News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Petrol-Diesel Price, 19 August: పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు.. మీ నగరంలో తాజా ధరలివే..

హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.105.83 గా నిలకడగానే కొనసాగుతుండగా.. డీజిల్ ధరలో స్వల్ప తగ్గుదల కనిపించింది. లీటరుకు రూ.0.22 పైసలు తగ్గి.. రూ.97.74 కు చేరింది.

FOLLOW US: 
Share:

దేశంలో హైదరాబాద్, చెన్నై,ముంబయి, బెంగళూరు సహా అన్ని ప్రధాన మెట్రో నగరాల్లో నెల రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగానే కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని ఇంధన మార్కెట్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. నాలుగు రోజుల క్రితం స్వల్పంగా హెచ్చుతగ్గులు చోటు చేసుకున్న ధరలు మళ్లీ యథాతథ స్థితికి చేరుకున్నాయి. హైదరాబాద్‌లో కేవలం డీజిల్ ధరలో తాజాగా స్వల్ప తగ్గుదల కనిపించింది.

తెలంగాణలో ఆగస్టు 19న పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.105.83 గా నిలకడగానే కొనసాగుతుండగా.. డీజిల్ ధరలో స్వల్ప తగ్గుదల కనిపించింది. లీటరుకు రూ.0.22 పైసలు తగ్గి.. రూ.97.74 కు చేరింది. కరీంనగర్‌లో పెట్రోల్ ధర.. ముందు రోజు ధరతో పోలిస్తే ఏకంగా రూ.41 పైసలు తగ్గింది. తాజాగా పెట్రోల్ ధర కరీంనగర్‌లో రూ.105.71గా ఉంది. ఇక డీజిల్ ధర రూ.0.60 పైసలు తగ్గి రూ.97.62 గా అయింది.

ఇక వరంగల్‌లో తాజాగా పెట్రోల్ ధర రూ.105.55 కాగా.. డీజిల్ ధర రూ.97.46 గా ఉంది. పెట్రోల్ రూ.0.17 పైసలు పెరగ్గా.. డీజిల్ రూ.0.22 పైసల చొప్పున తగ్గింది. కొద్దిరోజులుగా వరంగల్‌లో నిలకడగా ఉంటున్న ధరలు తాజాగా స్వల్పంగా పెరిగాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇవే ఇంధన ధరలు ఉంటున్నాయి.

నిజామాబాద్‌లో పెట్రోల్ ధర లీటరుకు సుమారు రూ.0.45 పైసల చొప్పున పెరిగింది. డీజిల్ ధర గత ధరతో పోల్చితే రూ.0.22 పైసలు తగ్గింది. దీంతో తాజాగా పెట్రోల్ రూ.107.59 గా ఉండగా.. డీజిల్ ధర రూ.99.37గా ఉంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు ఉంటూ వస్తున్నాయి.

Also Read: Revanth Reddy: జోరు వానలో హోరెత్తించిన రేవంత్ రెడ్డి.. రావిర్యాల గడ్డ మీద కేసీఆర్ ను ఏమన్నారంటే..

ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్‌లో ఇంధన ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పెట్రోల్ ధర రూ.0.25 చొప్పున స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం పెట్రోల్ రేటు లీటరుకు రూ.108.87 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.03 పైసలు పెరిగి రూ.99.80కు చేరింది.

విశాఖపట్నం ఇంధన మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.106.80గా ఉంది. ముందు రోజుతో పోలిస్తే రూ.0.09 పైసలు తగ్గింది. డీజిల్ ధర కూడా విశాఖపట్నంలో రూ.0.28 పైసలు తగ్గి రూ.98.23గా ఉంది. విశాఖలో కూడా కొద్ది రోజుల క్రితం వరకూ రూ.0.50 పైసలకు పైబడి హెచ్చు తగ్గులు కనిపించగా.. తాజాగా అవి స్వల్పంగా ఉంటున్నాయి.

Also Read: Hyderabad Gang Rape: హైదరాబాద్ లో గ్యాంగ్ రేప్.. యువతిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన ఆటోడ్రైవర్లు..

తిరుపతిలో స్వల్ప మార్పులు
తిరుపతిలో ఇంధన ధరల్లో కొద్ది రోజుల క్రితం వరకూ పెద్ద మార్పులు చోటు చేసుకోగా.. తాజాగా స్వల్ప హెచ్చుతగ్గులు కనిపించాయి. పెట్రోల్ ధర మాత్రం నిలకడగా ఉంది. డీజిల్ రూ.0.20 తగ్గింది. దీంతో తాజాగా లీటరు పెట్రోలు ధర రూ.108.84గా నిలకడగానే ఉండగా.. ఇక డీజిల్ ధర రూ.100.11గా ఉంది.

Also Read: Telangana: కరోనా సెకండ్ వేవ్ ముగిసినట్లే.. ఇప్పుడు వచ్చే జ్వరాలతో జాగ్రత్త.. అన్నీ అలాంటివే కావు: డీహెచ్ వెల్లడి

ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా ఆగస్టు 19 నాటి ధరల ప్రకారం 64.55 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను అలాగే ఉంచుతున్నాయి. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందుల పాలు చేస్తున్నాయి.

Also Read: Gold-Silver Price: బంగారం కొనాలనుకుంటున్నారా? నేటి పసిడి, వెండి ధరలివే..

Published at : 19 Aug 2021 07:13 AM (IST) Tags: Petrol Price Diesel Price Fuel Cost Petrol Diesel Price Today Hyderabad Petrol Price Telangana Petrol Price Andhra Pradesh Petrol Prices

ఇవి కూడా చూడండి

Indian Thali: పెరుగుతున్న వంటింటి బిల్లు, జనం జేబుకు పెద్ద చిల్లు

Indian Thali: పెరుగుతున్న వంటింటి బిల్లు, జనం జేబుకు పెద్ద చిల్లు

SIM Card Rules: కొత్త సిమ్‌ తీసుకోవాలంటే కొత్త రూల్స్‌, ఇకపై ట్రిక్స్‌ పని చేయవు

SIM Card Rules: కొత్త సిమ్‌ తీసుకోవాలంటే కొత్త రూల్స్‌, ఇకపై ట్రిక్స్‌ పని చేయవు

Tax Exemption: జియోట్యాగింగ్ లేకుండా పన్ను మినహాయింపు రాదు, ఈ టెక్నాలజీని ఎలా వాడాలో తెలుసుకోండి

Tax Exemption: జియోట్యాగింగ్ లేకుండా పన్ను మినహాయింపు రాదు, ఈ టెక్నాలజీని ఎలా వాడాలో తెలుసుకోండి

Share Market Opening Today: స్మాల్‌ బ్రేక్‌ తీసుకున్న స్టాక్‌ మార్కెట్‌ - 69700 దిగువన సెన్సెక్స్, రెడ్‌ జోన్‌లో నిఫ్టీ

Share Market Opening Today: స్మాల్‌ బ్రేక్‌ తీసుకున్న స్టాక్‌ మార్కెట్‌ - 69700 దిగువన  సెన్సెక్స్, రెడ్‌ జోన్‌లో నిఫ్టీ

Latest Gold-Silver Prices Today: మళ్లీ పెరిగిన పసిడి కాంతి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Latest Gold-Silver Prices Today: మళ్లీ పెరిగిన పసిడి కాంతి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

టాప్ స్టోరీస్

Telangana Cabinet : హోంమంత్రిగా ఉత్తమ్ - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?

Telangana Cabinet :  హోంమంత్రిగా ఉత్తమ్  - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?

Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!

Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!

New Officers in Tealngana: కొత్త ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బి.శివధర్ రెడ్డి - సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రి

New Officers in Tealngana: కొత్త ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బి.శివధర్ రెడ్డి - సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రి

revanth reddy take oath as telangana cm : మేం పాలకులం కాదు మీ సేవకులం - ఆరు గ్యారంటీల అమలుపై రేవంత్ తొలి సంతకం

revanth reddy take oath as telangana cm  :  మేం పాలకులం కాదు మీ సేవకులం - ఆరు గ్యారంటీల అమలుపై  రేవంత్ తొలి సంతకం