుకురానుందుకు మసిలే నూనెను నిర్వాహకుడిపై పోశాడు. ఈ ఘటన నాచారం ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లాపూర్‌లోని ఓ వైన్స్ పర్మిట్ రూంలో మీర్‌పేట్ హెచ్‌బీ కాలనీకి చెందిన ధర్మేందర్ అనే వ్యక్తి సోమవారం రాత్రి మద్యం తాగుతున్నాడు.
మల్లాపూర్‌కు చెందిన శివ కుమార్ అనే వ్యక్తి అక్కడికి వెళ్లాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ధర్మేందర్.. బోటి కూర వేడి చేసుకురావాలని శివ కుమార్‌ని విసిగించాడు. అంతటితో ఆగకుండా గట్టిగా కేకలు పెట్టాడు. దీంతో శివ కుమార్ ధర్మేందర్‌ను హెచ్చరించాడు. నువ్వు నాకు చెప్పేదేమిటంటూ ధర్మేందర్ స్నేహితులు ముగ్గురు శివ కుమార్‌పై బండ రాయితో దాడి చేశారు. అంతటితో ఆగకుండా.. పక్కనే ఉన్న బజ్జీల కడాయిలో కాగుతున్న నూనె ఆయనపై పోశారు. ఘటనలో శివ కుమార్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శివ కుమార్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మద్యం మత్తులో జరిగే నేరాలు పోలీసులకు తలనొప్పిగా మారుతున్నాయి.
Also Read: Warangal Crime: వరంగల్‌లో దారుణం.. సొంత అన్న ఫ్యామిలీపై కత్తులతో దాడి.. ముగ్గురు అక్కడికక్కడే మృతి
వరంగల్‌లో దారుణం..
వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. బుధవారం తెల్లవారు జామునే చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సొంత తమ్ముడే అన్న కుటుంబంపై గొడ్డలి, కత్తితో దాడి చేశాడు. వారు నిద్రిస్తున్న సమయంలో ఈ దాడికి పాల్పడడంతో ఆ కుటుంబంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వరంగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ నగరంలోని ఎల్బీ నగర్‌లో మహమ్మద్ చాంద్ బాషా కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆయనకు తన సొంత తమ్ముడు షఫీతో కలిసి ఏడాది కాలంగా పశువుల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే లావాదేవీల విషయంలో ఇద్దరి మధ్య వివాదం నడుస్తోంది. దాదాపు రూ.కోటి విషయంలో వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో అన్నపైనే కోపం పెంచుకున్న షఫీ.. బుధవారం చాంద్‌బాషా కుటుంబంపై దాడి చేసి దారుణానికి ఒడిగట్టాడు.
Also Read: Gold-Silver Price: రెండో రోజు తగ్గిన బంగారం ధరలు.. పసిడి బాటలోనే వెండి పయనం.. నేటి ధరలు ఇలా..