By: Arun Kumar Veera | Updated at : 22 Apr 2024 08:39 AM (IST)
ఈపీఎఫ్ క్లెయిమ్ స్టేటస్ చెక్ చేయాలా?
How To Check EPF Claim Status: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన చందాదార్ల ప్రయోజనం కోసం తన పోర్టల్‌లో ఎప్పటికప్పుడు కొత్త సౌకర్యాలు, మార్పులు తీసుకువస్తూనే ఉంది. ఈ పోర్టల్‌లో, పీఎఫ్ ఖాతాకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని పొందొచ్చు. చందాదారు కాంట్రిబ్యూషన్, కంపెనీ కాంట్రిబ్యూషన్, ప్రభుత్వం డిపాజిట్ చేసిన వడ్డీ వివరాలను తెలుసుకోవచ్చు. పీఎఫ్ ఖాతాలో నామినీ పేరును యాడ్ చేయొచ్చు.
ఒకవేళ, మీ EPF క్లెయిమ్ స్టేటస్‌ను చెక్ చేయాలనుకుంటే, దీనిని మూడు విధాలుగా చేయొచ్చు. UAN మెంబర్ పోర్టల్, EPF వెబ్‌సైట్, ఉమంగ్ పోర్టల్ ద్వారా EPFO క్లెయిమ్ స్థితిని తనిఖీ చేయొచ్చు.
UAN మెంబర్ పోర్టల్ ద్వారా EPF క్లెయిమ్ స్థితిని ఎలా తనిఖీ చేయాలి?
1. ముందుగా UAN మెంబర్ పోర్టల్‌లోకి వెళ్లి మీ UAN (Universal Account Number) & పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి.
2. ఆ తర్వాత, హోమ్ స్కీమ్‌లో కనిపించే ఆన్‌లైన్ సర్వీసెస్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
3. ఆ లిస్ట్‌ను డ్రాప్ డౌన్ చేసి, ట్రాక్ క్లెయిమ్ స్టేటస్‌పై క్లిక్ చేయండి.
4. ఇప్పుడు, ఆన్‌లైన్ విత్‌డ్రా లేదా ట్రాన్స్‌ఫర్ క్లెయిమ్ స్టేటస్‌ను తనిఖీ చేయొచ్చు.
EPFO వెబ్‌సైట్ ద్వారా EPF క్లెయిమ్ స్టేటస్ ఎలా తనిఖీ చేయాలి?
1. https://passbook.epfindia.gov.in/MemClaimStatusUAN/ లింక్ ద్వారా EPFO అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.
2. EPFO పాస్‌బుక్ అండ్ క్లెయిమ్ స్టేటస్ పేజీపై క్లిక్ చేయండి.
3. UAN, EPFO మెంబర్ పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి.
4. క్లెయిమ్ ట్రాక్ మీద క్లిక్ చేయగానే మీ అన్ని క్లెయిమ్‌ల స్థితి కనిపిస్తుంది. ఇందులో.. అప్రూవ్డ్, సెటల్, ఇ-ప్రాసెస్ వంటి అన్ని రకాల స్టేటస్‌లను చూడొచ్చు.
ఉమంగ్ యాప్ నుంచి EPF క్లెయిమ్ స్టేటస్ ఎలా తనిఖీ చేయాలి?
1. ఉమంగ్ యాప్‌ను ఓపెన్ చేయండి.
2. అందులో, EPFO ఆప్షన్‌లోకి వెళ్లి, ఆల్ సర్వీసెస్ సెక్షన్‌పై క్లిక్ చేయండి.
3. ట్రాక్ క్లెయిమ్ ఆప్షన్‌లోకి వెళ్లి, ఎంప్లాయీ సెంట్రిక్ సర్వీసెస్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
4. ఇప్పుడు మీ UAN నమోదు చేసి, OTPపై క్లిక్ చేయండి.
5. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేసి, సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
6. అప్పుడు మీకు అన్ని రకాల క్లెయిమ్‌లు కనిపిస్తాయి.
EPFO నియమాల్లో మార్పులు
EPFO నిబంధనల్లో ఈ నెల ప్రారంభం (01 ఏప్రిల్ 2024) నుంచి అతి పెద్ద మార్పు వచ్చింది. ఇప్పుడు, ఎవరైనా ఉద్యోగం మారితే అతని EPF ఖాతా ఆటోమేటిక్‌గా కొత్త కంపెనీకి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. గతంలో, ఖాతాదారు అభ్యర్థనపై మాత్రమే ఖాతా బదిలీ జరిగేది.
2023-24 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) వడ్డీ రేటును 8.25% గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది, ఇది మూడేళ్లలో గరిష్ట రేటు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన రేటు 8.15%. EPF వడ్డీ రేటు ఏటా మారుతుంది.
మరో ఆసక్తికర కథనం: జాన్సన్ బేబీ పౌడర్‌లో క్యాన్సర్ కారకాలు! ఓ మహిళ మృతితో సంచలనం - కంపెనీకి షాక్ ఇచ్చిన కోర్టు
Common Mistakes: ఈ పొరపాట్ల వల్ల స్టాక్ మార్కెట్లో 70 శాతం మంది డబ్బు గల్లంతు - ఆ తప్పులు మీరు చేయొద్దు!
Tax Rate Hike: సిగరెట్లు, కూల్‌డ్రింక్స్, బట్టల రేట్లు పెంపు! - కొత్త ఏడాదిలో పన్ను పోటు
Health Insurance Rejection Reasons: గుండె జబ్బు చికిత్సల బీమా క్లెయిమ్ రిజెక్ట్ కావడానికి కారణాలివే!, ముందే అలెర్ట్ కావడం మంచిది
Gold-Silver Prices Today 03 Dec: పెరిగిన 24K, 22K పసిడి రేట్లు - ఈ రోజు బంగారం, వెండి తాజా ధరలు ఇవీ
Car Roof Rack Rules In India In Telugu : కారుపైన లగేజ్ ర్యాక్ ఏర్పాటుకూ కొన్ని రూల్స్ - కారు వయస్సును బట్టి పర్మిషన్!
Telugu Politics: సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
Dwarampudi Chandrasekhar Reddy Latest News: వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్ చేసిన పీసీబీ
Pushpa 2 Ticket Rates: ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
PV Sindhu And Venkata Datta Sai Wedding: పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే..?