అన్వేషించండి

TCS: షేర్ల బైబ్యాక్‌పై కీలక అప్‌డేట్‌, వచ్చే బుధవారమే కంపెనీ డైరెక్టర్ల మీటింగ్‌

చివరిసారిగా, గత ఏడాది, రూ.18,000 కోట్ల విలువైన షేర్లను టీసీఎస్‌ బైబ్యాక్‌ చేసింది.

TCS Share Buyback: టెక్నాలజీ జెయింట్‌ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), షేర్ల బైబ్యాక్‌ గురించి ఆలోచిస్తోంది. షేర్ల బైబ్యాక్‌ ప్రపోజల్‌ తమ టేబుల్‌పై ఉందని, వచ్చే బుధవారం (అక్టోబర్ 11, 2023‌) డైరెక్టర్ల బోర్డ్‌ మీటింగ్‌ జరుగుతుందని, షేర్స్‌ బైబ్యాక్‌ గురించి ఆ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని స్టాక్‌ ఎక్సేంజీలకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌లో ఈ కంపెనీ వెల్లడించింది. 

2023 సెప్టెంబర్‌ క్వార్టర్‌ (Q2 FY24) ఆర్థిక ఫలితాలను కూడా టీసీఎస్‌ బుధవారం రోజే ప్రకటిస్తుంది. క్వార్టర్లీ రిజల్ట్స్‌న ఆమోదించడానికి ఆ రోజు డైరెక్టర్లు భేటీ అవుతున్నారు. అదే సమావేశంలో షేర్ల బైబ్యాక్‌ ప్రపోజల్‌పైనా నిర్ణయం తీసుకుంటారు. డైరెక్టర్ల బోర్డు ఆమోదం తర్వాత, షేర్ల బైబ్యాక్‌కు సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్‌ను ఈ టెక్‌ కంపెనీ మార్కెట్‌కు వెల్లడిస్తుంది. షేర్ల బైబ్యాక్‌ కోసం కంపెనీ ఎంత డబ్బు కేటాయిస్తుంది, ఎంత ధరకు మించకుండా ఒక్కో షేరును తిరిగి కొనుగోలు చేస్తుంది, తేదీలు ఏంటి అన్న డిటైల్స్‌ బుధవారం రోజు రిలీజ్‌ అవుతాయి. 

చివరిసారిగా, గత ఏడాది, రూ.18,000 కోట్ల విలువైన షేర్లను టీసీఎస్‌ బైబ్యాక్‌ చేసింది. ఒక్కో షేరును రూ. 4,500 ప్రైస్‌ దగ్గర, మొత్తం 4 కోట్ల షేర్లను తిరిగి కొనుగోలు చేసింది. 2022 మార్చిలో ప్రాసెస్‌ ముగిసింది.

శుక్రవారం (06 అక్టోబర్‌ 2023), BSEలో, టీసీఎస్‌ షేర్లు 0.87% లేదా 31.10 రూపాయల లాభంతో 3,620.20 రూపాయల వద్ద క్లోజ్‌ అయ్యాయి. గత నెల రోజుల కాలంలో ఈ షేర్లు 4.76% పెరిగాయి. గత ఆరు నెలల టైమ్‌ పిరియడ్‌లో 10.94%, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు (YTD) 11.03%, గత ఏడాది కాలంలో 18.12% ర్యాలీ చేశాయి. 

టీసీఎస్‌ స్క్రిప్‌ 52 వారాల గరిష్ట స్థాయి రూ. 3,634.25. శుక్రవారం ఈ రికార్డ్‌ స్థాయిని టీసీఎస్‌ షేర్లు క్రియేట్‌ చేశాయి. కాగా, ఈ కౌంటర్‌ 52 వారాల కనిష్ట స్థాయి రూ. 3,013.05.

TCS మొదటి త్రైమాసిక ఫలితాలు 
2023-24 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ‍‌(Q1 FY24), లాభాల్లో 17 శాతం వృద్ధిని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ ప్రకటించింది. ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో కంపెనీ నికర లాభం రూ.11,074 కోట్లు కాగా, కంపెనీ ఆదాయం రూ.59,381 కోట్లుగా లెక్క తేలింది. ఆ ఫలితాలతో పాటే మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుకు రూ.9 చొప్పున డివిడెండ్‌ను టీసీఎస్‌ ప్రకటించింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: జూలు విదిలించిన గోల్డ్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Join Us on Telegram: https://t.me/abpdesamofficial 

టాప్ హెడ్ లైన్స్

మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
PMFME Scheme: ఫుడ్ బిజినెస్ చేసేవారికి గుడ్ న్యూస్.. రూ. 10 లక్షల రుణంపై 35% సబ్సిడీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
ఫుడ్ బిజినెస్ చేసేవారికి రూ. 10 లక్షల రుణంపై 35% సబ్సిడీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Air India New CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget