By: ABP Desam | Updated at : 26 Dec 2021 07:31 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
రెండు నెలల క్రితం వరకూ ఇంధన ధరలు మన దేశంలో క్రమంగా ఎగబాకుతూ వచ్చి జీవితకాల గరిష్ఠాన్ని చేరాయి. కానీ, కొద్ది రోజుల క్రితం కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గాయి. ఈ తగ్గిన ధరలతో వాహనదారులు కొద్దిగా ఊరట చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు నేడు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో..
హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు గత కొద్ది రోజులుగా నిలకడగానే ఉంటున్నాయి. నేడు కూడా పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే కొనసాగుతోంది. ఇక వరంగల్‌లో నేడు (డిసెంబరు 26) దాదాపు 2 వారాల తర్వాత మార్పు కనిపించింది. పెట్రోల్ ధర రూ.0.19 పైసలు పెరిగి రూ.107.88 గా అయింది. డీజిల్ ధర రూ.0.17 పైసలు పెరిగి రూ.94.31 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
నిజామాబాద్‌లో ఇంధన ధరలు నేడు కాస్త తగ్గాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.09 పైసలు తగ్గి రూ.110.00 గా ఉంది. డీజిల్ ధర రూ.0.09 పైసలు తగ్గి రూ.96.29 గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Also Read: Four Day Work Week: 4 రోజులే పని.. పెరగనున్న బేసిక్ పే.. మారనున్న సాలరీ స్ట్రక్చర్!
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.109.32గా ఉంది. పాత ధరతో పోలిస్తే ఏకంగా రూ.0.10 పైసలు పెరిగింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.95.43 గా ఉంది. ఇది రూ.0.09 పైసలు పెరిగింది.
ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు పెరిగింది. లీటరు ధర ప్రస్తుతం రూ.0.06 పైసలు పెరిగి రూ.110.35 గా ఉంది. డీజిల్ ధర రూ.0.08 పైసలు పెరిగి రూ.96.44గా ఉంది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి.
Also Read: 28 Days Validity: అమ్మో.. 28 రోజుల వ్యాలిడిటీ వెనుక ఇంత కథా.. రూ.వేల కోట్ల ఆదాయం!
తిరుపతిలో ఇలా..
తిరుపతిలోనూ ఇంధన ధరలు నేడు తగ్గాయి. లీటరు పెట్రోలు ధర రూ.1.16 తగ్గి.. ప్రస్తుతం రూ.111.18 కి చేరింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. ఇక డీజిల్ ధర రూ.1.02 పైసలు తగ్గి రూ.97.16 కి చేరింది.
ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా డిసెంబరు 26 నాటి ధరల ప్రకారం 73.79 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తాజాగా సుంకాన్ని స్వల్పంగా తగ్గించడం ద్వారా రూ.5 నుంచి రూ.10 మేర ఇంధన ధరలు తగ్గాయి.
Also Read: PAN card Update: పెళ్లైన తర్వాత పాన్ కార్డులో ఇంటి పేరు మార్చుకోవాలా..? ఇలా చేయండి.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Stock Market Today: సెన్సెక్స్, నిఫ్టీ రికవరీ! కొంతైన పూడిన నిన్నటి నష్టాలు
Honda SP 125 Sports Edition: రూ. లక్ష లోపే స్పోర్ట్స్ బైక్ లుక్ - హోండా ఎస్పీ125 స్పోర్ట్స్ ఎడిషన్ చూశారా?
Cryptocurrency Prices: మస్తు లాభాల్లో క్రిప్టో మార్కెట్లు! బిట్‌కాయిన్ రూ.50వేలు జంప్
Stock Market Today: కోలుకున్న స్టాక్ మార్కెట్లు! మధ్యాహ్నం ఏం జరుగుతుందో?
Latest Gold-Silver Price 29 September 2023: నేల చూపుల్లో గోల్డ్, షాక్ ఇచ్చిన సిల్వర్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!
Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి
IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!
Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?
/body>