News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Artificial Intelligence: కృత్రిమ మేథకు మోదీ బూస్ట్‌! జీపీయూ క్లస్టర్‌ ఏర్పాటు చేస్తున్న కేంద్రం

Artificial Intelligence: కేంద్ర ప్రభుత్వం 'ఇండియా ఏఐ ప్రోగ్రామ్‌'లో భాగంగా భారీ గ్రాఫిక్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ (GPU) క్లస్టర్‌ను నెలకొల్పనుందని కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ అన్నారు.

FOLLOW US: 
Share:

Artificial Intelligence: 

దేశంలో ఆర్టిఫీయల్‌ ఇంటెలిజెన్స్‌ స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 'ఇండియా ఏఐ ప్రోగ్రామ్‌'లో భాగంగా భారీ గ్రాఫిక్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ (GPU) క్లస్టర్‌ను నెలకొల్పనుందని కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ అన్నారు.

జీపీయూలతో కూడిన కంప్యూటర్ల సముదాయాన్ని జీపీయూ క్లస్టర్‌ అంటారు. ఇందులో ప్రతి నోడ్‌కు జీపీయూ అనుసంధానమై ఉంటుంది. వీటి ద్వారా ఇమేజ్‌, వీడియో ప్రాసెసింగ్‌లో న్యూరల్‌ నెటవర్క్‌లకు శిక్షణ ఇస్తారు. ఏఐ అప్లికేషన్ల కోసం చిప్ డిజైన్లో స్థానిక మేధో ఆస్తులను సృష్టించే స్టార్టప్‌లు, విదేశీ కంపెనీలను ప్రోత్సహిస్తామని మంత్రి చంద్రశేఖర్‌ తెలిపారు. ఇందుకోసం రూ.1100-1200 కోట్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సహాక పథకం (PLI Scheme) అమలు చేస్తామని వెల్లడించారు.

'ప్రస్తుతం ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ అంటే ఎక్కువగా ఛాట్‌ జీపీటీ వంటి అప్లికేషన్ల గురించే చర్చ జరుగుతోంది. అయితే నిజమైన ప్రపంచానికి కృత్రిమ మేధ ఉపయోగపడాలన్నదే మా లక్ష్యం. ఆరోగ్యం, విద్య, వైద్యం, పాలన, వీటికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్లలో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌కు అనుసంధానం చేసిన ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్లను రూపొందించాలని మేం కోరుకుంటున్నాం' అని చంద్రశేఖర్‌ తెలిపారు.

గుజరాత్‌లోని సంసద్‌లో మైక్రాన్‌కు చెందిన సెమీకండక్టర్‌ ప్యాకేజింగ్‌, అసెంబ్లింగ్‌ ప్లాంట్‌కు చంద్రశేఖర్‌ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ ప్లాంట్‌ గ్లోబల్‌ ఎలక్ట్రానిక్స్‌ వాల్యూ చైన్‌లో భారత్‌ను సీరియస్‌గా తీసుకోవాలన్న సంకేతాలను చిప్‌ కంపెనీలు, ఇన్వెస్టర్లకు పంపించిందన్నారు.

కంప్యూటర్‌ స్టోరేజీ చిప్‌ తయారీ కంపెనీ మైక్రాన్‌ రూ.22,540 కోట్ల (2.75 బిలియన్‌ డాలర్లు) విలువైన గుజరాత్‌లో సెమీ కండక్టర్‌ అసెంబ్లీ, టెస్ట్‌ ప్లాంట్‌ను నెలకొల్పుతోంది. ఇందులో రూ.6760 కోట్లు ప్లాంట్‌కు కేటాయిస్తారు. దీనిని మైక్రాన్‌ కంపెనీ భరిస్తోంది. మిగిలిన డబ్బులను కేంద్ర ప్రభుత్వం రెండు దశల్లో పెట్టుబడి పెడుతుంది. ప్రాజెక్టుకు అయ్యే మొత్తం ఖర్చులో 50 శాతాన్ని మైక్రాన్‌కు కేంద్రం ఆర్థికసాయం చేస్తుంది. ఇక 20 శాతానికి సమానమైన ప్రోత్సాహకాలను గుజరాత్‌ ప్రభుత్వం ఇస్తుంది.

వివిధ దశల్లో సెమీ కండక్టర్‌ ప్లాంట్‌ నిర్మాణం జరుగుతుంది. తొలి దశలో ఐదు లక్షల చదరపు అడుగుల క్లీన్‌రూమ్‌ స్పేస్‌ ఉంటుంది. 2024 ఆఖర్లో నిర్వహణలోకి వస్తుంది. 18 నెలలుగా భారత్‌లో సెమీ కండక్టర్ల తయారీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పనిచేస్తోందని రాజీశ్‌ చంద్రశేఖర్‌ అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ దార్శనికతలో భాగంగా రూ.76,000 పెట్టుబడిని ప్రణాళికబద్ధంగా పెడుతున్నామని చెప్పారు. భారత్‌ సెమీ కండక్టర్‌ నేషన్‌గా ఎదగడంలో ఇదో కీలక మైలురాయిగా వర్ణించారు.

తయారీ రంగానికి సరైన మౌలిక సదుపాయాలు ఉండటం, వ్యాపారానికి అనుకూలమైన వాతావరణం, సంసద్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌లో విలువైన ప్రతిభ ఉండటంతోనే గుజరాత్‌ను ప్లాట్‌ నిర్మాణానికి సరైన ప్రాంతంగా ఎంచుకున్నామని మైక్రాన్‌ తెలిపింది.

Stock Market at 12PM, 22 September 2023:

భారత స్టాక్‌ మార్కెట్లు వరుస నష్టాల నుంచి తేరుకున్నాయి. మెజారిటీ ఆసియా సూచీలు లాభాల్లో ఉండటం ఇన్వెస్టర్లలో సానుకూల సెంటిమెంటుకు దారితీసింది. లాభాల స్వీకరణ తగ్గిపోవడంతో మార్కెట్లు రీబౌండ్‌ అయ్యాయి. నేటి మధ్యాహ్నం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 38 పాయింట్లు పెరిగి 19,781 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 159 పాయింట్లు ఎగిసి 66,389 వద్ద కొనసాగుతున్నాయి. ఫార్మా, ఐటీ, లోహ రంగాలపై సెల్లింగ్‌ ప్రెజర్‌ నెలకొంది. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగాలకు మద్దతు దొరికింది.

Published at : 22 Sep 2023 02:02 PM (IST) Tags: Artificial Intelligence Rajeev Chandrasekhar GPU cluster AI startups

ఇవి కూడా చూడండి

Home Loan: ఆర్‌బీఐ పాలసీ ప్రభావం హోమ్‌ లోన్స్‌ మీద ఎలా ఉంటుంది, ఇప్పుడు గృహ రుణం తీసుకోవచ్చా?

Home Loan: ఆర్‌బీఐ పాలసీ ప్రభావం హోమ్‌ లోన్స్‌ మీద ఎలా ఉంటుంది, ఇప్పుడు గృహ రుణం తీసుకోవచ్చా?

UPI Transaction: యూపీఐ పేమెంట్స్‌పై తియ్యటి కబురు, ఇప్పుడు రూ.5 లక్షల వరకు చెల్లించొచ్చు

UPI Transaction: యూపీఐ పేమెంట్స్‌పై తియ్యటి కబురు, ఇప్పుడు రూ.5 లక్షల వరకు చెల్లించొచ్చు

Inflation Projection: ధరలతో దబిడి దిబిడే - ఇంత పెద్ద విషయాన్ని ఆర్‌బీఐ ఎంత కూల్‌గా చెప్పిందో!

Inflation Projection: ధరలతో  దబిడి దిబిడే - ఇంత పెద్ద విషయాన్ని ఆర్‌బీఐ ఎంత కూల్‌గా చెప్పిందో!

RBI Repo Rate: ఈఎంఐల భారం నుంచి ఈసారి కూడా ఉపశమనం లేదు - రెపో రేట్‌ యథాతథం

RBI Repo Rate: ఈఎంఐల భారం నుంచి ఈసారి కూడా ఉపశమనం లేదు - రెపో రేట్‌ యథాతథం

Latest Gold-Silver Prices Today: మళ్లీ రూ.64,000 వైపు పసిడి పరుగు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Latest Gold-Silver Prices Today: మళ్లీ రూ.64,000 వైపు పసిడి పరుగు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

టాప్ స్టోరీస్

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే

Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?

Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?

BRS MLA Marri Rajashekar Reddy: బీఆర్ఎస్ నేతలకు బెదిరింపు ఫోన్ కాల్స్, సీపీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే

BRS MLA Marri Rajashekar Reddy: బీఆర్ఎస్ నేతలకు బెదిరింపు ఫోన్ కాల్స్, సీపీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే