By: ABP Desam | Updated at : 24 Dec 2021 10:22 AM (IST)
పాన్‌కార్డ్
పర్మనెంట్ అకౌంట్ నంబర్ (PAN) ఇప్పుడో అత్యవసర డాక్యుమెంట్! చాలా ఆర్థిక అవసరాలు, ఆర్థిక లావాదేవీలు చేపట్టాలంటే పాన్ లేనిదే పనవ్వని పరిస్థితి! గుర్తింపు ధ్రువపత్రంగానూ దీనిని ఉపయోగించుకోవచ్చు.
పాన్‌కు సంబంధించి పెళ్లైన తర్వాత కొన్ని సమస్యలు వస్తుంటాయి! ఇంటి పేరు, చిరునామా మార్చుకోవాల్సి వస్తుంది. లేదంటే కొన్ని పనులు ఆగిపోతుంటాయి. ఈ ఇబ్బందులను తొలగించుకోవాలంటే పాన్‌లో ఇంటిపేరును మార్చుకోవడమే పరిష్కారం. చాలా సులభంగా పాన్‌లో పేర్లు, ఇంటి చిరునామాలు సవరించుకోవచ్చు. నామమాత్రపు రుసుముతో ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎన్‌ఎస్‌డీఎల్, ఆదాయపన్ను శాఖ నిబంధనల ప్రకారం పాన్ నంబర్ మార్చుకొనేందుకు వీల్లేదు. చిరునామా మార్చుకోవాలన్నా అసెసింగ్ అధికారి ద్వారానే చేయాల్సి వస్తుంది. అలా చేస్తేనే పాన్ డేటాబేస్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు. టిఐఎన్-ఎఫ్‌సీ లేదా ఎన్‌ఎస్‌డీఎల్ ఈ-గవ్, టిఐన్ వెబ్‌సైట్ ద్వారా ఇంటి పేరు మార్చుకోవచ్చు.
మొదట https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterCon కి లాగిన్ అవ్వాలి.
దరఖాస్తు పత్రం నింపాలి.
పాన్ డేటాలో మార్చుకోవాల్సిన వివరాలు సబ్‌మిట్ చేయాలి.
సబ్‌మిట్ నొక్కేముందు క్యాప్చా ఎంటర్ చేయాలి.
సబ్‌మిట్ బటన్ క్లిక్ చేయాలి.
పాన్‌కార్డులో ఇంటిపేరు మార్చుకొనేందుకు ఎక్కువ ఫీజు అవసరం లేదు. కేవలం రూ.110 చెల్లిస్తే చాలు. ఒకవేళ భారత్‌కు ఆవల చిరునామాతో చేయించాలంటే మాత్రం రూ.1020 వరకు చెల్లించాలి. రుసుము చెల్లించగానే యూజర్ పాన్ దరఖాస్తు పత్రం డౌన్‌లోడ్ చేసుకొని రెండు పాస్‌పోర్ట్ ఫొటోలు జత చేయాలి. వాటిపై సంతకాలు చేయడం మర్చిపోవద్దు. ఎన్‌ఎస్‌డీఎల్ అడ్రస్‌లో ఇన్‌కం టాక్స్ పాన్ సర్వీస్ యూనిట్‌కు పంపించాలి.
Also Read: Snapdeal IPO: ఐపీవోకు స్నాప్‌డీల్.. రూ.1250 కోట్ల సమీకరణకు ముసాయిదా దాఖలు
Also Read: Card Tokenization: డెబిట్, క్రెడిట్ కార్డు టోకెనైజేషన్ గడువు పొడగించాలని ఆర్‌బీఐకి వినతి
Also Read: Tesla Smartphone: క్రేజీ ఎలన్ మస్క్! టెస్లా నుంచి మొబైల్ ఫోన్.. ఫీచర్లు ఇవే!!
Also Read: Multibagger Stock: 19 నెలల్లో రూ.లక్షకు రూ.20 లక్షల లాభం ఇచ్చే మల్టీబ్యాగర్
Also Read: IPL Auction 2022: ఐపీఎల్ వేలం తేదీలు వచ్చేశాయి..! ఫిబ్రవరిలోనే.. బెంగళూరులో
Also Read: Asian Champions Trophy Hockey 2021: పాకిస్థాన్ పై భారత్ గెలుపు.. ఖాతాలోకి కాంస్య పతాకం
Also Read: Virat Kohli Record: సఫారీ సిరీసులో కోహ్లీ బద్దలు కొట్టబోయే రికార్డులివే..! వందో టెస్టు..!
Home Sales In Telangana: హైదరాబాద్‌లో అద్దెకు ఉంటున్న వాళ్లకు షాకింగ్- ఇంటి ఓనర్ అవ్వడం నాట్ సో ఈజీ!!
Gold-Silver Price: పసిడి ప్రియులకు నేడు బిగ్ గుడ్ న్యూస్! రూ.500 దిగొచ్చిన బంగారం - మరింత పతనమైన వెండి
Top Loser Today July 05, 2022 స్టాక్ మార్కెట్ సెన్సెక్స్, నిఫ్టీ టాప్ లాసర్స్ జాబితా
Kisan Vikas Patra Scheme Benefits: కేవీపీ స్కీమ్‌లో అంత వడ్డీ ఇస్తారా! మరి టాక్స్ బెనిఫిట్ సంగతేంటి?
Gold-Silver Price: నేడు బంగారం ధర షాక్! రెండ్రోజుల తర్వాత పెరిగిన పసిడి - వెండి, లేటెస్ట్ రేట్లు ఇవీ
Maayon Telugu Movie Review - 'మాయోన్' రివ్యూ: శ్రీకృష్ణ మాయ నిజమా? కల్పితమా? ఈ మైథలాజికల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
2024 Elections India: రాజ్యసభ నామినేషన్లు, సౌత్ ఇండియా మిషన్‌లో భాగమేనా? భాజపా స్ట్రాటెజీలు రెడీ!
YSRCP Permanent President : వైఎస్ఆర్సీపీ శాశ్వత అధ్యక్షుడిగా సీఎం జగన్ ! ఎందుకంటే ?
UK Prime Minister Resignation: బ్రేకింగ్ న్యూస్- బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా!