అన్వేషించండి

How To Save ₹100 Every Day:రోజుకు 100 రూపాయలు సేవ్ చేస్తే మీ ఆర్థిక భవిష్యత్‌ ఎలా మారుతుంది?

How To Save ₹100 Every Day:పొదుపు చిన్న మొత్తంలో చేసినా అది భారీ ఫలితాన్ని ఇస్తుంది. అందుకే మీరు రోజుకు వంద రూపాయలు పొదుపు చేసి చూడండి మీరు ఊహించని రిజల్ట్స్‌ వస్తుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రోజుకు వంద రూపాయలు పొదుపు చేసి కోటీశ్వరులు కావొచ్చని నిపుణులు చెబుతున్నారు.
  • చిన్న అనవసర ఖర్చులు తగ్గించుకుంటూ రోజుకు వంద రూపాయలు ఆదా చేయవచ్చు.
  • నెలవారీ రూ.3000 మ్యూచువల్ ఫండ్స్‌లో పెడితే సంపద గణనీయంగా పెరుగుతుంది.
  • డిజిటల్ ఖర్చులు నియంత్రించి 50/30/20 ఆర్థిక నియమం పాటించడం మంచిది.

How To Save ₹100 Every Day: నెల ఒకటో తారీఖున జీతం అకౌంట్లో పడగానే, ఫోన్‌లో క్రెడిట్‌ కార్డు బిల్లులు,ఈఎంఐలు, ఇంటి అద్దె కట్ అయిపోతాయి. ఇక ఆ తర్వాత స్విగ్గీ, జొమాటోల్లో బిర్యానీ ఆర్డర్లు, వీకెండ్‌ వస్తే చాలు మల్టీప్లెక్స్‌లలో సినిమాలు, పబ్‌లు, కేఫ్‌లలో పార్టీలు, ఇలా స్మార్ట్‌ ఫోన్ చేతిలో ఉంటే చాలు యూపీఐ పిన్‌ కొట్టేస్తూ ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసేస్తున్నాం. ీరా నెలాఖరు వచ్చే సరికి అకౌంట్లో బ్యాలెన్స్‌ లేదు. అప్పు ఎవరైనా ఇస్తారా అని స్నేహితులవైపు చూస్తున్నాం. చాలా ఫేస్‌ చేస్తున్న అతి పెద్ద ఫైనాన్షియల్ సమస్య ఇది. పొదుపు చేద్దానే ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ సేవింగ్స్ అంటే నెల నెలా వేలకు వేలు పక్కన పెట్టాలేమో అంత డబ్బు మన దగ్గర ఎక్కడుందిలే అని చాలా మంది లైట్ తీసుకుంటారు. కానీ ఆర్థిక నిపుణులు చెబుతున్న సీక్రెట్‌ ఏంటంటే... మీరు కోటీశ్వరులు అవ్వడానికి పెద్ద పెద్ద మొత్తాలు అవసరం లేదు. మీ రోజువారీ ఖర్చుల్లో నుంచి కేవలం వంద రూపాయలు పక్కన పెడితే చాలు అంటున్నారు. చూడటానికి చిన్న మొత్తంగానే అనిపించినా ఇది మీ ఫ్యూచర్‌ను ఎలా మారుస్తుందో తెలిస్తే షాక్ అవుతారు.

రోజుకు వంద రూపాయల పొదుపు సాధ్యమేనా?

రోజుకు వంద రూపాయలు ఆదా చేయడమా? ఇది చాలా సింపుల్ కదా అని అనిపించవచ్చు. కానీ ప్రాక్టికల్‌గా దాన్ని ప్రతి రోజూ చేయడం చాలా కష్టం. దీన్నే ఫైనాన్షియల్‌ ప్రపంచంలో లాటే ఫ్యాక్టర్ అంటారు. ప్రముఖ రచయిత డేవిడ్ బాచ్‌ చెప్పిన ఈ సిద్ధాంతం ప్రకారం మనం రోజూ చేసే చిన్న చిన్న అనవసర ఖర్చులను కట్ చేస్తే అద్భుతమైన సంపద సృష్టించవచ్చు. 

ఉదాహరణకు మీరు రోజూ ఆఫీస్‌కు క్యాంటీన్‌లో తాగే ఎక్స్‌ట్రా కాఫీలు, స్మోకింగ్ అలాట్లు, బోర్‌ కొట్టినప్పుడు ఆన్‌లైన్‌లో చేసే ఇంపల్సివ్‌ షాపింగ్‌, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు ఇలా మీకు తెలియకుండానే రోజుకు 200 నుంచి 300 వరకు వృథా అవుతుంటాయి. వీటిలో నుంచి కేవలం వంద రూపాయలు కాపాడుకోవడం పెద్ద కష్టం కాదు. బయట తినే జంక్‌ఫుడ్‌ను వారానికి ఒకసారి పరిమితం చేయండి. దగ్గరి దూరాలు క్యాబ్‌లు, ఆటోలు బుక్ చేయకుండా నడవడం లేదా పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్ వాడటం మంచిది. బాటిల్ వాటర్ కొనే బదులు, ఇంటి నుంచే వాటర్ బాటిల్ తీసుకెళ్లడం ఇలాంటి చిన్న మార్పులతో రోజుకు 100 రూపాయలు ఆదా చేయడం చాలా ఈజీ. 

మీ వంద రూపాయలు కోట్లుగా ఎలా మారుతుంది?

ఐన్‌స్టీన్ చెప్పినట్టు కాంపౌండింగ్‌ అనేది ప్రపంచంలో ఎనిమిదో వింత. అర్థం చేసుకున్న వాడు డబ్బు సంపాదిస్తాడు. అర్థం కాని వాడు వడ్డీలు కడతాడు. మీరు రోజుకు 100 రూపాయలు పొదుపు చేస్తే, నెలకు అది 3000 రూపాయలు అవుతుంది. ఈ మూడు వేల రూపాయలను కేవలం బ్యాంక్‌ సేవింగ్స్‌ అకౌంట్‌లో ఉంచితే ద్రవ్యోల్బణం దెబ్బకు దాని విలువ పడిపోతుంది. అలా కాకుండా ఈ నెలకు 3000 రూపాయలను క్రమం తప్పకుండా మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ ద్వారా పెట్టుబడి పెడితే మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. 

స్టాక్ మార్కెట్‌ ఆధారిత ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ దీర్ఘకాలంలో సగటున 12 శాతం నుంచి 15 శాతం వార్షిక రాబడిని ఇస్తాయి. ఒక వేల మీరు కన్జర్వేటివ్‌గా 12 శాతం రాబడిని లెక్కవేసుకున్నా రిజల్ట్‌ మైండ్‌ బ్లాక్‌ అయ్యేలా ఉంటుంది.    

పెట్టుబడి కాలం మీరు పెట్టిన మొత్తం  వచ్చిన లాభం  మీ చేతికి వచ్చే మొత్తం 
ఐదేళ్లు   1, 80, 000   67,460    2,47,460
పదేళ్లు      3,60,000     3,32,323     6,92,323
15ఏళ్లు   5,40,000   10,03,733     15, 43, 733

20 ఏళ్లు 

7,20,000    22,77,444     29,97,444

25 ఏళ్లు    

9,000,000      47,92,752        56,92,752

30 ఏళ్లు 

10,80,000   94, 49, 531     1,05, 29, 531

స్కాన్‌ అండ్‌ పే ట్రాప్‌కు ఇలా బ్రేక్ వేయండి!

ఈ రోజుల్లో ఖర్చులు పెరిగిపోవడానికి ప్రధాన కారణం డిజిటల్ పేమెంట్స్‌, పర్సులో వంద రూపాయల నోట్ ఉంటే దాన్ని ఖర్చు చేయడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాం. కానీ ఫోన్‌లో క్యూఆర్ కో్ స్కాన్ చేసి పిన్ కొట్టేయడం సెకన్లు వ్యవధిలో జరిగిపోతుంది. దీనిని అరికట్టడానికి మీ శాలరీ పడే మెయిన్ అకౌంట్‌ను జీపే, ఫోన్‌పేలకు లింక్ చేయకండి. దీనికి బదులు ఒక చిన్న సేవింగ్స్ అకౌంట్‌ను ఓపెన్ చేసి, వారానికి సరిపడా పాకెట్ మనీ మాత్రమే అందులో వేసి దాన్ని యూపీఐకీ వాడండి. బ్యాలెన్స్ అయిపోగానే ఆటోమేటిక్‌గా ఖర్చులకు బ్రేక్ పడుతుంది. ఆన్‌లైన‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్డ్‌లలో ఏదైనా వస్తువు కొనాలనిపిస్తే, దాన్ని వెంటనే కార్డ్‌లో వేసి పేమెంట్ చేయకండి. కచ్చితంగా 24 గంటలు ఆగి ఆలోచించండి. మరుసటి రోజు కూడా ఆ వస్తువు మీకు అత్యవసరం అనిపిస్తే కొనండి. 

స్మార్ట్ మనీ మేనేజ్మెంట్‌ రూల్‌

మీ జీతంలో సగం మీ అవసరాలకు అంటే అద్దె, సరకులు, బిల్లులు, ఈఎంఐలు, పిల్లల ఫీజులకు కేటాయించాలి. మరో 30 శాతం ఎంజాయ్ చేయడానికి అంటే సినిమాలు,షాపింగ్‌, టిప్స్‌కు కేటాయించండి. మరో 20 శాతం ఎమర్జెన్సీ ఫండ్‌, సిప్‌, లేదా రిటైర్మెంట్‌ కోసం పొదుపు చేయాలి. ఇన్వెస్ట్‌మెంట్‌లో టైమింగ్‌ కంటే టైమ్‌ గడపడం చాలా ముఖ్యం. ఇప్పటి వరకు జీతం-ఖర్చులు=పొదుపు అనే ఫార్ములాను వదిలేయండి. ఇప్పుడు జీతం-పొదుపు=ఖర్చులు ఫార్ములాకు అలవాటు పడండి. వచ్చే మార్పును మీరే గమనించండి.  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Advertisement

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget