Tata Takeover Air India: మళ్లీ టాటా చేతిలోకి ఎయిర్ ఇండియా!.. ఖండించిన ప్రభుత్వం
ఎయిర్ ఇండియాను తిరిగి టాటా దక్కించుకున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే వీటిని ప్రభుత్వం ఖండించింది.
ఎయిర్ ఇండియా.. తిరిగి టాటా చేతిలోకి వచ్చినట్లు బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. త్వరలోనే ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అయితే ఎయిర్ ఇండియాను దక్కించుకునేందుకు స్పైస్ జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్ కూడా బిడ్ దాఖలు చేశారు. అయితే చివరికి టాటా సన్స్.. ఎయిర్ ఇండియాను దక్కించుకున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Tata Sons wins the bid for national carrier Air India. Tata Sons was the highest bidder. Union Home Minister Amit Shah-led ministerial panel has given approval to this bid: Sources pic.twitter.com/99OdR9LXCA
— ANI (@ANI) October 1, 2021
భారీ సంక్షోభంలోకి కూరుకుపోయిన ఎయిరిండియాను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం కొన్నాళ్లుగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా అసక్తి ఉన్న సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. ఇందులో టాటా గ్రూప్, స్పైస్‌జెట్ సహా పలు ప్రముఖ సంస్థలు బిడ్ దాఖలు చేశాయి. వాటిలో నుంచి ప్రభుత్వం టాటా గ్రూప్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం.
ఖండించిన ప్రభుత్వం..
ఎయిర్ ఇండియాను టాటా సంస్థ దక్కించుకుందని మీడియాలో వస్తున్న వార్తలను ప్రభుత్వం ఖండించింది. ఈ వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది. ఈ అంశంపై నిర్ణయం తీసుకున్న తర్వాత మీడియాకు సమాచారం అందిస్తామని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అస్సెట్ మేనేజ్‌మెంట్ వెల్లడించింది.
Media reports indicating approval of financial bids by Government of India in the AI disinvestment case are incorrect. Media will be informed of the Government decision as and when it is taken: Secretary, Department of Investment and Public Asset Management, GoI pic.twitter.com/PoWk7UceF5
— ANI (@ANI) October 1, 2021
ఇక్కడే మొదలు..
ఎయిర్ ఇండియాను 1932లో టాటా స్థాపించింది. 1953లో ఎయిర్ ఇండియాను ప్రభుత్వం జాతీయం చేసింది. ప్రస్తుతం సింగపూర్ ఎయిర్‌లైన్స్ భాగస్వామ్యంతో విస్తారా విమాన సేవలను టాటా నడుపుతోంది.
జాతీయ విమాన సంస్థ, ఎయిర్ ఇండియా నష్టాలతో కూరుకుపోతుండడంతో.. ఆ సంస్థలో మెజారిటీ వాటాలు అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం 2018లో బిడ్‌లకు ఆహ్వానం పలికినా ఆ సంస్థలో వాటాను కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. సుమారు 76 శాతం వాటాను అమ్మాలని ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయత్నం కూడా సక్సెస్ కాలేదు. దీంతో ఎయిర్ ఇండియాలో నూరు శాతం వాటాను కేంద్రం అమ్మకానికి పెట్టింది.
ALSO READ: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పోరాటం ఎవరి కోసం? పార్టీ కోసమా? సినీ పరిశ్రమ కోసమా?
ALSO READ: మంత్రి మేకపాటి ఇలాకాలో వైసీపీ వర్సెస్ వైసీపీ.. అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు..
ALSO READ: పోలీసు స్టేషన్‌లో నెవ్వర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ సీన్.. పోలీసు అధికారికి ట్రాన్స్‌జెంజర్స్ సన్మానం