అన్వేషించండి

2000 Rupee Notes: రూ.2 వేల నోట్లను 8వ తేదీ తర్వాత కూడా మార్చుకోవచ్చు, షరతులు వర్తిస్తాయి

రూ. 12,000 కోట్ల విలువైన ఈ నోట్లు ఇప్పటికీ మార్కెట్‌లోనే ఉన్నాయి.

2000 Rupee Notes: మీ దగ్గర ఇంకా రూ. 2000 నోట్లు మిగిలి ఉంటే, వాటిని బ్యాంక్ బ్రాంచ్ లేదా పోస్టాఫీసులో డిపాజిట్ చేయడానికి ఈ రోజే (అక్టోబర్ 7, 2023) లాస్ట్‌ డేట్‌. అయితే, రేపటి నుంచి కూడా ఈ పెద్ద నోట్లను మార్చుకోవడానికి ఒక ఆప్షన్‌ ఉంది. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఆ ఆప్షన్‌ గురించి చెప్పారు.

శుక్రవారం, రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయాలను ప్రకటించిన ఆర్‌బీఐ గవర్నర్‌, ఇంకా 12,000 కోట్ల రూపాయల విలువైన 2000 రూపాయల నోట్లు బ్యాంకింగ్‌ సిస్టమ్‌లోకి తిరిగి రాలేదని చెప్పారు. అంటే రూ. 3.56 లక్షల కోట్ల విలువైన రూ. 2000 నోట్లలో దాదాపు 97 శాతం మాత్రమే తిరిగి వచ్చాయి. రూ. 12,000 కోట్ల విలువైన ఈ నోట్లు ఇప్పటికీ మార్కెట్‌లోనే ఉన్నాయి.

రూ.2000 నోట్లను అక్టోబర్ 7 తర్వాత కూడా మార్చుకోవచ్చు
ఎవరి దగ్గరైనా రూ. 2 వేల రూపాయల నోట్లు మిగిలిపోతే, అక్టోబర్ 7 తర్వాత కూడా వాటిని డిపాజిట్‌ చేయడం లేదా ఎక్స్‌చేంజ్‌ చేయాలనుకుంటే, అందుకు కొన్ని ఆప్షన్లను శక్తికాంత దాస్‌ చెప్పారు. 8 అక్టోబర్ 2023 నుంచి రూ. 2000 నోట్లను డిపాజిట్ చేయడం లేదా మార్చుకోవడం వీలవుతుంది. అయితే బ్యాంక్‌ బ్రాంచ్‌ల్లో వాటిని తీసుకోరు. రిజర్వ్‌ బ్యాంక్‌ రీజినల్‌ ఆఫీసుల్లో మాత్రమే పెద్ద నోట్లను తీసుకుంటారు. ఆర్‌బీఐకి దేశవ్యాప్తంగా 19 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. ఈ ఆఫీసుల్లో పింక్‌ నోట్లను డిపాజిట్‌ చేయడానికి లేదా ఎక్స్‌చేంజ్‌ చేసుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. 

మొదటి పద్ధతి - సామాన్య ప్రజలు, సంస్థలు RBI ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లి రూ. 2000 నోట్లను మార్చుకోవచ్చు లేదా డిపాజిట్ చేయవచ్చు. మార్పిడి కోసం 20,000 రూపాయల పరిమితి ఉంది. అంటే, సాధారణ ప్రజలు లేదా సంస్థలు RBI ప్రాంతీయ కార్యాలయంలో ఒకేసారి 10 రెండు వేల రూపాయల నోట్లను మాత్రమే మార్చుకోవచ్చు. భారతదేశంలో మీకు ఉన్న బ్యాంక్ ఖాతాలో ఆ డబ్బును డిపాజిట్ చేయాలనుకుంటే మాత్రం ఎలాంటి పరిమితి లేదు.

రెండో పద్ధతి - రూ. 2000 నోట్లను ఇండియా పోస్ట్ లేదా ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ ద్వారా ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయానికి పంపవచ్చు. ఆ మొత్తాన్ని భారతదేశంలోని వారి బ్యాంకు ఖాతాలో మాత్రమే జమ చేస్తారు.

కోర్టులు లేదా చట్టపరమైన సంస్థలు, చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు, దర్యాప్తులో పాల్గొనే సంస్థలు లేదా అమలులో పాలుపంచుకున్న పబ్లిక్ అథారిటీలు కూడా రూ. 2000 నోట్లను దేశంలో ఉన్న RBI ప్రాంతీయ కార్యాలయాల్లో డిపాజిట్ చేయవచ్చు. నోట్లు డిపాజిట్ చేయడానికి ఆయా సంస్థలకు కూడా పరిమితి లేదు.

గుర్తింపు కార్డు తప్పనిసరి
RBI నిబంధనల ప్రకారం, 2000 రూపాయల నోట్లతో పాటు, చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డును సమర్పించాలి. గుర్తింపు కార్డు లేకుండా RBI ప్రాంతీయ కార్యాలయాల్లో 2000 రూపాయల నోట్లను డిపాజిట్ చేసుకోరు.

మరో ఆసక్తికర కథనం: షేర్ల బైబ్యాక్‌పై కీలక అప్‌డేట్‌, వచ్చే బుధవారమే కంపెనీ డైరెక్టర్ల మీటింగ్‌

Join Us on Telegram: https://t.me/abpdesamofficial 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

RBI Loan Recovery Guidelines 2026: అప్పు ఇచ్చారని అడ్డగోలుగా వసూలుకు ప్రయత్నిస్తే నేరమే - ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు ఇవిగో
అప్పు ఇచ్చారని అడ్డగోలుగా వసూలుకు ప్రయత్నిస్తే నేరమే - ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు ఇవిగో
Post Office FD:రెండు లక్షలకు 47వేల రూపాయల వడ్డీ! పోస్టాఫీస్‌లోని ఈ పథకం గురించి తెలుసా?
రెండు లక్షలకు 47వేల రూపాయల వడ్డీ! పోస్టాఫీస్‌లోని ఈ పథకం గురించి తెలుసా?
FD Rates 2026: బ్యాంకుల కొత్త స్కీమ్స్ ద్వారా ఎక్కువ లాభాలు.. ఆ ఎఫ్‌డీల కండీషన్లు మరిచిపోవద్దు
బ్యాంకుల కొత్త స్కీమ్స్ ద్వారా ఎక్కువ లాభాలు.. ఆ FDల కండీషన్లు మరిచిపోవద్దు
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇంకా ఎంత పెరుగుతాయి?
వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇంకా ఎంత పెరుగుతాయి?

వీడియోలు

MI vs KKR IPL 2026 Highlights | ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ ఊచకోత
KKR Bowlers Destroy MI Batting IPL 2026 | ముంబైకు చుక్కలు చూపించిన నరైన్, గ్రీన్
Sanju Samson vs Heinrich Klaasen | క్లాసెన్‌తో గొడవకు ఎండ్ కార్డ్ వేసిన సంజూ
Virat Kohli Comments On Captaincy Stress | ద్రవిడ్ చేసిన సాయంపై కోహ్లీ సంచలన వ్యాఖ్యలు
Hardik Pandya Shocking Comments IPL 2026 | కేకేఆర్ చేతిలో ఓటమిపై హార్దిక్ పాండ్యా అసంతృప్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Mahanadu 2026 Theme: మహానాడు-2026 - స్త్రీ శక్తి థీమ్‌తో టీడీపీ వార్షిక వేడుక.. 20 తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం!
మహానాడు-2026 - స్త్రీ శక్తి థీమ్‌తో టీడీపీ వార్షిక వేడుక.. 20 తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం!
PM మోదీ 5 దేశాల టూర్: యూఏఈతో చమురు భద్రత, చిప్ ప్లాంట్ – మీ జేబు & ఉద్యోగాలపై ప్రభావమేంటీ?
ప్రధాని మోదీ 5 దేశాల పర్యటన: యూఏఈ, ఇటలీ, నెదర్లాండ్స్ నుంచి ఏం తెచ్చారు? మీ జేబు, ఉద్యోగాలు, భద్రతపై ప్రభావం ఏంటీ?
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ ఖాతా బ్లాక్! అరెస్టు ఖాయమంటున్న అభిజీత్! 
బొద్దింక పార్టీకి షాక్, కాక్రోచ్‌ జనతా పార్టీ ఎక్స్ ఖాతా నిలిపివేత!
Peddi Review : పెద్దిపై రామ్ చరణ్ ఫస్ట్ రివ్యూ - ఉప్పెన క్లైమాక్స్‌కు 100 రెట్లు బిగ్ ట్విస్ట్... అసలేంటీ స్టోరీ!
పెద్దిపై రామ్ చరణ్ ఫస్ట్ రివ్యూ - ఉప్పెన క్లైమాక్స్‌కు 100 రెట్లు బిగ్ ట్విస్ట్... అసలేంటీ స్టోరీ!
PoK Terrorist Killings: పాక్‌లో ధురంధర్ ఆపరేషన్స్ - పుల్వామా దాడి మాస్టర్‌మైండ్ హమ్జా బుర్హాన్‌ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో హతం!
పాక్‌లో ధురంధర్ ఆపరేషన్స్ - పుల్వామా దాడి మాస్టర్‌మైండ్ హమ్జా బుర్హాన్‌ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో హతం!
Wife Stabs Husband Case Telangana: భర్తను చంపిన భార్యకు జైలు శిక్ష రద్దు.. కేవలం రూ. 500 జరిమానా! ఎందుకో తెలుసా?
భర్తను చంపిన భార్యకు జైలు శిక్ష రద్దు.. కేవలం రూ. 500 జరిమానా! ఎందుకో తెలుసా?
Vaddi Kaasula Vaada Glimpse : కాలేజీ కట్టి 25 పర్సెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ - తండ్రిపై మంచు మనోజ్ సెటైర్!
కాలేజీ కట్టి 25 పర్సెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ - తండ్రిపై మంచు మనోజ్ సెటైర్!
Bold Comedy Movie : అడల్ట్ కామెడీ విత్ బోల్డ్ డైలాగ్స్ - రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన కొత్త మూవీ
అడల్ట్ కామెడీ విత్ బోల్డ్ డైలాగ్స్ - రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన కొత్త మూవీ
Embed widget