అన్వేషించండి

ITR Data: దేశంలో కోటీశ్వరుల సంఖ్య రెండేళ్లలోనే రెట్టింపు, 4.65 కోట్ల మంది 'జీరో'

కోటి కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్న టాక్స్ పేయర్ల సంఖ్య 81,653 నుంచి 1,69,890కు, రెట్టింపు కంటే ఎక్కువే పెరిగింది.

Income Tax Return: వ్యక్తిగత ఆదాయాల ప్రకటన గడువు 31 జులై 2023తో ముగిసింది. ఆ డేటా నుంచి ఇప్పుడు చాలా నిజాలు బయటకు వస్తున్నాయి. మన దేశంలో కోటి రూపాయల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య చాలా వేగంగా పెరిగినట్లు ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్న్ ఫైలింగ్స్‌ డేటా ద్వారా తెలుస్తోంది.

₹కోటి కంటే ఎక్కువ ఆదాయం ఉన్న టాక్స్‌ పేయర్ల సంఖ్య
ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ రిపోర్ట్‌ ప్రకారం...  2022-23 అసెస్‌మెంట్‌ ఇయర్‌లో (2021-22 ఆర్థిక సంవత్సరం) మదింపు సంవత్సరంలో  ITR ఫైల్ చేసిన వాళ్లలో ఒక కోటి రూపాయలకు పైగా ఆదాయాన్ని ప్రకటించిన టాక్స్‌ పేయర్ల (వ్యక్తులు, కంపెనీలు, ట్రస్టులు) సంఖ్య 2.69 లక్షలు. వీళ్లలో ఇండివిడ్యువల్‌ టాక్స్‌ పేయర్లు (వ్యక్తులు) 1,69,890 మంది. 2021--22 అసెస్‌మెంట్‌ ఇయర్‌లో 1,14,446 మంది, 2020-21 మదింపు సంవత్సరంలో 81,653 మంది కోటి రూపాయలకు మించి ఆదాయాన్ని ప్రకటించారు. 

ఈ విధంగా, గత 2 సంవత్సరాల్లోనే (2020-21 అసెస్‌మెంట్‌ ఇయర్‌ - 2022-23 అసెస్‌మెంట్‌ ఇయర్‌ మధ్య కాలంలో) ఒక కోటి కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్న టాక్స్ పేయర్ల సంఖ్య 81,653 నుంచి 1,69,890కు, రెట్టింపు కంటే ఎక్కువే పెరిగింది. 

ఇన్‌కమ్‌ టాక్స్ డిపార్ట్‌మెంట్‌ ఈ-ఫైలింగ్ డేటా ప్రకారం... 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయం కలిగిన మొత్తం పన్ను చెల్లింపుదార్ల  (వ్యక్తులు, కంపెనీలు, ట్రస్టులు) సంఖ్య 2.69 లక్షలు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇది 1.93 లక్షలు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఇది 1.80 లక్షలుగా ఉంది. 2019-20 సంవత్సరంతో పోలిస్తే, కోటి రూపాయల కంటే ఎక్కువ ఆదాయం పన్ను చెల్లించే పన్ను చెల్లింపుదారుల సంఖ్య  2022-23 ఫైనాన్షియల్‌ ఇయర్‌లో 41.5 శాతం పెరిగింది. మరోవైపు, ఇదే కాలంలో రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఇన్‌కమ్‌ టాక్స్‌ చెల్లిస్తున్న వారి సంఖ్య కేవలం 0.6 శాతం మాత్రమే పెరిగింది. 

అదే విధంగా, రూ.5 లక్షలకు పైగా ఆదాయం ఉన్న టాక్స్‌ పేయర్లు 1.4 శాతం పెరిగారు. 2018-19 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, ఈసారి, రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షల పన్ను పరిధిలో 1.10 కోట్ల మంది పన్ను చెల్లింపుదార్లు ఉన్నారు.

ఈ ఏడాది ఐటీఆర్‌ ఫైల్‌ చేసిన టాక్స్‌ పేయర్ల డేటా:

ఒక్కో పన్ను శ్లాబులో పన్ను చెల్లింపుదారుల సంఖ్యను పరిశీలిస్తే, 4.65 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు రూ. 5 లక్షల కంటే తక్కువ ఆదాయాన్ని చూపారు. అంటే 'జీరో టాక్స్‌' చెల్లించారు.
రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల టాక్స్‌ పరిధిలో 1.10 కోట్ల మంది పన్ను చెల్లింపుదార్లు ఉన్నారు.
రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల మధ్య ఆదాయం ఉన్న టాక్స్‌ పేయర్ల సంఖ్య 45 లక్షలు.
రూ. 20 నుంచి రూ. 50 లక్షల మధ్య ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదార్ల సంఖ్య 19 లక్షలు.
రూ. 50 లక్షల నుంచి ఒక కోటి రూపాయల మధ్య ఆదాయం ఉన్న టాక్స్‌ పేయర్ల సంఖ్య 3.3 లక్షలు.
ఒక కోటి రూపాయల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదార్ల సంఖ్య 2.69 లక్షలు.

ఏప్రిల్‌-జూన్‌ కాలంలో 1.36 కోట్ల ITRలు
ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ మధ్య కాలంలో 1.36 కోట్ల మంది ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్నులు ఫైల్‌ చేశారు. గత ఏడాది 2022 ఇదే కాలంలో దాఖలైన 70.34 లక్షల రిటర్నులతో పోలిస్తే, ఈసారి ఫైలింగ్స్‌ 93.76% పెరిగాయి. ఈ ఏడాది జులై నెలలనే 5.41 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. మొత్తంగా చూస్తే.. గత నెలాఖరు (జులై 31) నాటికి 6.77 కోట్ల రిటర్నులు వచ్చినట్లు ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రకటించింది. 

మరో ఆసక్తికర కథనం: ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' Adani Green, HDFC Bank

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Government Banned OTT Apps: 18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Embed widget