By: Arun Kumar Veera | Updated at : 30 Sep 2024 10:27 AM (IST)
నవతరం ఐడియాలకు అనుగుణంగా కొత్త పథకాలు ( Image Source : Other )
SBI Is Planning For New RD With SIP: నవతరం ఆలోచనలు, మారుతున్న అవసరాలకు అనుగుణంగా తనను తాను మార్చుకోవడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సిద్ధమైంది. SBI చైర్మన్ CS శెట్టి చెప్పిన ప్రకారం... రికరింగ్ డిపాజిట్ (RD), సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP)లో నూతన మార్పులు చేయబోతున్నారు, చాలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దబోతున్నారు. దీంతో పాటు, బ్యాంక్ అందించే ఆర్థిక ఉత్పత్తులు కూడా మారనున్నాయి. కస్టమర్ల ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త పథకాలు రూపొందిస్తామని CS శెట్టి చెప్పారు. బ్యాంక్ డిపాజిట్లను పెంచుకోవడానికి ప్రజలకు వివిధ పెట్టుబడి ఎంపికలను (Investment Options In SBI) అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. వడ్డీ రేట్లను రీజనబుల్‌గా ఉంచడంపైనా దృష్టి పెట్టినట్లు సీఎస్ శెట్టి వివరించారు.
FD, RD, SIPలో మార్పులు
ఎస్‌బీఐ, ఆర్‌డీ వంటి సంప్రదాయ పెట్టుబడి పథకాలను ప్రస్తుత కాలానికి అనుగుణంగా మార్చుకోవాలనుకుంటోంది. కాంబో ఉత్పత్తులను కూడా తీసుకురావాలని ఆలోచిస్తోంది. కొత్త పథకాల్లో FD + RD ప్రయోజనాలు ఇమిడి ఉండేలా చూస్తోంది. అంతేకాదు, RD + SIP ప్రయోజనాలను ఒకే అకౌంట్‌లో అందించేలా స్కీమ్ డిజైన్ చేయనుంది. ఈ ఉత్పత్తులు డిజిటల్‌గా ఉంటాయి, కస్టమర్ వాటిని ఎప్పుడైనా ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు.
"భారత ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తోంది, వినియోగదార్లకు ఆర్థిక పథకాల పట్ల అవగాహన కూడా పెరుగుతోంది. తమ ఆస్తులు, పెట్టుబడుల గురించి ఇప్పుడు ప్రజలు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. వారి ప్రాధాన్యతలు మారుతున్నాయి. ప్రజలు తమ డబ్బును ఒకే రకమైన ఆస్తిలో పెట్టుబడి పెట్టాలని కోరుకోవట్లేదు. బ్యాంకింగ్ ఉత్పత్తులు ఎప్పుడూ ప్రజలకు ఒక ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌గా ఉండాలి. యువత ఆలోచన విధానం మారుతోంది. వారి పెట్టుబడి మార్గాలు కూడా మారాయి. మేము దానిని అర్థం చేసుకోవాలి. Gen Z ప్రకారం కొత్త ఉత్పత్తులను తయారు చేయాలి. అందుకే, యువతను ఆకర్షించే కొత్త పథకాలను సిద్ధం చేస్తున్నాం" - సీఎస్ శెట్టి, ఎస్‌బీఐ ఛైర్మన్
రోజుకు 50,000-60,000 ఖాతాలు
బ్యాంక్ డిపాజిట్లు పెంచేందుకు ఎస్‌బీఐ చాలా ప్రయత్నాలు చేస్తోందని సీఎస్ శెట్టి చెప్పారు. దేశవ్యాప్తంగా విస్తరించిన వేలకొద్దీ శాఖలతో ఒక పెద్ద నెట్‌వర్క్ ఎస్‌బీఐకి ఉంది. కస్టమర్‌లతో ఎస్‌బీఐ ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటుంది. ఆ పరపతిని, పరిచయాలను ఉపయోగించుకుని కొత్త కస్టమర్ల కోసం అన్వేషిస్తోంది. రోజుకు 50,000 నుంచి 60,000 వరకు కొత్త సేవింగ్స్ అకౌంట్స్ (SBI Savings Account) తెరిపించాలని స్టేట్ బ్యాంక్ భావిస్తున్నట్లు ఛైర్మన్ చెప్పారు. ఫిక్స్‌డ్ డిపాజిట్ల (SBI FD Account) విషయానికి వస్తే.. రోజులో దాదాపు 50% ఖాతాలు ఆన్‌లైన్ ద్వారానే ఓపెన్ అవుతున్నాయని శెట్టి వివరించారు.
రేట్ల యుద్ధంలోకి అడుగుపెట్టం
SBI, వడ్డీ రేట్ల యుద్ధంలో చిక్కుకోవాలని భావించట్లేదని బ్యాంక్ ఛైర్మన్ స్పష్టం చేశారు. వడ్డీ రేట్లను (SBI Interest Rates 2024) సమతుల్యంగా ఉంచుతామన్నారు. బ్యాంక్ నికర లాభాన్ని లక్ష కోట్ల రూపాయలకు తీసుకెళ్లడమే తదుపరి లక్ష్యమని సీఎస్ శెట్టి వెల్లడించారు.
మరో ఆసక్తికర కథనం: బంగారంపై భారీ లాభాలు పొందొచ్చు!, ఎలా పెట్టుబడి పెట్టాలో తెలుసా?
Gold-Silver Prices Today 12 Jan: ఈ రోజు గోల్డ్, సిల్వర్ నగల రేట్లు ఇవీ - మీ ఏరియాలో ధరలు ఎలా ఉన్నాయంటే!
Credit Card- UPI: మీ క్రెడిట్ కార్డ్‌ను యూపీఐకి ఈజీగా లింక్ చేయండి, సింపుల్‌గా పే చేయండి
Budget Expectations: వాహన రంగానికి కావాలి వరాలు - నిర్మలమ్మ కనికరిస్తే భారీగా తగ్గుతుంది బండి రేటు!
Gold-Silver Prices Today 11 Jan: గోల్డ్ షాపింగ్ చేసేవాళ్లకు గొప్ప ఊరట - ఈ రోజు మీ ప్రాంతంలో బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Budget Expectations: హోమ్ లోన్‌పై ప్రత్యేక పన్ను రాయితీ, రూ.5 లక్షల వడ్డీ వరకు 'జీరో టాక్స్'!
Publicity gold: కోటి రూపాయల పతంగి అంట - నమ్మేద్దామా ?
Cockfight: కోళ్ల పందెంలో గెలిస్తే విజేతకు మహేంద్ర థార్ - పందెల బరులకు వెళ్లిన రఘురామ, గంటా
Rayudu Vs Kohli: రాయుడుని సాగనంపింది కోహ్లీనే.. తనకిష్టం లేదని ప్రపంచ కప్ నుంచి ఔట్.. త్రీడీ ప్లేయర్ వివాదంపై మాజీ క్రికెటర్ సరికొత్త వాదన
Kumbh mela: గత జన్మలో భారత్‌లో పుట్టానేమో- కుంభమేళాలో విదేశీ భక్తురాలి ఆసక్తికర వ్యాఖ్యలు