Adani Green Energy: అదానీ గ్రీన్ ఎనర్జీలో బ్లాక్ డీల్ - 500 మిలియన్ డాలర్ల పెట్టుబడి!
Adani Green Energy: అదానీ గ్రీన్ ఎనర్జీలో సోమవారం బ్లాక్‌డీల్ జరిగినట్టు తెలిసింది. ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ 500 మిలియన్ డాలర్ల విలువైన వాటాను కొనుగోలు చేసినట్టు సమాచారం.
Adani Green Energy:
అదానీ గ్రీన్ ఎనర్జీలో (Adani Green Energy) సోమవారం బ్లాక్‌డీల్ జరిగినట్టు తెలిసింది. ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ 500 మిలియన్ డాలర్ల విలువైన వాటాను కొనుగోలు చేసినట్టు సమాచారం. ఈ డీల్‌కు ముందు కంపెనీ షేర్లు ఇంట్రాడేలో 14.4 శాతం మేర పడిపోయాయి. రూ.886 వద్ద కనిష్ఠాన్ని తాకాయి. ఆ తర్వాత ఈ కౌంటర్ పుంజుకొని నష్టాలను తగ్గించుకొంది. మొత్తం ఈ బ్లాక్ డీల్ ద్వారా 2.7 శాతం మేర ఈక్విటీ షేర్లు చేతులు మారినట్టు తెలిసింది.
అదానీ గ్రీన్ ఎనర్జీలో జూన్ 30 నాటికి ప్రమోటర్ లేదా ప్రమోటర్ల బృందానికి 56.27 శాతం వాటా ఉంది. మిగిలినది ప్రజల వద్ద ఉంది. సోమవారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ షేర్లు చివరి రోజు ముగింపు ధర రూ.1012తో పోలిస్తే 3 శాతం నష్టపోయి రూ.982 వద్ద ట్రేడవుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 48 శాతం నష్టపోయింది. 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.2574 నుంచి 62 శాతం పతనమైంది.
2024 ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో అదానీ గ్రీన్ ఎనర్జీ రూ.323 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది ఇదే సమయంలో ఇది రూ.214 కోట్లు కావడం గమనార్హం. అంటే వార్షిక ప్రాతిపదికన 51 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇక నిర్వాహక ఆదాయం 33 శాతం పెరిగి రూ.2176 కోట్లుగా ఉంది. గతేడాది ఇదే సమయంలో ఈ సంఖ్య రూ.1635 కోట్లే. ఇక విద్యుత్ సరఫరా నుంచి ఆదాయం వార్షిక ప్రాతిపదికన 55 శాతం పెరిగి రూ.2059 కోట్లుగా ఉంది. ఈ సెగ్మెంట్ ఎబిటా 53 శాతం ఎగిసి రూ.1938 కోట్లుగా నమోదైంది.
జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో నిర్వాహక సామర్థ్యం వార్షిక ప్రాతిపదికన 43 శాతం పెరిగి 8316 మెగావాట్లకు చేరుకుంది. గతేడాదితో పోలిస్తే 1750 మెగావాట్ల సోలార్ విండ్ హైబ్రీడ్, 212 మెగావాట్ల సోలార్, 554 మెగావాట్ల విండ్ పవర్ జత కలిసింది.
కంపెనీ ప్రదర్శన బాగున్నప్పటికీ అనలిస్టులు ఈ స్టాక్‌కు సెల్ రేటింగే ఇస్తున్నారు. ట్రెండ్ లైన్ డేటా ప్రకారం యావరేజ్ టార్గెట్ ప్రైజ్ రూ.402. అంటే ప్రస్తుత స్థాయి నుంచి 59 శాతం కనిష్ఠం. టెక్నికల్‌గా ఈ స్టాక్ RSI (14) 48.7 వద్ద ఉంది. సాధారణంగా RSI 30 కన్నా కిందకు తగ్గితే ఎక్కువ అమ్మినట్టుగా భావిస్తారు. 70 కన్నా ఎక్కువగా ఉంటే ఎక్కువ కొనుగోలు చేసినట్టు భావిస్తారు. ఇక MACD 27.6 వద్ద ఉంది. సెంటర్ లైన్ మీద, సిగ్నల్ లైన్ కింద ఉంది.
Also Read: ఎస్‌ఎంఎస్ ఛార్జీల వివాదం - ఒక సందేశానికి 4 రూపాయలా?
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.