అన్వేషించండి

Personal Loan Death liability: పర్సనల్ లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే బ్యాంకులు నగదు ఎవరి నుంచి వసూలు చేస్తాయి ?

Personal Loan Death Liability: పర్సనల్ లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తిగత రుణాన్ని తిరిగి చెల్లించే బాధ్యత ఎవరిపై ఉంటుందనే సందేహం చాలా మందిలో ఉంటుంది. తెలుసుకుందాం.

Personal Loan | నగదు అవసరం పడితే ఇతరులను అప్పు అడుగుతుంటాం. కానీ రోజులు మారాయి. నగదు కావాలంటే ఇతరుల వద్ద చేతులు చాపడం కంటే బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్ సంస్థల ద్వారా పర్సనల్ లోన్ తీసుకుంటున్నారు. అర్జంటుగా అవసరం పడినా, ఏదైనా కార్యక్రమానికి చేతిలో డబ్బు లేకపోతే పర్సనల్ లోన్ (Personal Loan) తీసుకోవడానికి ప్రజలు మొగ్గు చూపుతుంటారు. మీరు కొన్ని విషయాలు పాటిస్తే చాలా సందర్భాలలో పర్సనల్ లోన్ సులభంగానే లభిస్తుంది. అయితే దీనిపై వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయని తెలిసిందే. కానీ సమయానికి మీకు లోన్ దొరకడం ఒక్కటే రిలీఫ్.

దురదృష్టవశాత్తు  పర్సనల్ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే, అప్పుడు బాకీ ఉన్న లోన్ మొత్తాన్ని చెల్లించాల్సిన బాధ్యత ఎవరిది అనే ప్రశ్నఆ కుటుంబసభ్యులకు వస్తుంది. అలాగే బ్యాంకులు ఈ సందర్భాలలో ఎలాంటి చర్యలు తీసుకుంటాయి ? ఈ పరిస్థితుల్లో లోన్ సెటిల్‌మెంట్ ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో కుటుంబాలు చాలా ఇబ్బందులకు గురవుతాయి. కనుక ఇలాంటి ఆర్థిక పరమైన విషయాలు తెలుసుకోవాలి..

రూల్స్, కండీషన్స్ వర్తిస్తాయి
లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ లోన్ తిరిగి చెల్లించే విషయం లోన్ అగ్రిమెంట్‌లో పేర్కొన్న రూల్స్, కండీషన్స్‌పై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే, బ్యాంకులు లేదా NBFCలు ముందుగా బకాయి మొత్తాన్ని ఎలా తిరిగి పొందవచ్చు అని మార్గాలను అన్వేషిస్తాయి. ఆ తర్వాత, పరిస్థితులకు అనుగుణంగా లోన్ రికవరీ ఎలా చేయాలనే తుది నిర్ణయం తీసుకుంటారు. 

కుటుంబంపై ఏ ప్రభావం ఉంటుంది?
పర్సనల్ లోన్ సాధారణంగా అన్‌సెక్యూర్డ్ (Unsecured) లోన్. అంటే ఈ లోన్ తీసుకోడానికి ఎలాంటి ఆస్తిని లేదా వస్తువులు తాకట్టు పెట్టాల్సిన అవసరం ఉండదు. అందుకే ఒకవేళ లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే ఆ లోన్ చెల్లించాల్సిన బాధ్యత సంబంధిత వ్యక్తి కుటుంబ సభ్యులపై ఉండదు. 

కో-బారోయర్ (Co borrower), గ్యారెంటర్ బాధ్యత
లోన్‌ తీసుకునే సమయంలో కో-బారోయర్ లేదా గ్యారెంటర్‌ను చేర్చుకున్న సమయంలో లోన్ చెల్లించే బాధ్యత వారిపై పడుతుంది. కో-బారోయర్ మొదటి నుంచీ లోన్ చెల్లించడంలో సమాన వాటాదారుగా ఉంటారు. కనుక పర్సనల్ లోన్ EMIలు కట్టడంలో కో-బారోయర్‌కు పూర్తి బాధ్యత ఉంటుంది. మరోవైపు, లోన్ తీసుకున్న ప్రధాన గ్రహీత లోన్ చెల్లించలేని సందర్భంతో ఆ బాధ్యత గ్యారెంటర్‌పై పడుతుంది. అలాంటి పరిస్థితిలో లోన్ చెల్లించాలని గ్యారెంటర్‌పై ఒత్తిడి రావచ్చు.

ఆస్తి ద్వారా వసూలు చేయవచ్చు
ఒకవేళ లోన్ తీసుకునే వ్యక్తి దానికి బదులుగా ఏదైనా ఆస్తిని కనుక బ్యాంకులు లేదా సంస్థల వద్ద తాకట్టు పెట్టి ఉంటే, బ్యాంక్ ఆ ఆస్తి నుండి లోన్ మొత్తాన్ని వసూలు చేస్తుంది. ఉదాహరణకు, పర్సనల్ లోన్ తీసుకున్న వ్యక్తి ఇల్లు, భూమి లేదా బంగారాన్ని తాకట్టు పెట్టినట్లయితే, బ్యాంక్ వాటిని విక్రయించి లోన్ మొత్తాన్ని రికవరీ చేసుకోవడానికి చర్యలు తీసుకుంటుంది.

ఇలాంటి సందర్భాలు ఎదురైతే ఆర్థిక నిపుణుల్ని సంప్రదించాలి. లేదా బ్యాంక్ లోన్ సంబంధిత రూల్స్ పూర్తిగా తెలుసుకున్నాకే సంబంధిత కుటుంబసభ్యులు స్పందించాల్సి ఉంటుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

15 ఏళ్ల హోమ్ లోన్ 6 ఏళ్లలో క్లోజ్ చేసే షార్ట్ కట్ ఇదే! డబ్బు ఆదా చేసే సులభమైన మార్గం!
15 ఏళ్ల హోమ్ లోన్ 6 ఏళ్లలో క్లోజ్ చేసే షార్ట్ కట్ ఇదే! డబ్బు ఆదా చేసే సులభమైన మార్గం!
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Embed widget