Gold-Silver Prices Today 04 Nov: తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా నగల ధరలు - ఏపీ, తెలంగాణలో ఈ రోజు బంగారం, వెండి రేట్లు ఇవీ
Silver- Platinum Prices Today: హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర ₹ 1,06,100 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే ధర అమల్లో ఉంది. 10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 26,970 వద్ద ఉంది.
Latest Gold-Silver Prices 04 November 2024: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల దృష్ట్యా గ్లోబల్ బులియన్ మార్కెట్లో పెద్దగా కదలిక లేదు. ఫ్యూచర్ డైరెక్షన్స్ కోసం, పసిడి పెట్టుబడిదార్లు అమెరికా అధ్యక్ష ఎన్నికలను సరళిని గమనిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో, ప్రస్తుతం, ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర 2,751 డాలర్ల వద్ద ఉంది. మరోవైపు, మన దేశంలోనూ ఫెస్టివ్ సీజన్ తర్వాత పుత్తడి గిరాకీ కొంతమేర తగ్గింది. అంతర్జాతీయంగా ఎల్లో మెటల్లో కదలిక లేకపోవడం, ప్రాంతీయ మార్కెట్లోనూ కొనుగోళ్లు మందగించడంతో ఈ రోజు మన దేశంలో పసిడి, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కిలో వెండి రేటు శుక్రవారం నాడు రూ.3 వేలు తగ్గి రూ. 1,06,100 వద్దకు చేరింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అదే ధర కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States)
తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్ (Gold Rate in Hyderabad) మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 80,400 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర రూ. 73,700 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 60,300 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో రూ.1,06,100 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో (Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 80,400 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ. 73,700 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 60,300 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 1,06,100 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.
** ఇవి స్థానిక పన్నులు కలపని బంగారం & వెండి ధరలు. టాక్స్‌లు కూడా యాడ్ చేస్తే ఈ రేట్లు ఇంకా ఎక్కువగా ఉంటాయి **
ప్రాంతం పేరు | 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | 18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | వెండి ధర (కిలో) |
హైదరాబాద్ | ₹ 80,400 | ₹ 73,700 | ₹ 60,300 | ₹ 1,06,100 |
విజయవాడ | ₹ 80,400 | ₹ 73,700 | ₹ 60,300 | ₹ 1,06,100 |
విశాఖపట్నం | ₹ 80,400 | ₹ 73,700 | ₹ 60,300 | ₹ 1,06,100 |
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities)
ప్రాంతం పేరు | 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) | 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
చెన్నై | ₹ 7,370 | ₹ 8,040 |
ముంబయి | ₹ 7,370 | ₹ 8,040 |
పుణె | ₹ 7,370 | ₹ 8,040 |
దిల్లీ | ₹ 7,380 | ₹ 8,055 |
జైపుర్ | ₹ 7,380 | ₹ 8,055 |
లఖ్‌నవూ | ₹ 7,380 | ₹ 8,055 |
కోల్‌కతా | ₹ 7,370 | ₹ 8,040 |
నాగ్‌పుర్ | ₹ 7,370 | ₹ 8,040 |
బెంగళూరు | ₹ 7,370 | ₹ 8,040 |
మైసూరు | ₹ 7,370 | ₹ 8,040 |
కేరళ | ₹ 7,370 | ₹ 8,040 |
భువనేశ్వర్ | ₹ 7,370 | ₹ 8,040 |
ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries)
దేశం పేరు |
22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
దుబాయ్ (UAE) | ₹ 7,017 | ₹ 7,578 |
షార్జా (UAE) | ₹ 7,017 | ₹ 7,578 |
అబు ధాబి (UAE) | ₹ 7,017 | ₹ 7,578 |
మస్కట్ (ఒమన్) | ₹ 7,087 | ₹ 7,546 |
కువైట్ | ₹ 6,806 | ₹ 7,426 |
మలేసియా | ₹ 7,068 | ₹ 7,414 |
సింగపూర్ | ₹ 7,032 | ₹ 7,742 |
అమెరికా | ₹ 6,895 | ₹ 7,315 |
ప్లాటినం ధర (Today's Platinum Rate)
మన దేశంలో 10 గ్రాముల 'ప్లాటినం' ధర రూ. 160 పెరిగి రూ. 26,970 వద్ద ఉంది. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.
పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.
మరో ఆసక్తిర కథనం: ఫ్లెక్సీ లోన్ Vs ఓవర్‌డ్రాఫ్ట్ Vs పర్సనల్ లోన్ - ఏ అవసరానికి ఏది ఉత్తమం?