By: ABP Desam | Updated at : 29 Dec 2023 12:18 PM (IST)
ఈ ఏడాదీ పీపీఎఫ్ ఇన్వెస్టర్లకు నిరాశే
PPF Interest Rate Expectations For 2024: చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో (small savings schemes) ఎక్కువ మంది ఎంచుకునే ఆప్షన్ PPF (Public Provident Fund). ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఒకేసారి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. PPFలో పెట్టుబడిపై ఆదాయ పన్ను కట్టక్కర్లేదు, పెట్టుబడికి రిస్క్ ఉండదు, స్థిరమైన వడ్డీ ఆదాయం గ్యారెంటీగా చేతికి వస్తుంది. దీర్ఘకాలిక లక్ష్యాలతో తక్కువ మొత్తాల్లో పెట్టుబడి పెట్టేవారికి PPF ఒక మంచి ఎంపిక.
పీపీఎఫ్‌లో పెట్టుబడి వివరాలు (Details of investment in PPF)
PPF స్కీమ్‌ను 1968లో ప్రారంభించారు. దీని గురించి ఒక్క మాటలో చెప్పాలంటే... ఆదాయ పన్నును ఆదా చేస్తూ పదవీ విరమణ టైమ్‌కు ఆర్థికంగా సిద్ధంగా ఉండడానికి సాయపడే పెట్టుబడి మార్గం ఇది.
100 రూపాయల చిన్న మొత్తంతో PPF అకౌంట్‌ను ఓపెన్ చేయవచ్చు. ఇందులో, ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా రూ.500, గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ మొత్తాన్ని ఒకేసారి లేదా 12 వాయిదాలకు మించకుండా జమ చేయవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం ఒకసారైనా డబ్బు జమ చేయాలి.
PPFలో పెట్టుబడిపై ఆదాయ పన్ను ప్రయోజనాలు (Income tax benefits on PPF investment)
పీపీఎఫ్ కాల గడువు (PPF Maturity Period) 15 సంవత్సరాలు. కావాలనుకుంటే, మరో 5 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు. పెట్టుబడి పెట్టిన ఏడో సంవత్సరం నుంచి పీపీఎఫ్ ఖాతా నుంచి డబ్బును విత్‌డ్రా (Withdraw from PPF account) చేసుకోవచ్చు.
ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద, పీపీఎఫ్ పెట్టుబడిపై రూ.1.50 లక్షల వరకు టాక్స్ బెనిఫిట్ ఉంటుంది. మరో ప్రత్యేకత ఏమిటంటే, పీపీఎఫ్‌పై వచ్చే వడ్డీపై మాత్రమే కాదు, మెచ్యూరిటీ సమయంలో వచ్చే మొత్తం డబ్బు పూర్తిగా పన్ను రహితం (tax free).
పీపీఎఫ్ వడ్డీ రేటు (PPF interest rate)
ప్రస్తుతం, PPFపై ఏడాదికి 7.10 శాతం వడ్డీ రేటు చెల్లిస్తున్నారు. PPF, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NCS), సుకన్య సమృద్ధి యోజన (SSY), కిసాన్ వికాస్ పత్ర (KVP) వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీని త్రైమాసిక ప్రాతిపదికన మారుస్తారు. గత కొన్ని త్రైమాసికాలుగా, కొన్ని పథకాల్లో వడ్డీ రేటు పెరిగింది. అయితే, మొత్తం 2023లో PPFపై వడ్డీ ఒక్కసారి కూడా మారలేదు. ఈ సంవత్సరమే కాదు, PPFపై వడ్డీ 2020 ఏప్రిల్ నుంచి 7.10 శాతం వద్దే ఉంది.
2024లో భారీ వడ్డీ రేటు ఉండే ఛాన్స్!
PPFపై వడ్డీని నిర్ణయించడానికి ఒక ఫార్ములా ఉంది. PPF సహా మిగిలిన అన్ని చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేటు, 10-సంవత్సరాల ప్రభుత్వ సెక్యూరిటీల రాబడితో ముడిపడి ఉంటుంది. చిన్న పొదుపు పథకాల పెట్టుబడిదార్లు మార్కెట్ లింక్డ్ వడ్డీ రేట్ల ప్రయోజనాన్ని పొందేలా 2011లో శ్యామల్ గోపీనాథ్ కమిటీ సిఫార్సు చేసింది.
ఆ కమిటీ సిఫార్సు ప్రకారం... PPF వడ్డీ రేటు, 10-సంవత్సరాల ప్రభుత్వ బాండ్ల రాబడి (Government bond yields) కంటే 0.25% ఎక్కువగా ఉండాలి. 2023 సెప్టెంబర్-అక్టోబర్‌లో 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ 7.28%గా ఉంది. ఫార్ములా ప్రకారం, PPF కొత్త వడ్డీ రేటు 7.53% శాతంగా ఉండాలి. దీనిని దృష్టిలో పెట్టుకుని, కొత్త సంవత్సరంలో అధిక వడ్డీ పొందొచ్చని PPF సబ్‌స్క్రైబర్లు భావిస్తున్నారు. 2024 జనవరి-మార్చి త్రైమాసికానికి సంబంధించి, స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం అతి త్వరలో సమీక్షిస్తుంది.
మరో ఆసక్తికర కథనం: భారీగా పడిన గోల్డ్, సిల్వర్ రేట్లు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Tax Exemption: ఈ స్కీమ్‌కు కొత్త విధానంలోనూ పన్ను మినహాయింపు, బోలెడు డబ్బు ఆదా!
RBI MPC Key Polints: రెపో రేట్ నుంచి ద్రవ్యోల్బణం వరకు - ఆర్బీఐ గవర్నర్ ప్రసంగంలోని కీలకాంశాలు
Repo Rate Cut: బ్రేకింగ్ న్యూస్ - ప్రజలకు 'రెండో' లడ్డూ, రెపో రేట్ తగ్గించినట్లు ఆర్బీఐ ప్రకటన
Reduction In Repo Rate: బ్యాంక్ లోన్ తీసుకువేవాళ్లకు భారీ శుభవార్త - రెపో రేటులో కోత, మీకు వచ్చే ప్రయోజనం ఏంటంటే?
Gold-Silver Prices Today 09 April: ఒకేసారి రూ.7000 పెరిగిన పసిడి, పతనమైన సిల్వర్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Konaseema Latest News: జనసేన గెలిచిన స్థానాల్లో వర్గ విభేదాలు, పి.గన్నవరంలో రెండు వర్గాల కొట్లాట!
Good Bad Ugly Twitter Review - 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ట్విట్టర్ రివ్యూ: అజిత్ హిట్టు కొట్టాడా? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే?
Stock Market Gains Big: ట్రంప్ సుంకాలకు 90 రోజుల విరామం - దుమ్మురేపిన ఆసియా, యూఎస్ మార్కెట్లు
Jack Twitter Review - జాక్ ట్విట్టర్ రివ్యూ: టిల్లు సక్సెస్ జోరుకు బ్రేకులు... సోషల్ మీడియాలో సిద్ధూ 'జాక్' సినిమా టాక్ ఎలా ఉందంటే?