By: ABP Desam | Updated at : 01 Oct 2021 08:31 AM (IST)
Edited By: Venkateshk
ప్రతీకాత్మక చిత్రం
గుంటూరు జిల్లాలో ఓ యజమానికి నమ్మకద్రోహం చేసిన వ్యక్తి చివరికి కటకటాలపాలయ్యాడు. అంతేకాక, అతను మాస్టర్ ప్లాన్ వేసి డబ్బులు కొట్టేయాలని చూశాడు. అందుకోసం పోలీసులను సైతం బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించాడు. బ్లేడ్‌తో తానే చెయ్యి కోసుకొని దోపిడీ దొంగలు దాడి చేసినట్లు కథ అల్లాడు. అయినా అతని మాస్టర్ ప్లాన్ ఫలించలేదు. పోలీసులకు చిన్న విషయంలో అనుమానం వచ్చి విచారణ చేపట్టగా చివరికి తానే నగదు దొంగిలించినట్లుగా ఒప్పుకున్నాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.
Also Read: ఇంటిపై దాడులకు భయపడను.. చిరంజీవి మాట్లాడరా? పోసాని స్పందన.. ట్విస్ట్ ఇచ్చిన జనసేన నేత
గురువారం గుంటూరులో నిందితుడి వివరాలను జిల్లా అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ విలేకరులకు వెల్లడించారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి చెందిన గొరికపూడి కనకయ్య అనే వ్యక్తి అదే గ్రామంలో ఉండే వడ్ల వ్యాపారి అయిన వెంకటేశ్వరరావు దగ్గర గుమస్తాగా పనిచేస్తున్నాడు. తన యజమాని చెప్పిన చోటుకు వెళ్లి డబ్బులు వసూలు చేసుకొని రావడం కనకయ్య పని. చాలా కాలం నుంచి నమ్మకంగా పని చేస్తున్నాడు. అలా సెప్టెంబర్ 29న చిలకలూరిపేటలోని రైస్‌మిల్లు యజమాని అలీ వద్ద రూ.1.30 లక్షలు తీసుకొని వస్తుండగా.. కనకయ్య మదిలో చెడు ఆలోచన ప్రవేశించింది. ఎలాగైనా ఆ నగదును కొట్టేయాలని అనుకున్నాడు. అందుకోసం పన్నాగం పన్నాడు.
Also Read: పని మనిషిపై వంట మనిషి దాష్టీకం.. బలవంతంగా రూంలోకి లాక్కెళ్లి రేప్
తక్కెళ్లపాడు రైల్వే బ్రిడ్జి దగ్గరికి రాగానే తన వద్ద ఉన్న ఫోల్డింగ్ బ్లేడ్‌తో తన చొక్కాతోపాటు లోపలి బనియన్ చింపుకున్నాడు. తన వద్ద ఉన్న నగదును కుమారుడిని పిలిచి ఇచ్చి పంపేశాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనను గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో బెదిరించి తన వద్ద ఉన్న నగదు దోచుకెళ్లారని ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో నిందితులు ముఖాలకు మాస్కులు ధరించారని చెప్పాడు. అతణ్ని క్షుణ్నంగా పరిశీలించిన పోలీసులకు చొక్కా, బనియన్ చినిగిన తీరు అనుమానం కలిగించింది.
పోలీసులు తమదైన శైలిలో లోతుగా ప్రశ్నించగా.. ఆ నగదును తానే దోచినట్లు ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద రూ.1.30 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేయడంతోపాటు మిల్లు యజమానికి నమ్మక ద్రోహం చేసినందుకు అతనిపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఈ కేసును పోలీసులు ఆరు గంటల్లోనే ఛేదించారు.
Also Read: కుళ్లిన స్థితిలో నటి శవం.. గది నుంచి తీవ్ర దుర్వాసన, ఏం జరిగిందంటే..
Amalapuram Violence : పోలీసుల వలయంలోనే అమలాపురం, మరో 46 మందిపై కేసు, ఎఫ్ఐఆర్ లో ప్రముఖుల పేర్లు
Yes Bank-DHFL Scam : ఎస్ బ్యాంక్-డీహెచ్ఎఫ్ఎల్ నిధుల మళ్లింపు కేసు, పుణెకు చెందిన బిల్డర్ అరెస్టు
Karimnagar News : కస్తూర్బా స్కూల్స్ లో ఉద్యోగాలని నకిలీ అపాయింట్మెంట్ లెటర్స్, లక్షల్లో మోసపోయిన నిరుద్యోగులు
Nellore Knife Attack : నెల్లూరులో దారుణం, పట్టపగలే యువకుడిపై కత్తులతో దాడి
Hyderabad News : సరూర్ నగర్ కుటుంబం ఆత్మహత్యాయత్నం కేసు, వెలుగులోకి సంచలన విషయాలు
Rahul Gandhi: ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ సతమతం, ప్రశ్న అడగ్గానే ఏం చెప్పాలో అర్థం కాలేదా? - వీడియో వైరల్
Weather Updates: చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు - నేడు ఈ జిల్లాలకు వర్షం అలర్ట్
KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్
Lucknow Super Giants: లక్నో ఎలిమినేషన్‌కి చెన్నై కారణమా... ఆ ఒక్క మ్యాచ్ ఫలితం మరోలా వచ్చి ఉంటే?