By: Arun Kumar Veera | Updated at : 27 Sep 2024 01:12 PM (IST)
బంగారంపై భారీ లాభాలు పొందొచ్చు! ( Image Source : Other )
Gold Prices Are Skyrocketing: ఈ ఏడాది కూడా పసిడి ప్రభంజనం కొనసాగుతోంది, పాత రికార్డులు గల్లంతవుతున్నాయి. ప్రస్తుతం, బంగారం ధరలు సరికొత్త రికార్డ్ స్థాయిలో ఉన్నాయి. ఈ ఏడాది లాభాల పరంగా, బంగారం ఇప్పటికే షేర్లను ఓడించింది. ఈ ట్రెండ్‌కు ఇంకా ఎండ్ కార్డ్ పడలేదని, పుత్తడి నుంచి భారీ ఆదాయాలు పొందే ఛాన్స్ మిగిలే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
78,000 దాటిన పసిడి
CNBC TV 18 రిపోర్ట్ ప్రకారం, యుఎస్ మార్కెట్లో స్పాట్ ఫూచర్స్ ధర ఈ రోజు (శుక్రవారం, 27 సెప్టెంబర్ 2024) ఔన్స్‌కు 2,692 డాలర్లకు చేరింది, కొత్త గరిష్ట స్థాయిలో కదులుతోంది. మన దేశంలో, మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ (MCX) ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.77 వేలకు పైనే ఉంది. ఇది పన్నులు లేని ధర. స్థానిక పన్నులు కూడా కలుపుకుంటే 10 గ్రాముల పుత్తడి స్పాట్ రేటు రూ.78,000 దాటింది. మన దేశంలో, ప్రస్తుతం, పండుగ సీజన్ పీక్ స్టేజ్‌లో ఉంది. దసరా, దీపావళి, ధన్‌తేరస్ వరుసగా ఉన్నాయి. ఆ తర్వాత పెళ్లిళ్లు ప్రారంభమవుతాయి. అంటే, వచ్చే నెలన్నరలో ఎల్లో మెటల్ రేట్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది.
బంగారంలో పెట్టుబడి మార్గాలు
బంగారంలో పెట్టుబడి పెట్టడానికి రెండు మార్గాలు ఉన్నాయి - ఒకటి డిజిటల్ గోల్డ్, మరొకటి ఫిజికల్ గోల్డ్. డిజిటల్ గోల్డ్‌లో.. వర్చువల్ గోల్డ్, సావరిన్ గోల్డ్ బాండ్, గోల్డ్ ఈటీఎఫ్ వంటి ఆప్షన్లు ఉన్నాయి.
భౌతిక బంగారం కొనుగోలులో ఇబ్బంది
మన దేశంలో బంగారం అంటే వస్తువు మాత్రమే కాదు, ప్రజల సెంటిమెంట్ & భావోద్వేగాలతో ఇది ముడిపడి ఉంది. కాబట్టి, భారతీయులు భౌతిక బంగారాన్ని (Physical Gold) ఎక్కువగా ఇష్టపడతారు. అయితే, పుత్తిడిలో పెట్టుబడికి డిజిటల్ గోల్డ్ సరైన మార్గం (Digital Gold). భౌతిక బంగారంతో దొంగతనం జరిగే రిస్క్ ఉంది. దీనిని నివారించేందుకు బ్యాంక్ లాకర్‌ను ఆశ్రయిస్తే, రెంట్ రూపంలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. భౌతిక బంగారం కొనేప్పుడు మేకింగ్ ఛార్జీలు, తరుగు వంటి భారాలను భరించాలి. కల్తీ భయం కూడా ఉంటుంది. అమ్మేటప్పుడు కూడా ఈ ఛార్జీలు గుదిబండలవుతాయి. డిజిటల్ బంగారం గోల్డ్ ఈ సమస్యలన్నింటినీ తొలగిస్తుంది.
వర్చువల్ గోల్డ్ (Virtual Gold)
ఆన్‌లైన్‌లో మధ్యవర్తిత్వ సంస్థల నుంచి కొనుగోలు చేయాలి. ఇది కంటికి కనిపిస్తుంది తప్ప భౌతికంగా ఉండదు. కనిష్టంగా ఒక గ్రాము గోల్డ్‌ను కూడా కొనుగోలు చేయొచ్చు, మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడల్లా కొంటూ వెళ్లొచ్చు. మీ బంగారం మీడియేటింగ్ కంపెనీ దగ్గర జమ అవుతుంది. మీరు కావాలనుకున్నప్పుడు ఫిజికల్ గోల్డ్ రూపంలో తిరిగి ఇస్తుంది. స్టాక్ బ్రోకింగ్ కంపెనీలతో పాటు పేటీఎం, ఫోన్‌పే వంటి థర్డ్ పార్టీల ద్వారా కూడా వర్చువల్ గోల్డ్ కొనొచ్చు.
సావరిన్ గోల్డ్ బాండ్ మూతబడొచ్చు
బంగారం ధర పెరగుతుండడం వల్ల సావరిన్ గోల్డ్ బాండ్ (Sovereign Gold Bond) స్కీమ్ ఇటీవలి సంవత్సరాలలో బాగా పాపులర్ అయింది. ఇప్పుడు, ఈ విండోను క్లోజ్ చేయాలన్న చర్చ జరుగుతోంది. ఈ ఏడాది ఆగస్టులో, కేంద్ర ప్రభుత్వం SGBని రద్దు చేయవచ్చంటూ నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రభుత్వం ఈ పథకాన్ని ఖరీదైనదిగా, సంక్లిష్టమైనదిగా పరిగణిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి.
గోల్డ్ ETFలో పెట్టుబడి వల్ల ప్రయోజనాలు
బంగారంలో పెట్టుబడికి ETFలు మంచి ఆప్షన్స్‌గా మారతాయి. షేర్ల తరహాలోనే, గోల్డ్ ఈటీఎఫ్ యూనిట్లను ఎలక్ట్రానిక్ రూపంలో డీమ్యాట్ ఖాతాలో ఉంచుకోవచ్చు. వాటిని BSE & NSEలో ట్రేడ్ చేయొచ్చు. ట్రేడింగ్ టైమ్‌లో ఎప్పుడైనా వాటిని కొనుగోలు చేయవచ్చు & విక్రయించవచ్చు. నామమాత్రమైన టాక్స్ కడితే చాలు. కల్తీ, దొంగతనం, మేకింగ్ ఛార్జీల వంటి రిస్క్‌లేవీ ఇందులో ఉండవు. చిన్న మొత్తంలో కూడా గోల్డ్ ఈటీఎఫ్‌లో పెట్టుబడి పెట్టొచ్చు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: రూ.78,000 దాటిన గోల్డ్, రికార్ స్థాయిలో సిల్వర్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Digital Real Estate: 'డిజిటల్ రియల్ ఎస్టేట్' గురించి తెలుసా?, కొంతమంది రూ.కోట్లు సంపాదిస్తున్నారు!
SBI Loan: లోన్ తీసుకున్నవాళ్లకు షాక్ ఇచ్చిన ఎస్‌బీఐ - ఈ రోజు నుంచి EMIలు పెంపు
Gold-Silver Prices Today 15 Nov: పతనం నుంచి పుంజుకున్న పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Childrens Day Gifts: ఈ చిల్డ్రన్స్ డే నాడు మీ పిల్లలకు ఆర్థిక భద్రతను గిఫ్ట్‌గా ఇవ్వండి - ఇవిగో బోలెడన్ని ఆప్షన్స్!
ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్‌లో భారీ మార్పులు - ఇక దబిడిదిబిడే!
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
Musi River: అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం