By: ABP Desam | Updated at : 07 Oct 2023 02:31 PM (IST)
ఆధార్‌లో మొబైల్ నంబర్ అప్‌డేట్ చేయడం ఎలా?
Change Mobile Number In Aadhaar: యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) జారీ చేసే 16 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఆధార్. ఇందులో మీ పేరు, పుట్టిన తేదీ, చిరునామా, వేలి ముద్రలు, కంటి పాపలు వంటి కీలక సమాచారం ఉంటుంది. మీ ఆధార్ మొబైల్ నంబర్‌కు లింక్ అయి ఉంటుంది. ఒకవేళ, మీరు ఇటీవల మీ మొబైల్ నంబర్‌ను మారిస్తే, మీ కొత్త నంబర్‌ను ఆధార్‌లో అప్‌డేట్ చేయాలి. లేకపోతే ముఖ్యమైన సమాచారం మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆధార్ అనుబంధ OTPలు మీ కొత్త నంబర్‌కు రావు, పాత నంబర్‌కే వెళతాయి.
మీ ఆధార్‌లో ఏ సమాచారం మార్చాలన్నా, ఇప్పుడు ఉచితంగానే ఆ పని చేయవచ్చు. ఫ్రీ అప్‌డేషన్ గడువును మరో మూడు నెలలు పాటు, డిసెంబర్ 14, 2023 వరకు ఉడాయ్ పొడిగించింది. గతంలో ఈ గడువు సెప్టెంబర్ 14 వరకు ఉంది. దీనికి ముందు, జూన్ 14 వరకు టైమ్ ఇచ్చింది. లాస్ట్ డేట్‌ను ఉడాయ్ పొడిగించడం ఇది రెండోసారి.
మీ ఆధార్ మొబైల్ నంబర్ మార్చుకోవడం చాలా ఈజీ. మీ సమీపంలోని ఆధార్ సేవ కేంద్రానికి వెళితే (ఆఫ్‌లైన్‌లో) ఈ పని సులువుగా పూర్తవుతుంది. అయితే, అక్కడ ఫీజ్ చెల్లించాలి. ఫీజ్ చెల్లించాల్సిన అవసరం లేకుండా, ఆన్‌లైన్‌లో మీరే స్వయంగా మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయవచ్చు.
ఆఫ్‌లైన్‌లో, ఆధార్‌లో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను మార్చే పద్ధతి:
మీ సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లండి
ఆధార్ అప్‌డేట్ లేదా కరెక్షన్ ఫామ్ తీసుకోండి. అప్‌డేట్ చేయాల్సిన మొబైల్ నంబర్‌తో సహా అన్ని వివరాలను పూరించండి.
వివరాలను ఫిల్ చేసిన తర్వాత మీ ఫామ్‌ను ఆధార్ ఎగ్జిక్యూటివ్‌కు సమర్పించండి.
ఆ తర్వాత మీ రెటీనా (కంటిపాప) స్కాన్, మీ బయోమెట్రిక్స్‌ను (వేలిముద్రలు) అందించడం ద్వారా మీ వివరాలను ప్రామాణీకరించాలి.
ఫామ్ సమర్పించిన తర్వాత, అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్‌తో (URN) ఉండే రసీదును మీకు ఎగ్జిక్యూటివ్ ఇస్తారు.
మొబైల్ నంబర్ అప్‌డేషన్ స్టేటస్‌ను చెక్ చేయడానికి URNని ఉపయోగించవచ్చు.
30 రోజుల్లో మీ మొబైల్ నంబర్ అప్‌డేట్ అవుతుంది.
ఆన్‌లైన్‌లో ఫ్రీగా మీ మొబైల్ నంబర్‌ను మార్చే పద్ధతి:
ఇండియన్ పోస్టల్ సర్వీసెస్ వెబ్‌సైట్ లింక్‌నులోకి వెళ్లి మీ పేరు, చిరునామా, మొబైల్ నంబర్ మొదలైన వివరాలు ఫిల్ చేయండి.
డ్రాప్-డౌన్ మెను నుంచి 'సర్వీస్'ను, అందులో నుంచి 'PPB-ఆధార్ సర్వీస్'ను ఎంచుకోండి.
ఇప్పుడు, ఉడాయ్-మొబైల్/ఈమెయిల్ టు ఆధార్ లింక్/అప్‌డేట్‌ను ఎంచుకుని, ఆపై అవసరమైన వివరాలను పూరించండి.
ఆ తర్వాత, 'రిక్వెస్ట్ ఫర్ OTP'పై క్లిక్ చేయండి.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో OTPని ఎంటర్ చేయండి.
'కన్‌ఫర్మ్ సర్వీస్ రిక్వెస్ట్'పై క్లిక్ చేయండి. ఆ తర్వాత, మీ అప్లికేషన్ స్టేటస్‌ని ట్రాక్ చేయడానికి ఉపయోగపడే రిఫరెన్స్ నంబర్‌ను నోట్ చేసుకోండి.
ఒక అధికారి పూర్తి ధృవీకరణ ప్రక్రియను నిర్వహిస్తారు, మిమ్మల్ని సంప్రదిస్తారు.
మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత, మీ మొబైల్ నంబర్ అప్‌డేట్ అవుతుంది.
ఈ సర్వీసు డిసెంబర్ 14 వరకు ఉచితం.
మరో ఆసక్తికర కథనం: రూ.2 వేల నోట్లను 8వ తేదీ తర్వాత కూడా మార్చుకోవచ్చు, షరతులు వర్తిస్తాయి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Loan Against FD: ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటే ఈజీగా లోన్, ఎఫ్డీని రద్దు చేసే పని లేదు
Personal Loan Tips: మీ పర్సనల్ లోన్ అర్హతను మెరుగుపరుచుకునేందుకు ఈ 7 చిట్కాలు పాటించండి
Interest Rates Reduced: లోన్ తీసుకునేవాళ్లకు గుడ్ న్యూస్, ఈ బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించాయి
Gold-Silver Prices Today 11 April: పసిడి రికార్డ్, 97,000 దాటిన రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Stock Market Opening: భారతీయ మార్కెట్లలో జోష్, సెన్సెక్స్ 1000pts జంప్ - గ్లోబల్ మార్కెటు డీలా పడ్డా బేఖాతరు
Vanajeevi Ramaiah: గొప్ప ప్రపంచ పర్యావరణవేత్తను కోల్పోయాం, ఆయన ఎందరికో ఆదర్శం - వనజీవి రామయ్య మృతిపై రేవంత్, చంద్రబాబు సంతాపం
Highest Paid Directors: భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్న పాన్ ఇండియా డైరెక్టర్స్... టాప్ 5లో నలుగురు మనోళ్ళే
Tamil Nadu Politics: మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
Tungabhadra Dam Gates: తుంగభద్ర డ్యాం మొత్తం 33 గేట్లు మార్చాల్సిందే, సామర్థ్యం తగ్గిపోయిందని పరీక్షల్లో వెల్లడి