X

Banjara Hills Rape: పని మనిషిపై వంట మనిషి దాష్టీకం.. బలవంతంగా రూంలోకి లాక్కెళ్లి రేప్

బంజారాహిల్స్‌‌లో ఓ ఇంట్లో పని చేస్తున్న యువతిని బలవంతంగా ఓ వ్యక్తి గదిలోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు.

FOLLOW US: 

తెలంగాణలో వరుసగా అత్యాచారాలు జరుగుతుండడం సంచలనంగా మారింది. నెల రోజుల వ్యవధిలోనే మరో బలాత్కార ఘటన చోటు చేసుకుంది. బంజారాహిల్స్ పరిధిలోని ఓ ఇంట్లో పని మనిషిపై వంట మనిషి రేప్ చేశాడు. హైదరాబాద్‌లో ఆరేళ్ల చిన్నారి అత్యాచార ఘటన మరువక ముందే, రెండు రోజుల క్రితం నిజామాబాద్‌లో యువతికి మద్యం తాగించి సామూహిక అత్యాచార ఘటన జరిగింది. మళ్లీ తాజాగా బంజారాహిల్స్‌లోనూ అలాంటి ఘటనే జరగడం ఆందోళన కలిగిస్తోంది.

బంజారాహిల్స్‌‌లో ఓ ఇంట్లో పని చేస్తున్న యువతిని బలవంతంగా ఓ వ్యక్తి గదిలోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. వారు చెప్పిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12లోని ఓ విల్లాలో ఈ నెల 15వ తేదీన ఓ యువతి పనిలో చేరింది. అదే ఇంట్లో శివ అనే 38 ఏళ్ల వ్యక్తి వంట మనిషిగా పని చేస్తున్నాడు. ఎప్పటిలాగే యువతి తెల్లవారుజామున యువతి పనిలో చేరి విల్లాలో గ్రౌండ్‌ ఫ్లోర్‌ శుభ్రం చేస్తూ ఉంది. అలాంటి పరిస్థితిలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో శివ ఆమె వద్దకు వచ్చి బలవంతంగా తన గదిలోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. 

ఈ విషయం ఎవరికైనా చెబితే అంతు చూస్తానంటూ ఆమెను బెదిరించినట్లుగా బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు చెప్పారు. వెంటనే ఆమె తన సోదరుడికి విషయం చెప్పింది. ఈ మేరకు బాధితురాలు తన సోదరుడితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బంజారాహిల్స్‌ పోలీసులు రేప్‌కు పాల్పడ్డ శివ అనే వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

Also Read: Hyderabad Crime: కుళ్లిన స్థితిలో నటి శవం.. గది నుంచి తీవ్ర దుర్వాసన, ఏం జరిగిందంటే..

రెండ్రోజుల క్రితం నిజామాబాద్‌లో..
నిజామాబాద్‌లోని ఓ ఆసుపత్రి గదిలో యువతిపై సామూహిక అత్యాచార ఘటన రెండ్రోజుల క్రితం వెలుగులోకి వచ్చింది. యువతిపై నలుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. యువతికి మద్యం తాగించి, దారుణానికి ఒడిగట్టారు. ఓ ఆసుపత్రి గదిలోకి తీసుకెళ్లి సాముహిక అత్యాచారం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం, ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: వైఎస్‌ షర్మిలతో ప్రశాంత్‌ కిషోర్‌ బృందం భేటీ.. పాదయాత్రపై చర్చ!

ఈ కేసులో ముగ్గురు అరెస్టు
నిజామాబాద్‌‌లో యువతి గ్యాంగ్‌ రేప్‌ కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. యువతిపై ఆమె ప్రియుడితో పాటు అతని స్నేహితులు మద్యం తాగించి అత్యాచారం చేశారు. బాధితురాలికి సదరు యువకుడు ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. బర్త్‌ డే పార్టీ కోసం ఆర్మూర్‌ నుంచి యువతి నిజామాబాద్‌కు వచ్చిందని పోలీసులు చెప్పారు.

Also Read: Nizamabad: యువతిపై నలుగురు అత్యాచారం.. ఆస్పత్రి గదిలోనే మద్యం తాగించి దారుణంగా..

Also Read: రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు.. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి.. దక్షిణ మధ్య రైల్వే వెల్లడి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Tags: hyderabad rape Banjara Hills Rape Maid Rape incident Cooking person Rapes Maid

సంబంధిత కథనాలు

Murder Case: ఆత్మహత్య కాదు.. హత్యే.. రాత్రి వొడ్కా తాగి.. స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసి.. ఆపై..

Murder Case: ఆత్మహత్య కాదు.. హత్యే.. రాత్రి వొడ్కా తాగి.. స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసి.. ఆపై..

Viveka Case : వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ చార్జిషీట్ .. కాపీ కావాలని కోర్టులో సునీత పిటిషన్ !

Viveka Case :  వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ చార్జిషీట్ .. కాపీ కావాలని కోర్టులో సునీత పిటిషన్ !

విమానాల్లో దేశమంతా తిరుగుతారు.. డిజిటల్ కీ సాయంతో ఒకే కంపెనీ ఏటీఎంలలో చోరీలు చేస్తారు

విమానాల్లో దేశమంతా తిరుగుతారు.. డిజిటల్ కీ సాయంతో ఒకే కంపెనీ ఏటీఎంలలో చోరీలు చేస్తారు

Student Suicide: నా ఫొన్ అమ్మేసి అంత్యక్రియలు చేయండి.. నా ఆత్మ శాంతిస్తుంది..

Student Suicide: నా ఫొన్ అమ్మేసి అంత్యక్రియలు చేయండి.. నా ఆత్మ శాంతిస్తుంది..

Crime News: ఫేస్ బుక్ పరిచయం.. ప్రియురాలు రమ్మంటే రాత్రి వెళ్లాడు.. ఆ దుంగ లేకుంటే ఏమయ్యేదో

Crime News: ఫేస్ బుక్ పరిచయం.. ప్రియురాలు రమ్మంటే రాత్రి వెళ్లాడు.. ఆ దుంగ లేకుంటే ఏమయ్యేదో
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Amit Shah on PM Modi: 'దేశం.. మోదీ వైపు చూస్తుంటే ప్రపంచం.. భారత్ వైపు చూస్తోంది'

Amit Shah on PM Modi: 'దేశం.. మోదీ వైపు చూస్తుంటే ప్రపంచం.. భారత్ వైపు చూస్తోంది'

Bigg Boss 5 Telugu: మొత్తానికి షణ్ముఖ్ కి ఛాన్స్ వచ్చిందిగా.. కెప్టెన్ గా రచ్చ చేస్తాడేమో.. 

Bigg Boss 5 Telugu: మొత్తానికి షణ్ముఖ్ కి ఛాన్స్ వచ్చిందిగా.. కెప్టెన్ గా రచ్చ చేస్తాడేమో.. 

Corona Cases In AP: రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 567 మందికి కొవిడ్19 పాజిటివ్

Corona Cases In AP: రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 567 మందికి కొవిడ్19 పాజిటివ్

Huzurabad And Badvel By Election: ముగిసిన హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారం.. మూగబోయిన మైకులు..

Huzurabad And Badvel By Election: ముగిసిన హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారం.. మూగబోయిన మైకులు..