అన్వేషించండి

Revanth Reddy: జోరు వానలో హోరెత్తించిన రేవంత్ రెడ్డి.. రావిర్యాల గడ్డ మీద కేసీఆర్ ను ఏమన్నారంటే..

సీఎం కేసీఆర్ పే రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రగతి భవన్ లో పిడుగు పడ్డది.. కేసీఆర్ గుండెల్లో గునపం దిగిందని వ్యాఖ్యానించారు. 


తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 9న ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లిలో దళిత దండోరాను నిర్వహించింది. దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరాను మోగించనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు.  ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఇవాళ రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో సభ నిర్వహించారు. ఓ వైపు వర్షం పడుతున్న రేవంత్ రెడ్డి సభలో మాట్లాడుతూనే ఉన్నారు.  మరోవైపు కార్యకర్తలు రేవంత్ ప్రసంగాన్ని ఉత్సాహంగా విన్నారు.

టీఆర్ఎస్ పార్టీని పాతాళానికి తొక్కుతాం: రేవంత్ రెడ్డి
ఇంద్రవెల్లిలో ఓ అడుగు వేశాం.. ఇంకో అడుగు ర్యాలిలో వేశాం.. ఇంకో అడుగు కేసీఆర్ నెత్తి మీద పెట్టి తొక్కుతాం. టీఆర్ఎస్ పార్టీని పాతాళానికి తొక్కుతామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాడనికి వరుణుడు వచ్చాడని రేవంత్ రెడ్డి అన్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా మెుత్తం తీసి కేసీఆర్ కు పంపించండి.. నిఖార్సైన కార్యకర్తలు వానలో కూడా ఉన్నారని రేవంత్ రెడ్డి అన్నారు. సోనియా గాంధీ నిర్ణయంతో ప్రగతి భవన్ లో పిడుగు పడ్డది.. కేసీఆర్ గుండెల్లో గునపం దిగిందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నెల రోజుల నుంచి ఆగం ఆగం అవుతున్నారన్నారు. దళిత, గిరిజనులకు సంక్షేమ పథకాలు, కాదని.. విద్య ఉపాధి కావాలని రేవంత్ అన్నారు. 10 లక్షలు దేనికి సరిపోతాయని అడిగారు.  ఇంట్లో సెలవు తీసుకుని రావాలని కాంగ్రెస్ కార్యకర్తలు పిలుపునిచ్చారు. 19 నెలలు కష్టపడితే.. అధికారం మనదేనని రేవంత్ అన్నారు.

ప్రణబ్​ ముఖర్జి వచ్చినప్పుడు, మాజీ గవర్నర్ నరసింహన్​ కనిపించినప్పుడు కేసీఆర్​ వాళ్ల కాళ్లు మొక్కాడని రేవంత్ రెడ్డి అన్నారు. ​దళిత రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ వచ్చినప్పుడు కనీసం నమస్కారం కూడా చేయలేదని పేర్కొన్నారు. మొదటి సీఎస్​ రాజీవ్​ శర్మ, తర్వాత సీఎస్​ ఎస్కే జోషి, మొదటి డీజీపీ అనురాగ్​ శర్మ పదవులను పొడిగించారని.. ఇప్పుడు ప్రభుత్వ సలహాదార్లుగా నియమించుకున్నారని రేవంత్ అన్నారు. కాని ఒక దళిత బిడ్డ ప్రదీప్​ చంద్ర సీఎస్​ అయితే ఒకటే నెలకు రిటైర్మెంట్​ ఇచ్చారని ఆరోపించారు. భూపాలపల్లి కలెక్టర్​గా ఉన్న మురళి పేదళ్ల గురించి మాట్లాడితే.. అతన్ని అవమానించారని రేవంత్ అన్నారు. ఆయన రాజీనామా చేసి బయటకు వెళ్లారన్నారు. పాలమూరు బిడ్డ ప్రవీణ్​ కుమార్​ 6 ఏళ్ల పదవీ కాలం ఉండగానే రాజీనామా చేశారని.. డీజీపీ స్థాయికి వెళ్లేవారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.


కృష్ణా నది ఉప్పొంగినట్లు కాంగ్రెస్‌ సభకు ప్రజలు వచ్చారని  రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమకారులు మరో 18 నెలల్లో కేసీఆర్‌ను గద్దె దించాలని ఆవేశంగా ఉన్నారన్నారు. తెలంగాణ కోసం చనిపోయిందెవరో ప్రజలు ఆలోచించాలని రేవంతే చెప్పారు. కాంగ్రెస్‌ సభలు చూసి కేసీఆర్‌ గుండెల్లో గునపం దిగినట్లు ఉందన్నారు. దళితబంధు కింద ఇచ్చే రూ.10 లక్షలు ఎవరి భిక్షం కాదని.. ప్రజలు పన్నుల రూపంలో ఇచ్చిన సొమ్మునే మళ్లీ వాళ్లకు ఇస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ 4 కోట్ల ప్రజల భవిష్యత్ హుజూరాబాద్​ బిడ్డల చేతిలో ఉందని చెప్పారు.

ఇంకా నేతలు ఏం మాట్లాడారంటే..


తెలంగాణలో సామాజిక న్యాయం జరగట్లేదు: బట్టి
తెలంగాణలో సామాజిక న్యాయం జరగట్లేదని బట్టి విక్రమార్క అన్నారు. ఏడేళ్ల క్రితం తీసుకొచ్చిన ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను కేసీఆర్ సర్కార్ ఖర్చు చేయలేదని బట్టి అన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న దళిత వ్యతిరేక విధానలపై పెద్ద ఎత్తున పోరాడాలన్నారు.

కేసీఆర్ హఠావో... తెలంగాణ బచావో
 ఏడేళ్ల కాలంలో ఎలా దోపిడికి గురవుతున్నామో గుర్తుచేసుకోవాలని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ అన్నారు. ఫార్మాకంపెనీలతో రంగారెడ్డి జిల్లాను నాశనం చేస్తున్నారన్నారు. మహేశ్వరంలో గెలిపించిన ఎమ్మెల్యే... ఏం చేశారో చూశామని.. పక్కనే గెలిపించిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎలాంటి పనులు చేస్తున్నారో తెలుస్తున్నాయని మధుయాష్కీ విమర్శించారు.

ఇప్పుడెలా ఉన్నామని చూసుకోవాలి: దామోదర రాజనర్సింహ

తెలంగాణ చరిత్ర పోరాటాల చరిత్ర, తెలంగాణ చరిత్ర త్యాగాల చరిత్ర అని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. తెలంగాణ వచ్చాక అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ దళిత, గిరిజనులకు చేసిందేమీ లేదని విమర్శించారు. రాజకీయంగా, సామాజికంగా ఎలా ఉన్నామని ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. 

 ఆంధ్రా వాళ్లతో కేసీఆర్ కుమ్మక్కయ్యారు

ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి అని చెప్పి కేసీఆర్ మోసం చేశాడని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. మూడు ఎకరాల భూమి అని చెప్పి.. 10 లక్షలని ఇప్పుడు చెబుతున్నాడని విమర్శించారు. కేసీఆర్ మాటలకు మోసపోవద్దని వేడుకుంటానని చెప్పారు. కృష్ణా జలాలను ఆంధ్రకు పంపిస్తు్న్నారని.. వాళ్లతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. దక్షిణ తెలంగాణను నాశనం చేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగాలు కూడా ఇవకుండా నిరంకుశ, అవినీతి పాలన కొనసాగిస్తున్నారని నాగం జనార్దన్ రెడ్డి చెప్పారు.

ఎన్నికలకో పథకం

కేసీఆర్ లా పూటకో పదం, ఎన్నికలకో పదం .. ఎక్కడ రాజకీయ లబ్ధి జరుగుద్దో అక్కడికి కాంగ్రెస్ వెళ్లలేదని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేవుళ్లను తీసుకొచ్చి రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటున్నాయని విమర్శించారు. తెలంగాణ సాధించుకున్నాక.. స్వాతంత్ర్య్రం రాకముందు ఎదుర్కొన్న సమస్యలనే.. ఇప్పుడు మళ్లీ ఎదుర్కొంటున్నారన్నారు. కొన్ని రోజుల నుంచి.. కేసీఆర్ బయట కనిపిస్తున్నాడని.. అంతకుమందు రాజులా.. ఇంట్లో కూర్చొని పాలించాడని విమర్శించారు. మందకృష్ణ మాదిగను జైళ్లో పెట్టడం దారుణమన్నారు. హుజూరాబాద్ లో తప్ప ఎక్కడా దళిత బంధు పథకం అడగొద్దని దాడులు చేస్తున్నారన్నారు. దళిత,గిరిజన బిడ్డలపై కేసులు పెట్టి హింసిస్తున్నారన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP MLC Elections: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల సీటు, నేతల మధ్య పెంచుతోంది హీటు... ఆ ఛాన్స్ ఎవరికో
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల సీటు, నేతల మధ్య పెంచుతోంది హీటు... ఆ ఛాన్స్ ఎవరికో
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - త్వరలోనే పనులు ప్రారంభం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - త్వరలోనే పనులు ప్రారంభం
Good Bad Ugly Teaser: అజిత్ మాస్... ఇది కదా ఫ్యాన్స్ కోరుకునేది - 'గుడ్ బ్యాడ్ అగ్లీ' టీజర్ అదిరిందంతే
అజిత్ మాస్... ఇది కదా ఫ్యాన్స్ కోరుకునేది - 'గుడ్ బ్యాడ్ అగ్లీ' టీజర్ అదిరిందంతే
Viral News: కోనసీమలో మోనాలిసా అంటూ బాలిక వీడియో తీశాడు.. చివరకు ఆ యువకుడి పరిస్థితి ఇదీ
కోనసీమలో మోనాలిసా అంటూ బాలిక వీడియో తీశాడు.. చివరకు ఆ యువకుడి పరిస్థితి ఇదీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Badrinath Avalanche Workers Trapped | మంచుచరియల కింద చిక్కుకుపోయిన 41మంది | ABP DesamFlash Floods in Kullu Manali | బియాస్ నదికి ఆకస్మిక వరదలు | ABP DesamSuriya Jyothika With Kids First Time | సూర్య, జ్యోతిక పిల్లలు ఎంత పెద్ద వాళ్లైపోయారో | ABP DesamSLBC Tunnel Incident vs Uttarakhand Tunnel | ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ సక్సెస్..SLBC లో దేనికి ఆటంకం.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLC Elections: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల సీటు, నేతల మధ్య పెంచుతోంది హీటు... ఆ ఛాన్స్ ఎవరికో
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల సీటు, నేతల మధ్య పెంచుతోంది హీటు... ఆ ఛాన్స్ ఎవరికో
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - త్వరలోనే పనులు ప్రారంభం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - త్వరలోనే పనులు ప్రారంభం
Good Bad Ugly Teaser: అజిత్ మాస్... ఇది కదా ఫ్యాన్స్ కోరుకునేది - 'గుడ్ బ్యాడ్ అగ్లీ' టీజర్ అదిరిందంతే
అజిత్ మాస్... ఇది కదా ఫ్యాన్స్ కోరుకునేది - 'గుడ్ బ్యాడ్ అగ్లీ' టీజర్ అదిరిందంతే
Viral News: కోనసీమలో మోనాలిసా అంటూ బాలిక వీడియో తీశాడు.. చివరకు ఆ యువకుడి పరిస్థితి ఇదీ
కోనసీమలో మోనాలిసా అంటూ బాలిక వీడియో తీశాడు.. చివరకు ఆ యువకుడి పరిస్థితి ఇదీ
Revanth on Kishan Reddy:  కిషన్ రెడ్డి వల్లే తెలంగాణకు అన్యాయం - మరోసారి రేవంత్ ఆగ్రహం
కిషన్ రెడ్డి వల్లే తెలంగాణకు అన్యాయం - మరోసారి రేవంత్ ఆగ్రహం
Andhra Pradesh Budget 2025: అమరావతికి కేటాయింపులు ఎందుకు?: పయ్యావుల ఆసక్తికర కామెంట్స్
అమరావతికి కేటాయింపులు ఎందుకు?: పయ్యావుల ఆసక్తికర కామెంట్స్
Ram Charan - Chiranjeevi: రామ్ చరణ్ సినిమాలో అతిథిగా మెగాస్టార్... అందులో నిజం ఎంతంటే?
రామ్ చరణ్ సినిమాలో అతిథిగా మెగాస్టార్... అందులో నిజం ఎంతంటే?
Princton Human Trafficking Case: యుఎస్ హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో అప్‌డేట్. ఆ నలుగురిపై చార్జెస్ ఉపసంహరణ
యుఎస్ హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో అప్‌డేట్. ఆ నలుగురిపై చార్జెస్ ఉపసంహరణ
Embed widget