అన్వేషించండి

Budget: భారత బడ్జెట్‌లో బ్రిటిష్ సంప్రదాయానికి స్వస్థి - తేదీలు, సమయాల్లో విప్లవాత్మక మార్పులు

Union Budget: భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా వలస పాలన వాసనలెందుకని యశ్వంత్ సిన్హా ప్రశ్నించారు. బ్రిటిష్‌ సాంప్రదాయానికి చెల్లుచీటీ ఇచ్చారు.

Revolutionary Changes In Union Budget Dates And Times: కేంద్ర బడ్జెట్ 2025 సమర్పణకు మరికొన్ని రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. 01 ఫిబ్రవరి 2025, ఉదయం 11 గంటలకు, దేశ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) మోదీ ప్రభుత్వ 14వ బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు, యావత్‌ దేశం ముందుకు తీసుకొస్తారు. అయితే, కేంద్ర బడ్జెట్‌ను ఏటా ఫిబ్రవరి 01వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టాలన్న సాంప్రదాయం గతంలో లేదు, కాలనుగుణంగా మార్పులు జరిగాయి. ఫిబ్రవరి 01వ తేదీ ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని మన దేశంలో ఎప్పుడు నిర్ణయించారో తెలుసా, దీని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా?.

ఉదయం 11 గంటల టైమ్‌ను ఎవరు సెట్ చేశారు?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి, ఫిబ్రవరి చివరి పనిదినం (సాధారణంగా ఫిబ్రవరి 28వ తేదీ) నాడు సాయంత్రం 5 గంటలకు బడ్జెట్‌ సమర్పించడం ప్రారంభించారు. భారతదేశం - యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య సమయ వ్యత్యాసం కారణంగా ఈ సమయాన్ని ఎంచుకున్నారు. భారతదేశ సమయం బ్రిటిష్ వేసవి సమయం కంటే 5.30 గంటలు ముందు ఉంటుంది. మన దగ్గర సాయంత్రం 5 గంటలకు (IST) బడ్జెట్‌ను సమర్పించడం అంటే, బ్రిటన్‌లో పగటిపూట ప్రకటించడం అని అర్ధం.          

కానీ, 1999లో అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ప్రభుత్వంలో యశ్వంత్ సిన్హా  ‍‌(Yashwant Sinha) ఈ పద్ధతిని మార్చారు. వందల ఏళ్లు పోరాడి స్వాతంత్ర్యం సంపాదించుకున్న తర్వాత కూడా బ్రిటిషర్ల పద్ధతులు మనకు ఎందుకుని ప్రశ్నించారు. 1998 - 2002 మధ్యకాలంలో భారత ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న యశ్వంత్‌ సిన్హా, భారత కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను సమర్పించడం ప్రారంభించారు. బడ్జెట్‌లో ఉన్న సమాచారాన్ని పార్లమెంట్‌ సభ్యులు అర్ధం చేసుకునే సమయం లభిస్తుందనే ఉద్దేశంతో ఈ సమయాన్ని ఎంచుకున్నారు. అలా.. 2016 వరకు, ఆర్థిక మంత్రులందరూ ఫిబ్రవరి 28వ తేదీ ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ సమర్పించారు.          

బడ్జెట్‌ తేదీ ఫిబ్రవరి 01వ తేదీకి ఎందుకు మారింది?
దాదాపు 20 ఏళ్ల పాటు, కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి చివరి పనిదినం నాడు సమర్పించారు. 2017లో ఈ సాంప్రదాయం మారింది. 2017 నుంచి, ఫిబ్రవరి 01న బడ్జెట్‌ ప్రవేశపెడతామని అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించారు. ఫిబ్రవరి చివరి రోజున బడ్జెట్‌ను సమర్పిస్తే, ఏప్రిల్ 01 నుంచి ప్రారంభమయ్యే సంవత్సరానికి కొత్త విధానాలను రూపొందించడానికి కేంద్రానికి తగినంత సమయం లభించడం లేదని జైట్లీ వివరించారు. ఫిబ్రవరి 01న బడ్జెట్‌ను ప్రవేశపెడితే, సర్కారుకు తగిన సమయం దొరుకుందని వెల్లడించారు. ఏప్రిల్ 01న బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి కారణం ఇదే. 

 2017 నుంచి, ఫిబ్రవరి 01వ తేదీ ఉదయం ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంట్‌లో బడ్జెట్‌ సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. బడ్జెట్‌ సమయాన్ని, తేదీని మార్చింది బీజేపీ ప్రభుత్వాలే కావడం విశేషం.

మరో ఆసక్తికర కథనం: ఆర్థిక సంస్కరణల నుంచి పన్ను విధానాల వరకు - ఈ బడ్జెట్‌లో గమనించాల్సిన కీ పాయింట్స్‌ 

టాప్ హెడ్ లైన్స్

Jio Platforms IPO: జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు లిస్టింగ్‌కు ముందే రూ. 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డిమాండ్
జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు లిస్టింగ్‌కు ముందే రూ. 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డిమాండ్
Reliance Foundation Outreach: రిలయన్స్ ఫౌండేషన్ సామాజిక సేవలు - జియో ఉచిత ఏఐ కోర్సుతో డిజిటల్ విప్లవం!
రిలయన్స్ ఫౌండేషన్ సామాజిక సేవలు - జియో ఉచిత ఏఐ కోర్సుతో డిజిటల్ విప్లవం!
Reliance Industries 1977 IPO: ధీరూభాయ్ అంబానీ సామాన్యులను అభివృద్ధిలో భాగస్వాములు ఎలా చేశారు
రిలయన్స్ ఇండస్ట్రీస్ 1977 IPO: ధీరూభాయ్ అంబానీ సామాన్యులను అభివృద్ధిలో భాగస్వాములు ఎలా చేశారు
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kolkata Stampede: కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
BJP Candidates List: ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
AP Elections: నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా అత్యవసర సమీక్ష
నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా అత్యవసర సమీక్ష
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలినికి ఫుల్ కోంటింగ్! నీతూకి చీవాట్లు! త్రిగుణ్ దెబ్బకి ఏడ్చేసిన రోహిత్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలినికి ఫుల్ కోంటింగ్! నీతూకి చీవాట్లు! త్రిగుణ్ దెబ్బకి ఏడ్చేసిన రోహిత్!
Jio Platforms IPO: జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు లిస్టింగ్‌కు ముందే రూ. 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డిమాండ్
జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు లిస్టింగ్‌కు ముందే రూ. 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డిమాండ్
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Embed widget