అన్వేషించండి

Kisan Credit Card: కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అంటే ఏమిటి? ఇది ఎలా పొందాలి, దాని ద్వారా కలిగే ప్రయోజనాలు

రైతులకు సాగు ఖర్చుల కోసం తక్కువ వడ్డీతో సకాలంలో రుణాలు అందించేందుకు ప్రభుత్వం 1998-99లో కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) పథకాన్ని ప్రారంభించింది. రైతులు సులభమైన ప్రక్రియ ద్వారా ఈ కార్డును పొందవచ్చు.

KCC farmer loan scheme | రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది పీఎం కిసాన్ యోజన కింద రూ.6 వేలు అందిస్తుంది. అదే విధంగా గతంలో కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం 1998–99 సంవత్సరంలో ప్రారంభించింది. ఎక్కువ డాక్యుమెంట్స్ అవసరం లేకుండా, రైతులను బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానించడం ద్వారా వారికి సకాలంలో లోన్ అందించడమే దీని లక్ష్యం. సకాలంలో లోన్స్ అందించడంలో ఈ స్కీమ్ వారికి ఎంతో మేలు చేస్తోంది.

తక్కువ వడ్డీ రేటు, సులభమైన ప్రక్రియ కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో కిసాన్ క్రెడిట్ కార్డ్ వినియోగం వేగంగా పెరిగింది. దీని ద్వారా రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పశుపోషణతో పాటు ఇతర వ్యవసాయ పనుల కోసం కూడా ఆర్థిక సాయం పొందవచ్చు. ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ ఎలా పొందాలో, దీనికి ఏయే డాక్యుమెంట్స్ అవసరమో తెలుసుకుంటే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. 

కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అంటే ఏమిటి?
కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకాన్ని 1998-99 లో ప్రభుత్వం ప్రారంభించింది. ఎక్కువ పేపర్ వర్క్, ఎక్కువ డాక్యుమెంటేషన్ లేకుండానే రైతులను బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానిస్తూ, వారికి సకాలంలో లోన్స్ అందించడమే దీని ఉద్దేశ్యం. ఈ స్కీమ్ కింద రైతులకు స్వల్పకాలిక రుణాలు (Short term loans) ఇస్తారు. వీటిని రైతులు వ్యవసాయం, ఇతర ఖర్చుల కోసం ఉపయోగించుకోవచ్చు.

కిసాన్ క్రెడిట్ కార్డ్ ఎలా పొందాలి?
కిసాన్ క్రెడిట్ కార్డ్ పొందడానికి రైతులు తమ సమీపంలోని బ్యాంకుకు వెళ్లాలి. అక్కడ KCC కోసం అప్లికేషన్ ఫాం నింపాలి. తర్వాత అవసరమైన డాక్యుమెంట్లను జతచేసి బ్యాంకులో సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత బ్యాంకు అధికారులు దరఖాస్తును, డాక్యుమెంట్లను  పరిశీలిస్తారు. అలాగే రైతు భూమి, ఆదాయానికి సంబంధించిన వివరాలను నిర్ధారించుకుంటారు. అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత, బ్యాంకు రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్ (Kisan Credit Card) జారీ చేస్తుంది. దీని ద్వారా నిర్ణీత పరిమితి వరకు రుణం తీసుకోవచ్చు.

అవసరమైన డాక్యుమెంట్స్
కిసాన్ క్రెడిట్ కార్డ్ పొందడానికి కొన్ని డాక్యుమెంట్లు కావాలి. 

గుర్తింపు కార్డు: ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, పాన్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్.

అడ్రస్ ప్రూఫ్: అడ్రస్ నిర్ధారించే డాక్యుమెంట్స్, పుట్టిన తేదీ సర్టిఫికెట్ 

భూమి పత్రాలు: పట్టాదారు పాస్ బుక్, ఖస్రా- ఖతౌనీ లేదా భూమికి సంబంధించిన రశీదులు సబ్మిట్ చేయాలి.

ఇతర వివరాలు: బ్యాంకు అకౌంట్ వివరాలు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, సంతకం చేసిన అప్లికేషన్ ఫారమ్.

బ్యాంకులో డాక్యుమెంట్స్ సమర్పించేటప్పుడు వాటి జిరాక్స్ స్పష్టంగా ఉండాలి. అవసరమైతే ఒరిజినల్ పత్రాలను కూడా వెంట తీసుకెళ్లండి.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
వ్యక్తిగత రైతులు 

ఉమ్మడి రైతులు 

కౌలు రైతులు 

వాటాదారులు, వ్యవసాయానికి సంబంధించిన ఇతర వ్యక్తులు.

వ్యవసాయ పనులతో సంబంధం ఉన్న ఎవరైనా కిసాన్ క్రిడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రైతులకు చాలా తక్కువ వడ్డీకే లోన్స్ వస్తాయి. ప్రభుత్వం ఆ వడ్డీపై సబ్సిడీ కూడా ఇస్తుంది. దీనివల్ల రైతన్నకు మరింత ప్రయోజనం కలుగుతుంది. రైతులకు ఏటీఎం (ATM) వంటి సదుపాయం ఉన్న కార్డ్ ఇస్తారు. దీంతో వారు అవసరమైనప్పుడు క్యాష్ తీసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో బీమా కవరేజ్ కూడా లభిస్తుంది. దీనిద్వారా ప్రమాదకర పరిస్థితుల్లో వారికి ఆర్థిక సహాయం అందుతుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Independence Day 2026 : స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Kerala Influencer Akhil Megha: కేరళం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ జంటకు దిష్టి తగిలేసిందా? బస్సు క్లీనర్‌తో భార్య పరార్‌! బోరుమంటున్న భర్త!
కేరళం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ జంటకు దిష్టి తగిలేసిందా? బస్సు క్లీనర్‌తో భార్య పరార్‌! బోరుమంటున్న భర్త!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget