అన్వేషించండి

Weddings: ఈ సీజన్‌లో 42 లక్షల వివాహాలు, పెళ్లి ఖర్చు తెలిస్తే కళ్లు తేలేస్తారు!

పెళ్లి ఖర్చుల రూపంలో దేశవ్యాప్తంగా మార్కెట్లలోకి భారీగా నగదు ప్రవాహం మొదలవుతుంది.

Wedding Season 2024 Expenditure In India: ఇది మాఘమాసం. ఈ మాసంలో బలమైన ముహూర్తాలు ఉంటాయని, మరే నెలలోనూ ఇంతటి అద్భుత ఘడియలు ఉండవని బ్రాహ్మణ పండితులు చెబుతుంటారు. అందుకే.. వివాహాలు, గృహ ప్రవేశాలు సహా చాలా శుభకార్యాలను మాఘ మాసంలో జరిపిస్తుంటారు.

మన దేశంలో, పెళ్లిళ్ల సీజన్‌కు ప్రారంభంగా మాఘ మాసాన్ని గుర్తిస్తారు. ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా లక్షలాది వివాహాలు జరుగుతాయని, దేశ ఆర్థిక వ్యవస్థ లక్షల కోట్ల బూస్టర్ డోస్ లభించొచ్చంటూ 'కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్' (CAIT) లెక్కగట్టింది. CAIT పరిశోధన విభాగం దేశవ్యాప్తంగా 30 నగరాలకు చెందిన వ్యాపారులు, సర్వీస్ ప్రొవైడర్లతో మాట్లాడి, ఒక రిపోర్ట్‌ను విడుదల చేసింది.

'కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ డేటా' ప్రకారం.. 2024 జనవరి 15 నుంచి 2024 జులై 15 వరకు ఉన్న వెడ్డింగ్‌ సీజన్‌లో (ఆరు నెలల కాలం) దేశవ్యాప్తంగా 42 లక్షల వివాహాలు జరుగుతాయి. ఈ కాలంలో వివాహ సంబంధిత కొనుగోళ్లు & సేవల వినియోగం ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సుమారు రూ. 5.5 లక్షల కోట్ల ఆదాయం సమకూరుతుంది. పెళ్లి ఖర్చుల రూపంలో దేశవ్యాప్తంగా మార్కెట్లలోకి భారీగా నగదు ప్రవాహం మొదలవుతుంది. 

ఈ పెళ్లిళ్ల సీజన్‌లో, దేశ రాజధాని దిల్లీలోనే 4 లక్షలకు పైగా వివాహాలు జరిగే అవకాశం ఉందని, దీని వల్ల దాదాపు రూ. 1.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని CAIT జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్‌వాల్ చెప్పారు. గత ఏడాదిలో,  2023 డిసెంబర్ 14న ముగిసిన పెళ్లిళ్ల సీజన్‌లో దాదాపు 35 లక్షల వివాహాలు జరగ్గా, దాదాపు రూ. 4.25 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది.

CAIT ప్రకారం, ఈ సీజన్‌లో పెళ్లిళ్ల ఖర్చులు ఇలా ఉండొచ్చు... 

- దాదాపు 5 లక్షల పెళ్లిళ్లలో, ఒక్కో వివాహానికి రూ. 3 లక్షల వరకు ఖర్చు చేస్తారని అంచనా.
- దాదాపు 10 లక్షల వివాహాల్లో, ఒక్కో శుభకార్యానికి రూ. 3 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా. 
- దాదాపు 10 లక్షల వెడ్డింగ్స్‌లో, ఒక్కో వెడ్డింగ్‌కు రూ. 6 లక్షల నుంచి రూ. 10 లక్షలు వ్యయం చేస్తారని లెక్కగట్టారు. 
- దాదాపు 10 లక్షల పెళ్లిళ్లలో, ఒక్కో పెళ్లికి రూ. 10 లక్షల నుంచి రూ. 15 లక్షలు ఖర్చవుతుంది. 
- దాదాపు 6 లక్షల వివాహాల్లో, ఒక్కో వివాహానికి రూ. 15 లక్షల నుంచి రూ. 25 లక్షలు వ్యయం అవుతుందని అంచనా. 
- దాదాపు 60 వేల వెడ్డింగ్స్‌లో, ఒక్కో వెడ్డింగ్‌కు రూ. 25 లక్షల నుంచి రూ. 50 లక్షలు ఖర్చు చేస్తారని లెక్కించారు. 
- దాదాపు 40 వేల పెళ్లిళ్లలో ఒక్కో పెళ్లికి రూ. 50 లక్షల నుంచి కోటి రూపాయలకు పైగా వ్యయం అవుతుందని అంచనా. 

ఇవన్నీ కలిపితే, ఈ ఆరు నెలల్లో, దాదాపు 42 లక్షల పెళ్లిళ్లలో వివాహ సంబంధిత కొనుగోళ్లు, సేవల ద్వారా రూ. 5.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా.

పెళ్లి ఖర్చు అంటే కేవలం వివాహం, భోజనాలకు అయ్యే వ్యయం మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. పెళ్లికి ముందు ఇంటికి రిపేర్లు చేయించడం, రంగులు వేయించడం వంటివి చేస్తారు. కాబట్టి, ఆ రంగంలో వ్యాపారం ఎక్కువగా జరుగుతుంది. ఇంకా.. ఆభరణాలు, కొత్త బట్టలు, పాదరక్షలు, ఫర్నీచర్, డ్రై ఫ్రూట్స్, స్వీట్లు, పండ్లు, పూజ సామగ్రి, కిరాణా, తృణధాన్యాలు, గృహోపకరణాలు, ఎలక్ట్రికల్ వస్తువులు, బహుమతులు వంటి వాటికి డిమాండ్‌ పెరుగుతుంది. తద్వారా ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా వ్యాపారం భారీ స్థాయిసో నడుస్తుంది. మొత్తంగా చూస్తే.. పెళ్లిళ్ల సీజన్‌ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుంది, ప్రజలకు పెద్ద సంఖ్యలో ఉపాధి కూడా లభిస్తుంది.

మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Embed widget