అన్వేషించండి

Stocks To Watch 14 November 2023: ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' Tata Moto, Grasim, ICICI, Asian Paints

Stocks Markets News: ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

Stock Market Today, 14 November 2023: ముహూరత్‌ ట్రేడింగ్‌ తర్వాత ఇన్‌ఫ్లేషన్‌ డేటా మీద ఇన్వెస్టర్లు ముందు జాగ్రత్త పడడంతో సోమవారం ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్లు క్షీణించాయి. యూఎస్‌లో, అక్టోబర్‌ శాంతించిన CPI ఇన్‌ఫ్లేషన్‌ లెక్కలకు ఈ రోజు మార్కెట్లు ప్రతిస్పందిస్తాయి.

పెరిగిన US స్టాక్స్
మంగళవారం రోజున S&P 500, నాస్‌డాక్‌ విపరీతంగా లాభపడ్డాయి. ఈ ఏడాది ఏప్రిల్ 27 తర్వాత అతి పెద్ద వన్‌-డే లాభాలను సృష్టించాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఇక పెంచదు అనే అభిప్రాయానికి, మార్కెట్‌ అంచనా వేసిన దాని కంటే తగ్గిన ద్రవ్యోల్బణం డేటా మద్దతుగా నిలిచింది.

ర్యాలీలో ఆసియా స్టాక్స్‌
ద్రవ్యోల్బణంలో మందగమనంతో ఫెడరల్ రిజర్వ్ దూకుడుకు బ్రేక్‌ పడిందన్న అంచనాలతో ఆసియాలోని స్టాక్స్‌ ర్యాలీ చేశాయి. గత సెషన్‌లో జారిపోయిన ట్రెజరీ ఈల్డ్స్‌, డాలర్ వాల్యూ ఇప్పుడు స్థిరంగా ఉన్నాయి.

ఈ రోజు ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 14 పాయింట్లు లేదా 0.07 శాతం రెడ్‌ కలర్‌లో 19,734 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

ఈ రోజు Q2 FY24 ఫలితాలు ప్రకటించనున్న కంపెనీలు: LIC, ONGC, కోల్ ఇండియా, M&M, ఐషర్ మోటార్స్, BSE, హిందాల్కో. ఈ కంపెనీ షేర్లు ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉంటాయి.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 

గ్రాసిమ్‌: 2023 సెప్టెంబర్‌ క్వార్టర్‌లో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఏకీకృత నికర లాభం 15% వృద్ధితో రూ. 1164 కోట్లకు పెరిగింది. అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంలో (YoY) లాభం రూ. 1,009 కోట్లుగా ఉంది.

టాటా మోటార్స్: టాటా మోటార్స్‌ అనుబంధ సంస్థ అయిన టాటా టెక్నాలజీస్, ఈ నెల 22న ప్రారంభమయ్యే IPO కోసం RHPని సెబీకి దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో టాటా మోటార్స్ షేర్లు మార్కెట్‌ ఫోకస్‌లో ఉంటాయి.

ICICI బ్యాంక్: జైప్రకాష్ అసోసియేట్స్ (JAL)తో పాటు ఆ కంపెనీకి అనుబంధంగా ఉన్న ట్రస్ట్‌ల నుంచి ICICI బ్యాంకుకు 7.71% లేదా 18.93 కోట్ల షేర్లు బదిలీ అవుతాయి. JAL చెల్లింపు బాధ్యతల్లో భాగంగా ఈ షేర్లు అందుతాయి.

ఏషియన్ పెయింట్స్: సంస్థ మధ్యకాలిక సామర్థ్య అవసరాలు తీర్చుకోవడానికి, ఖండాలా ప్లాంట్ ఒరిజినల్‌ ఇన్‌స్టాల్‌డ్‌ ప్రొడక్షన్‌ కెపాసిటీని సంవత్సరానికి 4,00,000 KLకి పెంచినట్లు ఏషియన్ పెయింట్స్ తెలిపింది.

RVNL: బ్యాలస్ట్‌లెస్ ట్రాక్‌తో కూడిన నాలుగు నాస్ టన్నెల్స్ (మొత్తం పొడవు 1.6 కి.మీ.) నిర్మాణం కోసం అంగీకార పత్రాన్ని (LoA) RVNL అందుకుంది.

PTC ఇండస్ట్రీస్: సింగిల్-ఎయిల్ జెట్ కోసం విడి భాగాలు అందించడానికి సఫ్రాన్, PTC ఇండస్ట్రీస్ ఒప్పందం కుదుర్చుకున్నాయి.

PVR ఐనాక్స్: ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో 6-స్క్రీన్ మల్టీప్లెక్స్ మైసన్ ఐనాక్స్, ఒడిశాలోని భువనేశ్వర్‌లోని ఉత్కల్ కనికా గల్లెరియా మాల్‌లో 4-స్క్రీన్ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించినట్లు PVR ఐనాక్స్ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలిపింది.

ఇండియాబుల్స్ హౌసింగ్: 2023 సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.298 కోట్ల నికర లాభాన్ని ఇండియాబుల్స్ హౌసింగ్‌ ప్రకటించింది. ఈ కంపెనీకి కార్యకలాపాల ద్వారా రూ.2,227 కోట్ల ఆదాయం వచ్చింది.

నాట్కో ఫార్మా: Q2 FY24లో నాట్కో ఫార్మా నికర లాభం 12% తగ్గి రూ.369 కోట్లకు పరిమితమైంది. కార్యకలాపాల ద్వారా 1,031 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: డిజిటల్‌ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్‌ చేశాక స్టేటస్‌ ఇలా చెక్‌ చేయండి, డౌన్‌లోడ్ చేసుకోండి

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Government Banned OTT Apps: 18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Embed widget