By: ABP Desam | Updated at : 08 Aug 2023 08:43 AM (IST)
స్టాక్స్ టు వాచ్ - 08 ఆగస్టు 2023
Stock Market Today, 08 August 2023: ఇవాళ (మంగళవారం) ఉదయం 8.25 గంటల సమయానికి, గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 36 పాయింట్లు లేదా 0.19 శాతం రెడ్ కలర్‌లో 19,645 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
ఇవాళ Q1 రిజల్ట్స్ ప్రకటించే కీలక కంపెనీలు: అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, సీమెన్స్, హిందాల్కో. ఈ స్టాక్స్ ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉంటాయి.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
అదానీ గ్రీన్: ప్రమోటర్ కంపెనీ ఇన్ఫినిట్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్, సోమవారం, అదానీ గ్రీన్‌లో కొంత వాటాను బల్క్ డీల్స్ ద్వారా విక్రయించింది, ఖతార్‌కు చెందిన సావరిన్ ఫండ్ ఆ షేర్లను కొనుగోలు చేసింది.
HDFC బ్యాంక్: HDFCతో విలీనం తర్వాత FTSE ఎమర్జింగ్ ఆల్ క్యాప్ ఇండెక్స్‌లో HDFC బ్యాంక్ ఇన్వెస్టబిలిటీ వెయిట్ 0.81% నుంచి 1.52%కి పెరిగింది.
PB ఫిన్‌టెక్: పాలసీబజార్ & పైసాబజార్ బ్రాండ్‌లను నడుపుతున్న PB ఫిన్‌టెక్ లిమిటెడ్, 2023-34 మొదటి త్రైమాసికంలో నష్టాలను గణనీయంగా రూ.11.9 కోట్లకు తగ్గించుకుంది. ఆదాయం 32% పెరిగి రూ.666 కోట్లకు చేరుకుంది.
BEML: రూ. 3,177 కోట్ల విలువైన రోలింగ్ స్టాక్ కాంట్రాక్ట్ 5RS-DM సరఫరా కోసం బెంగళూరు మెట్రో రైల్ కార్ప్ నుంచి లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ (LoA) పొందింది.
ఐనాక్స్ విండ్: రిపోర్ట్స్ ప్రకారం, ప్రమోటర్ ఎంటిటీ రేపు బ్లాక్ డీల్ ద్వారా ఐనాక్స్ విండ్‌లో రూ. 500 కోట్ల విలువైన షేర్లను విక్రయించే అవకాశం ఉంది.
గోద్రెజ్ కన్స్యూమర్: FMCG కంపెనీ అమ్మకాలు మొదటి త్రైమాసికంలో 10% వాల్యూమ్ వృద్దితో 10% పెరిగాయి. అదే సమయంలో నికర లాభం 19% వృద్ధితో రూ.353 కోట్లకు చేరుకుంది.
ఓలెక్ట్రా గ్రీన్‌టెక్: జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ రూ.18.1 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. కార్యకలాపాల ద్వారా రూ.216 కోట్ల ఆదాయం సంపాదించింది.
మోంటే కార్లో: మోంటే కార్లో తొలి త్రైమాసికంలో రూ.11.6 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. ఆ త్రైమాసికంలో ఆదాయం రూ.139 కోట్లుగా ఉంది.
శోభ: జూన్ త్రైమాసికంలో శోభా రూ.12.1 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. కార్యకలాపాల ద్వారా రూ.908 కోట్ల ఆదాయం ఆర్జిచింది.
టోరెంట్ ఫార్మా: ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో టొరెంట్ ఫార్మా లాభం రూ.378 కోట్లు, ఆదాయం రూ.2,591 కోట్లు.
టాటా కెమికల్స్: జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికి టాటా కెమికల్స్ నికర లాభం రూ.523 కోట్లుగా ఉంది. కార్యకలాపాల ద్వారా రూ.4,218 కోట్ల ఆదాయం గడించింది.
గ్లాండ్ ఫార్మా: తొలి త్రైమాసికంలో రూ.194 కోట్ల నికర లాభాన్ని గ్లాండ్ ఫార్మా ప్రకటించింది. రూ.1,209 కోట్ల ఆదాయం మీద ఈ లాభాన్ని సాధించింది.
పేటీఎం: PwC, పేటీఎం పేమెంట్స్ అనుబంధ సంస్థ ఆడిటర్ పదవికి నిన్న రాజీనామా చేసింది.
మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్: CEO పదవికి వినోద్ రోహిరా రాజీనామా చేయగా, ఆయన స్థానంలో రమేష్ నాయర్‌ను కంపెనీ నియమించింది.
ఇది కూడా చదవండి: అదానీ గ్రీన్ ఎనర్జీలో బ్లాక్ డీల్ - 500 మిలియన్ డాలర్ల పెట్టుబడి!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Home Loan: ఆర్‌బీఐ పాలసీ ప్రభావం హోమ్ లోన్స్ మీద ఎలా ఉంటుంది, ఇప్పుడు గృహ రుణం తీసుకోవచ్చా?
UPI Transaction: యూపీఐ పేమెంట్స్‌పై తియ్యటి కబురు, ఇప్పుడు రూ.5 లక్షల వరకు చెల్లించొచ్చు
Inflation Projection: ధరలతో దబిడి దిబిడే - ఇంత పెద్ద విషయాన్ని ఆర్‌బీఐ ఎంత కూల్‌గా చెప్పిందో!
RBI Repo Rate: ఈఎంఐల భారం నుంచి ఈసారి కూడా ఉపశమనం లేదు - రెపో రేట్ యథాతథం
Latest Gold-Silver Prices Today: మళ్లీ రూ.64,000 వైపు పసిడి పరుగు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే
Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?
Best Selling EV Brands: భారతదేశంలో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారు కంపెనీలు ఇవే - టాప్‌లో ఏ కంపెనీ ఉందంటే?
Telangana BJP : ఎమ్మెల్యేలుగా ప్రమాణానికి బీజేపీ దూరం - అక్బరుద్దీనే కారణమన్న రాజాసింగ్ !
/body>