అన్వేషించండి

Crime News: తెలంగాణలో దారుణాలు - రెండో తరగతి విద్యార్థినితో 9వ తరగతి విద్యార్థి అసభ్య ప్రవర్తన, ప్రేమ వేధింపులతో మైనర్ ఆత్మహత్య

Telangana News: ఉప్పల్‌లోని ప్రముఖ స్కూల్‌లో రెండో తరగతి విద్యార్థినిపై తొమ్మిదో తరగతి విద్యార్థి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. అటు, మేడ్చల్ జిల్లాలో ఓ యువకుడి వేధింపులతో బాలిక ఆత్మహత్యకు పాల్పడింది.

Minor Abused By Another Minor In Hyderabad: తెలంగాణలో దారుణాలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ ఉప్పల్‌లోని (Uppal) ఓ ప్రముఖ స్కూల్‌లో చిన్నారిపై ఓ విద్యార్థి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. రెండో తరగతి విద్యార్థినిపై తొమ్మిదో తరగతి విద్యార్థి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఆందోళనకు దిగారు. సదరు విద్యార్థికి పాఠశాల యాజమాన్యం టీసీ ఇచ్చి పంపించేసింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు నిరసనగా స్కూల్ ముందు పలు విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన నిర్వహించారు. మేనేజ్మెంట్ స్పందించకుంటే పెద్ద ఎత్తున ధర్నాకు దిగుతామని పేరెంట్స్, విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. వారికి పలు రాజకీయ పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. ఈ క్రమంలో పాఠశాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. 

వేధింపులతో మైనర్ ఆత్మహత్య

అటు, మేడ్చల్ జిల్లాలో (Medchal District) ప్రేమ వేధింపులతో ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీనగర్‌లో నివాసముంటున్న శారద, కుమార్ దంపతులకు ముగ్గురు బాలికల సంతానం. మొదటి అమ్మాయి (16) సిద్ధిపేట జిల్లాలో 9వ తరగతి చదువుకుంటూ ఓ హాస్టల్‌లో ఉండేది. ఇటీవలే ఆమె బాలాజీనగర్‌లోని తన ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో అదే ప్రాంతంలో కూల్ డ్రింక్ షాపులో పని చేసే శివ (20) అనే యువకుడు ఆమెను ప్రేమ పేరుతో వేధించడం మొదలుపెట్టాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వారు అందించిన సమాచారం మేరకు, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. యువకుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఏపీలోనూ దారుణం 

అటు, ఏపీలోనూ దారుణం జరిగింది. ఓ స్కూల్ కరస్పాండెంట్ బాలికలపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన అనంతపురంలో (Anantapuram) జరిగింది. అనంతపురం ఆదిమూర్తి నగర్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో బాలికలపై స్కూల్ కరస్పాండెంట్ ఆంజనేయులు గౌడ్ అసభ్యంగా ప్రవర్తించాడని వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం ఎవరికీ చెప్పకూడదని బాలికలకు డబ్బులు, తినుబండారాలు ఇస్తున్నాడని.. మరికొందరిని బెదిరించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఓ చిన్నారి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో కరస్పాండెంట్ అసలు భాగోతం వెలుగుచూసింది. ఈ క్రమంలో శుక్రవారం పాఠశాల వద్ద బాలికల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధిత బాలికను సఖి సెంటర్‌కు తరలించారు. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా మృగాళ్ల తీరు మారడం లేదని.. నిందితున్ని కఠినంగా శిక్షించాలని బాలికల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Crime News: తెలుగు రాష్ట్రాల్లో క్రైమ్ స్టోరీస్ - ఓ చోట భార్యను రాడ్‌తో కొట్టి చంపిన భర్త, మరో చోట సూసైడ్ లెటర్ రాసి మరీ దంపతుల అదృశ్యం

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Nadargul Land Scam: రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
Hyderabad Crime News: కుమార్తెను హుస్సేన్ సాగర్‌లో విసిరేసిన కన్నతల్లి.. ప్రాణాలకు తెగించి కాపాడిన ఆటో డ్రైవర్
కుమార్తెను హుస్సేన్ సాగర్‌లో విసిరేసిన కన్నతల్లి.. ప్రాణాలకు తెగించి కాపాడిన ఆటో డ్రైవర్
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget