అంబానీ Vs మస్క్: బిలియనీర్స్ మధ్య వార్ ఎందుకు!
స్పేస్ ఎక్స్, టెస్లా లాంటి దిగ్గజ కంపెనీల ఫౌండర్ ఎలన్ మస్క్‌కు.. రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ భయపడుతున్నారా? ఇప్పుడు దీనిపైనే మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. మన దేశంలో శాటిలైట్ ద్వారా మొబైల్ సేవల కోసం satellite broadband spectrum ను కేంద్ర ప్రభుత్వం allocation చేయాల్సి ఉంది. దీనికి ఎలన్ మస్క్ కి చెందిన స్టా్ర్ లింక్ దక్కించుకోవాలని ట్రై చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం.. ఈ స్పెక్ట్రమ్ ను వేలం ద్వారా కాకుండా administrative గానే కేటాయిస్తామని అక్టోబర్ 15న చెప్పింది. దీనిపై ఎలన్ మస్క్ స్పందిస్తూ.. ఇది చాలా మంచి నిర్ణయమని ప్రశంసించారు. స్టార్‌లింక్‌తో భారతదేశ ప్రజలకు సేవ చేయడానికి తమ వంతు కృషి చేస్తామని ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు.
కానీ, ముకేష్ అంబానీ మాత్రం ఆ స్పెక్ట్రమ్ ను వేలం వేయాలని అంటున్నారు. దీంతో మస్క్‌పైన అంబానీనే గెలిచినట్లుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మస్క్ అంటే అంబానీకి ఎందుకంత భయం.. అంటూ మీమ్స్ వస్తున్నాయి. ఇలాగే ఒక వైరల్‌గా మారిన మీమ్‌కు సంబంధించి ఎలన్ మస్క్ కూడా స్పందించారు. భారత్‌లో మెరుగైన ఇంటర్‌నెట్‌ను స్టార్‌లింక్ ద్వారా అదించడానికి అంబానీకి ఏదైనా సమస్య ఉందేమో కాల్ చేసి అడుగుతానని ఎలన్ మస్క్ ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు. అయితే ఇప్పటికే రిలయన్స్ కు చెందిన టెలీకాం సంస్థ జియో మన దేశంలో టాప్ కంపెనీగా ఉంది. కానీ, శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ ను ఇప్పటికే మస్క్ కు చెందిన స్టార్ లింక్ అందిస్తూ ఉంది. ఈ క్రమంలో ఆ విదేశీ కంపెనీతో పోటీ పడాలంటే.. స్పెక్ట్రమ్ ను వేలం వేస్తేనే అంబానీకి కలిసి వస్తుందని అంచనాలు ఉన్నాయి. అందుకే అంబానీ వేలానికి పట్టుబడుతున్నట్లుగా చెబుతున్నారు.