అన్వేషించండి

Talliki Vandanam News: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?

Talliki Vandanam Update: ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నా వచ్చే ఏడాది నుంచి కచ్చితంగా ఎన్నికల హామీలు అమలు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. తల్లికి వందనం కార్యక్రమంతోనే మొదలుపెట్టాలని భావిస్తోంది.

Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితులు క్రమంగా కొలిక్కి వస్తున్న వేళ ఎన్నికల హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగా ఇప్పటికే డీఎస్సీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. సామాజిక పింఛన్లు కూడా వెయ్యి రూపాయలు పెంచి అందిస్తోంది. ఇప్పుడు మరో పథకాన్ని ప్రజలకు అందించేందుకు రెడీ అవుతోంది. 

సూపర్ సిక్స్‌ పేరుతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అందులో కీలకమైన హామీ తల్లికి వందనం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దీన్ని అమ్మ ఒడి పేరుతో అందించింది. దానికి కూటమి ప్రభుత్వం పేరు మార్చి తల్లికి వందనం పేరుతో అమలు చేయనున్నారు. ఈ పథకం కింద చదువుకునే ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో ఏడాదికి 15 వేల రూపాయలు వేయనున్నారు. 

విద్యాసంవత్సరం జూన్‌లో ప్రారంభమైంది. ప్రభుత్వం కూడా అదే నెలలో కొలువు దీరింది. అన్ని సర్దుకొని పథకాలు అమలు చేయడానికి ఇంత టైం పట్టింది. ఆర్థికంగా వ్యవస్థలు అస్తవ్యస్థంగా ఉన్నందున వాటిని సరి చేసేందుకు టైం తీసుకున్నామని అంటున్నారు. అందుకే పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ప్రవేశ పెట్టలేదని చెబుతున్నారు. కేంద్ర సాయంతో వాటన్నింటి నుంచి గట్టేక్కేందుకు శతవిధాల ట్రై చేస్తున్నట్టు వెల్లడించింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు ఒడ్డుకు చేరుతున్నందున సూపర్ సిక్స్ అమలుపై ఫోకస్ చేసినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

సూపర్‌ సిక్స్ అమలులో తల్లికి వందనం పథకంతోనే ప్రారంభించాలని భావిస్తున్నారు. జనవరిలో ఈ పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. కాలేజీకి, స్కూల్‌కు వెళ్లే ప్రతి విద్యార్థి తల్లికి 15 వేల రూపాయలు చొప్పున ఇవ్వబోతున్నారు. ఇంటిలో ఎంత మంది వెళ్తే అంతమందికి ఇవ్వడానికి సిద్దమవుతున్నారు. దీని కోసం 12 వేల కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం లెక్కలు వేస్తోంది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్కూల్స్, కాలేజీల్లో దాదాపు 80 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వారందరికీ ఇస్తారా లేకుంటే అందులో ఇంకా కోతవిధిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడున్న వారందరికీ అమలు చేస్తే మాత్రం 12వేల కోట్లు కావాల్సి ఉంటుంది. 

వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని ఎంత మంది స్కూల్‌కు వెళ్లిన ఒక బిడ్డకు మాత్రమే 15 వేలు ఇస్తామని చెప్పారు. అందులో మూడు వేలు వరకు కోత విధించారు. దీనికి వివిధ కారణాలు చెప్పారు. స్కూల్ నిర్వహణకు వాటిని ఖర్చు చేస్తామని వెల్లడించారు. గతేడాది వైసీపీ ప్రభుత్వం ఈ పథకం కింద రూ.6394 కోట్లు ఖర్చు పెట్టింది. 

కూటమి ప్రభత్వం వచ్చినప్పటి నుంచి సూపర్ సిక్స్ ఎప్పటి నుంచి అమలు చేస్తారని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ వస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభమై ఉన్ని నెలలు అవుతున్నా ఇంత వరకు తల్లికి వందనం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తూ వస్తోంది. టీడీపీ కూడా దానికి కౌంటర్ ఇచ్చింది. 2019 మేలో అధికారం చేపట్టి జగన్ మోహన్ రెడ్డి 2020 జనవరిలో అమ్మ ఒడి పథకాన్ని అణలు చేశారని గుర్తు చేశారు. డేటా, ఆర్థిక వనరులు సమకూర్చుకునేందుకు టైం తీసుకున్నామని చెబుతున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Moosi Project Politics :  మూసి ప్రక్షాళనపై సీఎం రేవంత్ ఆలౌట్ గేమ్ -  బీఆర్ఎస్, బీజేపీలకు గడ్డు పరిస్థితే !
మూసి ప్రక్షాళనపై సీఎం రేవంత్ ఆలౌట్ గేమ్ - బీఆర్ఎస్, బీజేపీలకు గడ్డు పరిస్థితే !
BC Protection Act : బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
Yahya Sinwar Death: హమాస్‌ అధినేత యాహ్యా సిన్వార్‌ను హతమార్చిన ఇజ్రాయెల్- యుద్ధం ఆపేది లేదన్న నెతన్యాహు
హమాస్‌ అధినేత యాహ్యా సిన్వార్‌ను హతమార్చిన ఇజ్రాయెల్- యుద్ధం ఆపేది లేదన్న నెతన్యాహు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబానీ Vs మస్క్: బిలియనీర్స్ మధ్య వార్ ఎందుకు!Adilabad Organic Tattoo: పచ్చబొట్టేసినా.. పెళ్లి గ్యారంటీ - నొప్పులు మాయంLady Justice: న్యాయ దేవతకు కళ్లు వచ్చేశాయా? కత్తి బదులు రాజ్యాంగమా?భారీ విధ్వంసానికి హెజ్బుల్లా ప్లాన్, వీడియోలు విడుదల చేసిన ఇజ్రాయేల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Moosi Project Politics :  మూసి ప్రక్షాళనపై సీఎం రేవంత్ ఆలౌట్ గేమ్ -  బీఆర్ఎస్, బీజేపీలకు గడ్డు పరిస్థితే !
మూసి ప్రక్షాళనపై సీఎం రేవంత్ ఆలౌట్ గేమ్ - బీఆర్ఎస్, బీజేపీలకు గడ్డు పరిస్థితే !
BC Protection Act : బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
Yahya Sinwar Death: హమాస్‌ అధినేత యాహ్యా సిన్వార్‌ను హతమార్చిన ఇజ్రాయెల్- యుద్ధం ఆపేది లేదన్న నెతన్యాహు
హమాస్‌ అధినేత యాహ్యా సిన్వార్‌ను హతమార్చిన ఇజ్రాయెల్- యుద్ధం ఆపేది లేదన్న నెతన్యాహు
Srikakulam: ఇసుక వివాదంలో శ్రీకాకుళం తమ్ముళ్లు- క్లాస్ తీసుకుంటే తప్ప దారికి వచ్చేలా లేరు!
ఇసుక వివాదంలో శ్రీకాకుళం తమ్ముళ్లు- క్లాస్ తీసుకుంటే తప్ప దారికి వచ్చేలా లేరు!
Telangana Cabinet: ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
Karimnagar: బైక్ రైడింగ్ తెలుసా? - విదేశాల్లో ఉద్యోగావకాశాలు, జీతం ఎంతంటే?
బైక్ రైడింగ్ తెలుసా? - విదేశాల్లో ఉద్యోగావకాశాలు, జీతం ఎంతంటే?
Sajjala Ramakrishna Reddy: టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - ముగిసిన సజ్జల రామకృష్ణారెడ్డి  విచారణ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - ముగిసిన సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
Embed widget