News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Amazon vs Jio: ఎస్‌ఎంఎస్‌ ఛార్జీల వివాదం - ఒక సందేశానికి 4 రూపాయలా?

Amazon vs Jio: భారత టెలికాం, అంతర్జాతీయ కంపెనీల మధ్య ఎస్‌ఎంఎస్‌ ఛార్జీల వివాదం ముదురుతోంది. తాము పంపించే సందేశాలకు స్థానిక రేట్లు తీసుకోవాలని అమెజాన్‌, గూగుల్‌ వంటి కంపెనీలు డిమాండ్‌ చేస్తున్నాయి.

FOLLOW US: 
Share:

Amazon vs Jio: 

భారత టెలికాం దిగ్గజాలు అంతర్జాతీయ కంపెనీల మధ్య ఎస్‌ఎంఎస్‌ ఛార్జీల వివాదం క్రమంగా ముదురుతోంది. తాము పంపించే సందేశాలకు స్థానిక రేట్లు తీసుకోవాలని అమెజాన్‌, గూగుల్‌ వంటి కంపెనీలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఆ సందేశాల పుట్టిన సర్వర్లు విదేశాల్లో ఉన్నాయి కాబట్టి అంతర్జాతీయ రేట్లే తీసుకుంటామని జియో (Jio), ఎయిర్‌టెల్‌ (Airtel), వొడాఫోన్‌ ఐడియా (Vi) అంటున్నాయి. కాగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (TRAI) విడుదల చేసిన పేపర్లలో అమెజాన్‌ ఇచ్చిన వివరణ ఇప్పుడు సంచలనంగా మారింది.

అసలేంటీ వివాదం

తమ కస్టమర్లకు నిరంతరం అప్‌డేట్లు ఇవ్వడానికి కంపెనీలు సందేశాలు పంపిస్తుంటాయి. ఉదాహరణకు అమెజాన్‌లో షాపింగ్‌ చేస్తే కన్ఫర్మేషన్‌, డెలివరీ స్టేటస్‌, ఓటీపీ వంటి సందేశాలు పంపిస్తుంది. ఈమెయిల్‌కు లాగిన్‌ అయినప్పుడు గూగుల్‌ సైతం టూ ఫ్యాక్టర్‌ అథంటికేషన్‌లో భాగంగా ఓటీపీలు పంపిస్తుంటుంది. మెటా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఇక జొమాటో, స్విగ్గీ, పేటీఎం, ఫోన్‌పే, బ్యాంకులు సహా అన్ని కంపెనీలు సందేశాలు పంపిస్తూనే ఉంటాయి.

ఇలాంటి పంపించే సందేశాలను డొమస్టిక్‌, ఇంటర్నేషనల్‌ అని రెండు రకాలు విభజిస్తారు. టెలికాం కంపెనీలు స్థానిక సందేశాలకు ఒక్కో దానికి 13 పైసలు తీసుకుంటున్నాయి. విదేశాల నుంచి వచ్చే వాటికి ఐదు సెంట్లు లేదా 4.10 రూపాయాలు వసూలు చేస్తున్నాయి. ఆరు నెలల క్రితమే టెలికాం కంపెనీలు ఈ ఛార్జీలను 25 శాతం మేర పెంచాయి. దాంతో అమెజాన్‌, ఉబెర్‌ వంటి కంపెనీలు తమ సందేశాల సంఖ్యను బాగా తగ్గించేశాయి.

అమెజాన్‌ ఫైటింగ్‌

ఈ ఛార్జీలపై మిగతా వాటితో పోలిస్తే అమెజాన్‌ కాస్త గట్టిగానే పోరాడుతోంది. తమకు ఇండియన్‌ సబ్సిడరీ కంపెనీ అని, ఇక్కడ నుంచే సందేశాలు పంపిస్తున్నామని వాదిస్తోంది. కాబట్టి ఒక్కో దానికి 13 పైసలు మాత్రమే తీసుకోవాలని కోరుతోంది. ఈ మేరకు టెలికాం అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI)కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ట్రాయ్‌ విడుదల చేసిన చర్చా పాత్రంలో అమెజాన్‌ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

'ఎస్‌ఎంఎస్‌ టెర్మినేషన్ ఛార్జీలను కంపెనీలే భరిస్తున్నాయి. స్థానిక, అంతర్జాతీయ సందేశాల నిర్వచనంపై స్పష్టత లేకపోవడం వల్ల టెలికాం కంపెనీలు తమ వాదనకు అనుకూలమైన  పద్ధతిలో ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. కంప్యూటర్‌ రిసోర్స్‌ లేదా సర్వర్లు విదేశాల్లో ఉంటే అంతర్జాతీయ సందేశంగా భావిస్తున్నాయి. నిజానికి ఆ సందేశాల పుట్టుకలో భారత్‌ టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్ల నెట్‌వర్క్‌ పాత్ర పరిమితంగా ఉంటుంది. టెలికాం నెట్‌వర్క్‌తో అవసరం లేకుండానే నేరుగా వినియోగదారులకు సందేశాలు వెళ్లే టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులో ఉంది' అని అమెజాన్‌ తెలిపింది.

విదేశాల్లో పుట్టుక నిజమే: జియో

అమెజాన్‌ వ్యాఖ్యలపై జియో, వొడాఫోన్‌ ఐడియా మండిపడ్డాయి. 'గతంలో తమ కాల్స్‌ ఎక్కడ నుంచి వస్తున్నాయో చెప్పేందుకు ఇష్టపడని కంపెనీలు ఇప్పుడు తమ సందేశాల పుట్టుక విదేశాల్లోనే జరుగుతోందని ఒప్పుకుంటున్నాయి. టెక్నాలజీలో ముందడుగు, వినియోగదారుల ప్రయోజనాల పేరుతో ట్రాయ్‌ నిబంధనలను పాటించకపోవడం సబబే అన్నట్టుగా మాట్లాడుతున్నాయి' అని రిలయన్స్‌ జియో తెలిపింది.

మోసమే అవుతుంది: వొడాఫోన్‌ ఐడియా

'ఇది మోసం కిందకే వస్తుంది. స్థానిక సందేశాల ముసుగులో అంతర్జాతీయ సందేశాలు పంపించడం గ్రే వాయిస్‌ కాల్స్‌ వంటి మోసమే అవుతుంది. వాణిజ్య ప్రయోజనాల కోసం డొమస్టిక్‌ కాల్స్‌ను ఇంటర్నేషనల్‌ కాల్స్‌గా టెర్మినేట్‌ చేసేవాళ్లు. ఇప్పుడు టెక్నాలజీ ముందడుగు గురించి చెప్పడమూ అలాంటిదే' అని వొడాఫోన్‌ ఐడియా పేర్కొంది.

Published at : 07 Aug 2023 02:41 PM (IST) Tags: Reliance Jio Airtel Amazon SMS Fees

ఇవి కూడా చూడండి

Stock Market Today: 19,700 మీదే నిఫ్టీ ముగింపు - 173 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌

Stock Market Today: 19,700 మీదే నిఫ్టీ ముగింపు - 173 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌

Renovation Loan: మీ పాత ఇంటిని కొత్తగా మార్చేయండి - రెనోవేషన్‌ లోన్‌ రేట్లు, టాక్స్‌ బెనిఫిట్స్‌ ఇవిగో!

Renovation Loan: మీ పాత ఇంటిని కొత్తగా మార్చేయండి - రెనోవేషన్‌ లోన్‌ రేట్లు, టాక్స్‌ బెనిఫిట్స్‌ ఇవిగో!

Cryptocurrency Prices: రెండు వేలు తగ్గిన బిట్‌కాయిన్‌! మిక్స్‌డ్‌ జోన్లో క్రిప్టోలు

Cryptocurrency Prices: రెండు వేలు తగ్గిన బిట్‌కాయిన్‌! మిక్స్‌డ్‌ జోన్లో క్రిప్టోలు

Sugar Stocks: పెట్టుబడిని పరుగులు పెట్టించిన షుగర్‌ స్టాక్స్‌, ఇదంతా ఇథనాల్‌ ఎఫెక్టా?

Sugar Stocks: పెట్టుబడిని పరుగులు పెట్టించిన షుగర్‌ స్టాక్స్‌, ఇదంతా ఇథనాల్‌ ఎఫెక్టా?

Rs 2 Lakh Pension: మీరు 40ల్లోకి వచ్చారా, రిటైర్మెంట్‌ తర్వాత నెలకు రూ.2 లక్షల పెన్షన్ పొందాలంటే ఇప్పుడెంత పెట్టుబడి పెట్టాలి?

Rs 2 Lakh Pension: మీరు 40ల్లోకి వచ్చారా, రిటైర్మెంట్‌ తర్వాత నెలకు రూ.2 లక్షల పెన్షన్ పొందాలంటే ఇప్పుడెంత పెట్టుబడి పెట్టాలి?

టాప్ స్టోరీస్

Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!

Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు షాకిచ్చిన కేంద్రం, సీబీఐ విచారణకు ఆదేశం

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు షాకిచ్చిన కేంద్రం, సీబీఐ విచారణకు ఆదేశం

IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్‌ మాక్సీ! రాజ్‌కోట్‌ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి

IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్‌ మాక్సీ! రాజ్‌కోట్‌ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి

Pawan Kalyan: బాలిక హత్యపై మహిళా కమిషన్ ఎందుకు స్పందించట్లేదు, కనీస బాధ్యత లేదా: పవన్ కల్యాణ్

Pawan Kalyan: బాలిక హత్యపై మహిళా కమిషన్ ఎందుకు స్పందించట్లేదు, కనీస బాధ్యత లేదా: పవన్ కల్యాణ్