Digital Life Certificate: డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశాక స్టేటస్ ఇలా చెక్ చేయండి, డౌన్‌లోడ్ చేసుకోండి
Jeevan Pramaan Life Certificate Download: లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి ప్రస్తుతం రెండు పద్ధతులు అందుబాటులో ఉన్నాయి.
Digital Life Certificate: దేశవ్యాప్తంగా కోట్లాది మంది పెన్షనర్లు ఉన్నారు, నెలనెలా పెన్షన్ తీసుకుంటున్నారు. ఈ పెన్షనర్లకు ఏటా నవంబర్ నెల చాలా కీలకమైనది. ఈ నెలలో, తమ లైఫ్ సర్టిఫికేట్‌ను పెన్షనర్లు సమర్పించాలి. తాము జీవించే ఉన్నామని, పెన్షన్ తీసుకుంటున్నామని రుజువు చేసే విధానం ఇది. మీకు పెన్షన్ ఇవ్వడం కంటిన్యూ చేయాలని పెన్షన్ ఫండ్ జారీ చేసే సంస్థకు అర్ధం అవుతుంది. నవంబర్ నెలలో లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేకపోతే డిసెంబర్ నుంచి పెన్షన్ జమ కావడం ఆగిపోతుంది.
సెంట్రల్ గవర్నమెంట్ రూల్ ప్రకారం, పింఛనుదార్లు సంవత్సరానికి ఒకసారి తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. ఈ లైఫ్ సర్టిఫికేట్ చెల్లుబాటు 12 నెలలు ఉంటుంది. పెన్షనర్లు, తమ జీవన ప్రమాణ పత్రాన్ని (లైఫ్ సర్టిఫికెట్) బ్యాంక్/పోస్టాఫీస్‌కు సమర్పించాలి. లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి ప్రస్తుతం రెండు పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. పెన్షన్ అకౌంట్ ఉన్న బ్యాంక్ లేదా పోస్టాఫీసుకు నేరుగా వెళ్లి లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవచ్చు. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడం రెండో పద్ధతి. ఈ పద్ధతిలో, బ్యాంక్/పోస్టాఫీసుకు వెళ్లకుండా, ఆన్‌లైన్ ద్వారా సర్టిఫికెట్‌ను సబ్మిట్ చేయవచ్చు.
లైఫ్ సర్టిఫికెట్ జమ చేయడానికి సూపర్ సీనియర్ సిటిజన్లకు (80 ఏళ్లు వచ్చిన లేదా పైబడిన వ్యక్తులు) 2023 అక్టోబర్ 1 - నవంబర్ 10 తేదీల మధ్య సమయం ఇచ్చారు. సీనియర్ సిటిజన్లు (60 ఏళ్లు వచ్చిన లేదా పైబడిన వ్యక్తులు) ఈ పనిని 2023 నవంబర్ 1 - నవంబర్ 30 తేదీల మధ్య పూర్తి చేయాలి. డిజిటల్ మార్గంలో లైఫ్ సర్టిఫికేట్ సమర్పించిన తర్వాత, దాని స్టేటస్‌ను కచ్చితంగా తనిఖీ చేయాలి. దీనివల్ల, సర్టిఫికెట్ సబ్మిషన్‌లో ఏదైనా పొరపాటు జరిగితే అర్ధం అవుతుంది.
డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ స్టేటస్ చెకింగ్:
లైఫ్ సర్టిఫికేట్‌ను సబ్మిట్ చేసిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక SMS వస్తుంది
మీ లైఫ్ సర్టిఫికేట్ ఐడీ వివరాలు ఇందులో ఉంటాయి.
స్టేటస్ తనిఖీ చేయడానికి, మీరు https://jeevanpramaan.gov.in/ppouser/login వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
మీ లైఫ్ సర్టిఫికేట్ ID, క్యాప్చాను ఇక్కడ ఎంటర్ చేయాలి.
ఇప్పుడు మీకు మీ జీవన్ ప్రమాణ్ సర్టిఫికేట్ కనిపిస్తుంది, దానిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
లైఫ్ సర్టిఫికేట్ కనిపించకపోతే పరిస్థితి ఏంటి?
లైఫ్ సర్టిఫికేట్‌ను డిజిటల్ మార్గంలో సమర్పించిన తర్వాత కూడా మీకు అది కనిపించకపోతే ఆందోళన చెందొద్దు. పెన్షన్ అకౌంట్ ఉన్న బ్యాంక్ లేదా పోస్టాఫీసుకు నేరుగా వెళ్లి గానీ, ఇతర మార్గాల్లో గానీ సంప్రదించండి. సాంకేతికంగా ఏదైనా ఇబ్బంది ఉందేమో కనుక్కోండి. ఈ ప్రాసెస్ కోసం, ఇండియన్ పోస్ట్ లేదా బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు ఉంటాయి.
ఒకవేళ, సూపర్ సీనియర్ పెన్షనర్ అనారోగ్యం లేదా ఇతర కారణాల వల్ల బ్యాంకు లేదా పోస్టాఫీస్‌కు వెళ్లలేని పరిస్థితుల్లో ఉంటే.. సంబంధిత అధికారులే సూపర్ సీనియర్ ఇంటికి వెళ్లి సర్వీసు అందిస్తారు. ఈ సర్వీస్ కోసం సంబంధిత బ్యాంక్/పోస్టాఫీస్‌కు రిక్వెస్ట్ పెట్టుకోవాలి.
మరో ఆసక్తికర కథనం: సిల్వర్ స్క్రీన్‌పై మస్క్ మామ జీవిత 'చిత్రం', ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూపులు
Join Us on Telegram: https://t.me/abpdesamofficial