Yahya Sinwar: చావు కోసం ఎదురు చూస్తూ కసితో కత్తి దూసిన సిన్వార్ - సినిమా సీన్‌ను తలపిస్తున్న వీడియో
Israel Hamas Gaza War: హమాస్ అధినేతను చంపేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చావు వెంటాడుతున్నా బెదురు లేకుండా కసితో కత్తి దూసిన వీడియో చక్కర్లు కొడుతోంది.
Israel Hamas War: ఏడాది కాలంగా హమాస్‌పై సాగిస్తున్న పోరాటంలో ఎట్టకేలకు ఇజ్రాయెల్ ఘన విజయం సాధించింది. గురువారం (అక్టోబర్ 17) హమాస్ అధినాయకుడు యాహ్యా సిన్వార్ హత్య ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. శత్రునాశనం కోసం ఏడాదిగా చేస్తున్న యుద్ధంలో ఇదో తిరుగులేని విజయం అంటూ ఇజ్రాయెల్ భావిస్తోంది. హమాస్ దాడుల సూత్రధారి యాహ్యా సిన్వార్‌ను హతమార్చినట్లు ఐడీఎఫ్ ఘనంగా ప్రకటించుకుంది. ఆయనతోపాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చినట్టు తెలిపింది.
హమాస్ అధినాయకుడు ఆఖరి నిమిషం వరకు పోరాడాడు అంటూ ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఏడాది కాలంగా హమాస్ కీలక నేతలను వెతికి వెతికి వేటాడి సంహరిస్తున్న ఇజ్రాయెల్ డ్రోన్‌లను ప్రధాన ఆయుధంగా మార్చుకుంది. డ్రోన్ల సహాయంతో శత్రు స్థావరాలను గుర్తించి వారిపై అటాక్ చేస్తూ వచ్చింది.
ఇప్పుడు హమాస్ అధినేత సిన్వార్‌ను కూడా అలాగే డ్రోన్లతో వెతికి మరీ బాంబుల వర్షం కురిపించింది. ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న టైంలో సిన్వార్ ఆఖరి క్షణంలో ఎలా పోరాడాడు అన్నది బాహ్య ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో చూస్తే... ఇజ్రాయెల్ బాంబుల దాడిలో తీవ్రంగా గాయపడిన యాహ్యా సిన్వార్ సోఫాలో కూర్చుని ఉన్నాడు. తనవైపు కుడి చేయి పూర్తిగా చిద్రమైపోయి ఉంది. తన వైపు వస్తున్న డ్రోన్‌ను చూస్తూ... ఎడమ చేయితో తన వద్ద ఉన్న కత్తిని విసిరాడు. డ్రోన్‌ను కిందపడేయాలని ప్రయత్నించాడు.
Israel made the mistake of publishing footage of Yahya Sinwar's last moments.
— Dan Cohen (@dancohen3000) October 17, 2024
Wearing a kufiyyeh and severely injured, he threw a stick at the drone filming him – a final act of defiance against the Zionist occupation.
In his death, he became a legend. pic.twitter.com/bHEpPSY9TD
బుధవారం (అక్టోబర్ 16) గాజాలో ఆపరేషన్ జరుగుతున్నప్పుడు అనుమానాస్పద వ్యక్తి ఆ భవనంలోకి వెళ్లినట్టు 450వ బెటాలియన్ సైనికుడు గుర్తించాడు. సమాచారం తెలుసుకున్న వెంటనే కాల్పులకు దిగినట్టు ఇజ్రాయెల్ మిలిటరీ ఫోర్సెస్ ప్రతినిధి తెలిపారు. కమాండర్ ఆదేశాలతో కాల్పులు జరిపారు. బాంబుల మోత మోగించారు.
తర్వాత అక్కడ ఉన్న పరిస్థితి, ఇంకా ఎవరైనా బతికే ఉన్నారా అని తెలుసుకునేందుకు డ్రోన్ సహాయంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ ముగ్గురు వ్యక్తులు దాక్కోవడానికి యత్నిస్తున్న దృశ్యం కనిపించింది. వెంటనే మరో దఫా కాల్పులు జరిపారు.
ఇజ్రాయెల్ సైనికుల కాల్పులతో ముగ్గురిలో ఇద్దరు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఇంకో వ్యక్తి వ్యక్తి భవనంలోని రెండో అంతస్తులోకి వెళ్లాడు. ఆ ముగ్గురిలో ఒక వ్యక్తి సిన్వార్ అనేది అక్కడి సైనికులకు తెలియదు. వెంటనే యుద్ధ ట్యాంకర్‌తో దాడి చేశారు. దీని కారణంగా భవనం ధ్వంసమైంది. లోపల దాక్కున్న ముగ్గురు వ్యక్తులు కూడా గాయపడ్డారు.
This is how Yahya Sinwar, the Hamxs chief who orchestrated the October 7th attack, looked after he was ended by the IDF.
— Open Source Intel (@Osint613) October 17, 2024
Justice served. pic.twitter.com/6XHdOIMSl6
ఇలా దాడి చేస్తూ వెతుకుతూ దాడి చేస్తూ ఉన్న క్రమంలో చిత్రీకరించిన దృశ్యమే ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతోంది. సోఫాలో కూర్చున్న వ్యక్తి బతికే ఉన్నాడని ధ్రువీకరించుకున్న సైన్యం మరో దఫా కాల్పులు జరిపింది. అంతే అతన్ని నేలకూల్చింది. సిన్వార్ చనిపోయినప్పటి ఫొటోలు కూడా సోషల్ మీడియా తిరుగుతున్నాయి.
డీఎన్‌ఏ పరీక్ష ద్వారా యాహ్యా సిన్వార్ గుర్తింపు
ఇజ్రాయెల్ సైన్యం దాడి అనంతరం గురువారం (అక్టోబర్ 17) భవనంలో వెతకడానికి వెళ్లగా ముగ్గురు డెడ్‌బాడీస్ కనిపించాయి. అందులో ఒకటి యాహ్యా సిన్వార్‌లా కనిపించింది. దీన్ని ధృవీకరించేందుకు సైన్యం DNA పరీక్ష చేయాలని నిర్ణయించుకుంది. మరణించిన వ్యక్తి నిజంగా సిన్వారే కాదా అని తెలుసుకోవడానికి ప్రయత్నించింది. ఈ ప్రయత్నంలో మరణించిన వ్యక్తి సిన్వార్‌గా తేలింది. దీంతో ఇజ్రాయెల్ సైన్యం సంబరాలు చేసుకుంది.