అన్వేషించండి

Share Market Opening Today: బేర్స్‌ దెబ్బకు మార్కెట్ల మైండ్‌ బ్లాంక్‌ - ఐటీ స్టాక్స్‌ విలవిల, 71,000 దగ్గర సెన్సెక్స్‌

అమెరికన్‌ మార్కెట్‌లో క్షీణత కారణంగా నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 2 శాతం వరకు పడిపోయింది.

Stock Market News Today in Telugu: భారతీయ స్టాక్ మార్కెట్‌ ఈ రోజు (బుధవారం, 14 ఫిబ్రవరి 2024) గ్యాప్‌-డౌన్‌తో ప్రారంభమైంది, ప్రపంచ మార్కెట్ల బలహీనత ఇండియన్‌ ఈక్విటీలపై ప్రభావం చూపింది. నిన్న, అమెరికన్‌ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి, ఈ ఉదయం ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. అమెరికన్‌ మార్కెట్‌లో క్షీణత కారణంగా నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 2 శాతం వరకు పడిపోయింది.

ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...

గత సెషన్‌లో (మంగళవారం) 71,555 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 2519.94 పాయింట్లు లేదా 0.73 శాతం భారీ పతనంతో 71,035.25 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. మంగళవారం 21,743 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 165.10 పాయింట్లు లేదా 0.76 శాతం పడిపోయి 21,578.15 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 

విస్తృత మార్కెట్లలో, BSE మిడ్‌ క్యాప్ ఇండెక్స్‌ & స్మాల్‌ క్యాప్ ఇండెక్స్‌ 0.7-1% వరకు క్షీణించాయి.

మార్కెట్‌ ఓపెనింగ్‌ టైమ్‌లో... NSEలో 1372 షేర్లు రెడ్‌ జోన్‌లో ఉంటే, కేవలం 281 షేర్లు మాత్రమే గ్రీన్‌ జోన్‌లో ఉన్నాయి. దాదాపు అన్ని రంగాలపైనా ఎరుపు రంగ నీడ పడింది. మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌ ఎక్కువగా పతనమయ్యాయి.

బ్యాంక్ నిఫ్టీలో భారీ పతనం కారణంగా మొత్తం మార్కెట్‌లో ఉత్సాహం చల్లబడింది. మార్కెట్ ప్రారంభమైన 15 నిమిషాల్లోనే బ్యాంక్ నిఫ్టీ దాదాపు 600 పాయింట్లు పడిపోయి, కీలకమైన 45,000 స్థాయి కంటే దిగజారింది. బ్యాంక్ నిఫ్టీలోని మొత్తం 12 స్టాక్స్‌ రెడ్ మార్క్‌ను సూచిస్తున్నాయి.

సెన్సెక్స్-నిఫ్టీలో అత్యధికంగా పడిపోయిన షేర్లు
ట్రేడ్‌ ప్రారంభంలో.. సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లోని మొత్తం 30 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టీ 50 ప్యాక్‌లోని 46 స్టాక్స్‌ క్షీణించాయి. మార్కెట్‌ ప్రారంభమైన 15 నిమిషాలకే నిఫ్టీలో 200 పాయింట్ల భారీ పతనం కనిపించింది. 

ఈ రోజు, సెన్సెక్స్ & నిఫ్టీలో టాప్ లూజర్‌గా విప్రో నిలిచింది, 2.50 శాతం జారిపోయింది. రెండు సూచీల్లోనూ ఐటీ షేర్లు అత్యధికంగా పడిపోయాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు ఈ రోజు సెన్సెక్స్ & నిఫ్టీలో అతి పెద్ద లూజర్స్‌గా ఉన్నాయి.

ఈ రోజు మార్కెట్‌లో లిస్ట్‌ అయిన కొత్త కంపెనీలు: క్యాపిటల్ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, రాశి పెరిఫెరల్స్, జన స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌.

ఈ రోజు ఉదయం 10.00 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 503.03 పాయింట్లు లేదా 0.70% తగ్గి 71,052.16 దగ్గర; NSE నిఫ్టీ 130.40 పాయింట్లు లేదా 0.60% తగ్గి 21,612.85 వద్ద ట్రేడవుతున్నాయి. 

గ్లోబల్‌ మార్కెట్లు
ఆసియా మార్కెట్లలో... ఈ ఉదయం హాంగ్ సెంగ్, కోస్పి, స్ట్రెయిట్స్ టైమ్స్ తలో 1 శాతానికి పైగా క్షీణించాయి, జపాన్ నికాయ్‌ 0.7 శాతం పడిపోయింది. మార్కెట్‌ అంచనాల కంటే అమెరికన్ ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండడంతో, నిన్న, US మార్కెట్లలో ప్రధాన సూచీలన్నీ 2 శాతం వరకు పడిపోయాయి. లేబర్ డిపార్ట్‌మెంట్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ ప్రకారం, 2024 జనవరిలో సీపీఐ ఇన్‌ఫ్లేషన్‌ 0.3 శాతం పెరిగింది. అయితే, 0.2 శాతం పెరుగుతుందన్న మార్కెట్‌ అంచనాను దాటింది. అందువల్ల, అధిక వడ్డీ రేట్లు ఎక్కువ కాలం కొనసాగవచ్చని పెట్టుబడిదార్లు భయపడ్డారు.

US 10 ఇయర్‌ బాండ్‌ ఈల్డ్‌ సోమవారం నాటి 4.17 శాతంతో పోలిస్తే మంగళవారం 4.3123 శాతానికి పెరిగింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: ఈ సీజన్‌లో 42 లక్షల వివాహాలు, పెళ్లి ఖర్చు తెలిస్తే కళ్లు తేలేస్తారు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Talliki Vandanam News: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
HYDRA Updates: మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
Ticket Reservation Update: ట్రైన్ టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు తగ్గించడానికి కారణమేంటీ? మేలు ప్రయాణికులకా? రైల్వేశాఖకా?
ట్రైన్ టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు తగ్గించడానికి కారణమేంటీ? మేలు ప్రయాణికులకా? రైల్వేశాఖకా?
Tirumala Darshan Ticket For January 2025: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్- కొత్త ఏడాదిలో స్వామి దర్శన టికెట్లపై కీలక అప్‌డేట్ 
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్- కొత్త ఏడాదిలో స్వామి దర్శన టికెట్లపై కీలక అప్‌డేట్ 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబానీ Vs మస్క్: బిలియనీర్స్ మధ్య వార్ ఎందుకు!Adilabad Organic Tattoo: పచ్చబొట్టేసినా.. పెళ్లి గ్యారంటీ - నొప్పులు మాయంLady Justice: న్యాయ దేవతకు కళ్లు వచ్చేశాయా? కత్తి బదులు రాజ్యాంగమా?భారీ విధ్వంసానికి హెజ్బుల్లా ప్లాన్, వీడియోలు విడుదల చేసిన ఇజ్రాయేల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Talliki Vandanam News: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
HYDRA Updates: మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
Ticket Reservation Update: ట్రైన్ టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు తగ్గించడానికి కారణమేంటీ? మేలు ప్రయాణికులకా? రైల్వేశాఖకా?
ట్రైన్ టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు తగ్గించడానికి కారణమేంటీ? మేలు ప్రయాణికులకా? రైల్వేశాఖకా?
Tirumala Darshan Ticket For January 2025: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్- కొత్త ఏడాదిలో స్వామి దర్శన టికెట్లపై కీలక అప్‌డేట్ 
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్- కొత్త ఏడాదిలో స్వామి దర్శన టికెట్లపై కీలక అప్‌డేట్ 
Yahya Sinwar: చావు కోసం ఎదురు చూస్తూ కసితో కత్తి దూసిన సిన్వార్‌ - సినిమా సీన్‌ను తలపిస్తున్న వీడియో
చావు కోసం ఎదురు చూస్తూ కసితో కత్తి దూసిన సిన్వార్‌ - సినిమా సీన్‌ను తలపిస్తున్న వీడియో
Emergency Movie: కంగనా ‘ఎమర్జెన్సీ’కి సెన్సార్ క్లియరెన్స్... మరీ అన్ని కట్స్ అంటే అసలు మ్యాటర్ ఉంటుందా?
కంగనా ‘ఎమర్జెన్సీ’కి సెన్సార్ క్లియరెన్స్... మరీ అన్ని కట్స్ అంటే అసలు మ్యాటర్ ఉంటుందా?
Mrunal Thakur’s Pilgrimage Tour: ఆధ్యాత్మిక పర్యటనలో 'హాయ్ నాన్న' బ్యూటీ - జగేశ్వర్ ధామ్‌లో మృణాల్ ఠాకూర్ పూజలు!
ఆధ్యాత్మిక పర్యటనలో 'హాయ్ నాన్న' బ్యూటీ - జగేశ్వర్ ధామ్‌లో మృణాల్ ఠాకూర్ పూజలు!
Atal Pension Yojana: ఈ స్కీమ్‌లో 7 కోట్ల మంది చేరారు - బెనిఫిట్స్‌ తెలిస్తే మీరూ ఇప్పుడే చేరతారు
ఈ స్కీమ్‌లో 7 కోట్ల మంది చేరారు - బెనిఫిట్స్‌ తెలిస్తే మీరూ ఇప్పుడే చేరతారు
Embed widget