By: ABP Desam | Updated at : 29 Dec 2023 01:39 PM (IST)
మీ ఆధార్‌తో ఏ మొబైల్ నంబర్ లింక్ అయిందో గుర్తు లేదా?
Aadhaar Mobile Number Email ID Verification: మీ ఆధార్ నంబర్‌తో ఏ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ అనుసంధానం అయివుందో మీకు తెలిస్తే, అవసరమైన సందర్భంలో ఆధార్ ధృవీకరణ (aadhaar authentication) చాలా సులభం అవుతుంది. ఏ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీతో మీ ఆధార్ లింక్ అయిందో మీకు తెలియకపోయినా, లేదా మరిచిపోయినా ఆధార్ ధృవీకరణ సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ ఇబ్బందిని తొలగించడానికి, ఆధార్ జారీ సంస్థ UIDAI (Unique Identification Authority of India) ఒక కొత్త సదుపాయాన్ని ప్రారంభించింది.
చాలామంది ఆధార్ కార్డ్‌హోల్డర్లు, తమ ఆధార్ నంబర్‌తో ఏ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ లింక్ అయిందో తెలీడం లేదని ఉడాయ్‌కి (UIDAI) ఫిర్యాదులు, విజ్ఞప్తులు చేస్తున్నారు. ఆధార్‌ను ధృవీకరించే OTP ఏ నంబర్‌కు, ఏ ఈ-మెయిల్ ఐడీకి వెళ్తుందో అర్ధం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా కొత్త సదుపాయం తీసుకొచ్చింది ఉడాయ్. ఈ సదుపాయంతో, ఆధార్ కార్డ్‌హోల్డర్లు తమ ఆధార్ ఏ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీతో లింక్ అయిందో సులభంగా తెలుసుకోవచ్చు.
మీ ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌ను ఇలా కనిపెట్టండి
మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ ధృవీకరించడానికి, UIDAI అధికారిక వెబ్‌సైట్ https://myaadhaar.uidai.gov.in లేదా mAadhaar యాప్‌ని సందర్శించాలి. దానిలో, 'Verify Email/Mobile' మీద క్లిక్ చేయాలి. ఇక్కడ, మీ ఆధార్ నంబర్ ఏ మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్ ఐడీతో లింక్ అయివుందో తెలుసుకోవచ్చు. మీకు సంబంధం లేని ఇతర నంబర్‌తో ఆధార్ అనుసంధానమై ఉంటే దానిని సులభంగా గుర్తించొచ్చు. ఆ నంబర్ తీసేసి, మీ నంబర్‌ను అప్‌డేట్ చేయొచ్చు.
మీ మొబైల్ నంబర్‌ను ఇప్పటికే ధృవీకరించి ఉంటే, "నమోదు చేసిన మొబైల్ నంబర్ ఇప్పటికే మా రికార్డ్‌ల్లో ధృవీకరించాం" అన్న సందేశం స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆధార్ కోసం ఎన్‌రోల్‌మెంట్ సమయంలో ఏ మొబైల్ నంబర్ ఇచ్చారో గుర్తు లేకపోతే, https://myaadhaar.uidai.gov.in పోర్టల్ లేదా mAadhaar యాప్‌లోకి వెళ్లాలి. 'Verify Aadhaar' ఆప్షన్‌లోకి వెళ్లి, ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి. ఇప్పుడు, మీరు ఏ మొబైల్ నంబర్ ఇచ్చారో, ఆ నంబర్‌లోని చివరి మూడు అంకెలు కనిపిస్తాయి.
ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసే గడువు పెంపు (Last date for free update of Aadhaar Details)
మీ ఆధార్ వివరాల్లో తప్పులుంటే వాటిని ఉచితంగా మార్చుకునే సదుపాయం ఉంది. ఆన్‌లైన్ పద్ధతిలో ఆధార్ వివరాలను ఉచితంగా మార్చుకునే గడువు డిసెంబర్ 14, 2023తో ముగిసింది. ఇప్పటికీ భారీ సంఖ్యలో ప్రజలు తమ వివరాలను అప్‌డేట్ చేయలేదు. దీంతో, ఉచిత అవకాశం ఉపయోగించుకోని వారి కోసం ఉడాయ్ కీలక నిర్ణయం తీసుకుంది, ఆ గడువును మరో 3 నెలలు పొడిగించింది. ఇప్పుడు, 2024 మార్చి 14 వరకు, మీ ఆధార్ కార్డ్ వివరాలను ఉచితంగా నవీకరించవచ్చు.
మీ ఆధార్‌లో తప్పులు ఉంటే లేదా మీ ఆధార్‌ను అప్‌డేట్ చేసి 10 సంవత్సరాలు అయితే కచ్చితంగా ఆధార్ వివరాలను నవీకరించాలి, ఇది పౌరుల బాధ్యత. మైఆధార్ పోర్టల్ https://myaadhaar.uidai.gov.in ద్వారా ఉచిత అప్‌డేషన్ సదుపాయాన్ని ప్రజలు ఉపయోగించుకోవచ్చు.
ఆన్‌లైన్ ద్వారా ఆధార్‌ను అప్‌డేట్ చేయడం తెలీకపోతే, మీకు దగ్గరలోని ఆధార్ కేంద్రానికి వెళ్లి వివరాలు మార్చుకోవచ్చు. దీనికి కొంత ఫీజు చెల్లించాలి.
మరో ఆసక్తికర కథనం: పీపీఎఫ్ ఇన్వెస్టర్లకు ఈ ఏడాదీ నిరాశే, 2024లో రాబడి భారీగా పెరిగే ఛాన్స్!
Investment Tips: పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో రిస్క్ తక్కువ, మీకు ఏది బెస్ట్
RBI TRAI SMS : 127000 నంబర్ నుంచి ఏదైనా SMS వచ్చిందా! ఇంతకీ ఈ మెసేజ్ ఎవరు పంపుతున్నారు ?
Year Ender 2025: ఈ ఏడాదిలో RBI ఎప్పుడెప్పుడు రెపో రేటు తగ్గించింది? ప్రజలకు ఎలా ఉపశమనం కలిగించింది?
SIP Benefits : కేవలం రూ. 2000 SIPతో 5 కోట్ల రూపాయల భారీ కార్పస్‌ను ఎలా తయారు చేయాలి? ఏ ఫండ్ మంచి రాబడి ఇస్తోంది?
Post Office RD Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో రోజుకు రూ.333 ఆదా చేస్తే మీరే లక్షాధికారి!
Etala Rajender Fire: నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
H3N2 Super Flu: బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
Dekhlenge Saala Song: దేఖ్ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
Hyderabad Messi Mania: ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా