Gold-Silver Price: స్వల్పంగా పెరిగిన పసిడి.. వెండి కూడా అదే దారిలో.. తాజా ధరలివే..
హైదరాబాద్లో కూడా పసిడి ధర గ్రాముకు రూ.10 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99) ధర ప్రస్తుతం రూ.47,460 గా ఉంది.
భారత్లో నేడు బంగారం ధరల్లో స్వల్ప వ్యత్యాసం కనిపించింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ రూ.45,480 గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా తాజాగా రూ.46,480గా నిలకడగానే ఉంది. బంగారం ధరల్లో స్వల్ప వ్యత్యాసం ఉండగా.. వెండి ధర మాత్రం గ్రాముకు రూ.1 పెరిగింది. దీంతో కేజీ వెండికి రూ.వెయ్యి వరకూ తేడా ఉంది. తాజాగా భారత్లో కిలో వెండి ధర రూ.60,500 గా ఉంది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర కాస్త ఎక్కువగా రూ.64,600 ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ముఖ్య నగరాల్లో నేడు పసిడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
Also Read: ఈ షేరులో లక్ష పెట్టుంటే ఆరు నెలల్లో రూ.9.41 లక్షలు చేతికొచ్చేది!
ఆంధ్రా, తెలంగాణలో బంగారం, వెండి తాజా ధరలివీ..
హైదరాబాద్లో కూడా పసిడి ధర గ్రాముకు రూ.10 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99) ధర ప్రస్తుతం రూ.47,460 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం (91.6) ధర రూ.43,500 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో కిలో రూ.64,600గా ఉంది.
ఇక విజయవాడలో 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ.43,500 కాగా.. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.47,460గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.64,600గా ఉంది. ఇక విశాఖపట్నం పసిడి మార్కెట్లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,500 గానే ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,460గా ఉంది. ఇక్కడ వెండి ధర కిలో రూ.64,600 పలుకుతోంది.
Also Read: కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మీ అకౌంట్లోకి మూడు నెలల జీతం
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు నేడు ఇలా ఉన్నాయి. ముంబయిలో ఈరోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.45,480ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,480గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,870 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,860గా ఉంది.
ప్లాటినం ధరలో స్వల్ప తగ్గుదల
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర స్వల్పంగా పెరిగింది. గ్రాముకు రూ.3 తగ్గి.. రూ.2,315గా ఉంది. హైదరాబాద్లో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.23,150 గా ఉండగా.. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర యథాతథంగా ఉంది.
అనేక అంశాలపై బంగారం, వెండి ధరలు
బంగారం ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తాయి.
Also Read: అమెజాన్లో అక్టోబర్ 2న వీటిపై డిస్కౌంట్లు.. మీ విష్లిస్టులో ఉంటే కొనేయండి!
Also Read: మళ్లీ టాటా చేతిలోకి ఎయిర్ ఇండియా!.. ఖండించిన ప్రభుత్వం