South Central Railway: రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు.. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి.. దక్షిణ మధ్య రైల్వే వెల్లడి
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడిచే రైళ్లలో కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను సూపర్ ఫాస్ట్ రైళ్లుగా.. ప్యాసింజర్ రైళ్లను ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మార్పు చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.
దక్షిణ మధ్య రైల్వే (SCR) పరిధిలోని పలు రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడిచే రైళ్లలో కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను సూపర్ ఫాస్ట్ రైళ్లుగా.. ప్యాసింజర్ రైళ్లను ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మార్పు చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 872 రైళ్లు ఉండగా వాటిలో 673 రైళ్ల వేగాన్ని పెంచుతున్నట్లు తెలిపింది. మరికొన్ని రైళ్ల టెర్మినల్ స్టేషన్లలో మార్పులు తీసుకొచ్చినట్లు పేర్కొంది. ఈ మార్పులన్నీ అక్టోబర్ 1వ తేదీ (ఎల్లుండి) నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. అక్టోబర్ 1 నుంచి రైళ్లలో ప్రయాణాలు చేసే వారంతా ముందస్తుగా రైళ్ల టైమింగ్స్ తెలుసుకోవాలని సూచించింది.
సూపర్ పాస్ట్‌గా మారనున్న రైళ్ల వివరాలు (కొత్త రైలు నంబర్లు)
సికింద్రాబాద్ - మణుగూరు ఎక్స్‌ప్రెస్ (02745/02746)
నర్సాపూర్ - నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్ (02713/02714)
కాచిగూడ - మంగళూరు సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ (02777/02778)
సికింద్రాబాద్ - రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ (02755/02756)
కాకినాడ టౌన్ - భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ (02699/02700)
సికింద్రాబాద్ - హైసర్ ఎక్స్‌ప్రెస్ (02789/02790)
ఎక్స్‌ప్రెస్‌గా మారనున్న ప్యాసింజర్ రైళ్ల వివరాలు..
పాత నెంబర్ | రూట్ | కొత్త నెంబర్ |
57121 | కాజీపేట్-సిర్పూర్ టౌన్ | 07272 |
57122 | సిర్పూర్ టౌన్ - కాజీపేట్ | 07271 |
57123 | భద్రాచలం రోడ్ - సిర్పూర్ టౌన్ | 07260 |
57124 | సిర్పూర్ టౌన్ - భద్రాచలం రోడ్ | 07259 |
57381 | గుంటూర్- నర్సాపూర్ | 07267 |
57382 | నర్సాపూర్- గుంటూర్ | 07268 |
57547 | హైదరాబాద్ డెక్కన్- పూర్ణా | 07653 |
57548 | పూర్ణా- హైదరాబాద్ డెక్కన్ | 07654 |
57549 | హైదరాబాద్ డెక్కన్ - ఔరంగబాద్ | 07049 |
57550 | ఔరంగబాద్- హైదరాబాద్ డెక్కన్ | 07050 |
57563 | నాందేడ్- తాండూర్ | 07691 |
57564 | తాండూర్- నాందేడ్ | 07692 |
67241 | విజయవాడ - కాకినాడ పోర్ట్ | 07273 |
67242 | కాకినాడ పోర్ట్- విజయవాడ | 07264 |
67243 | కాకినాడ పోర్ట్ - విశాఖపట్నం | 07265 |
67244 | విశాఖపట్నం - కాకినాడ పోర్ట్ | 07266 |
67297 | గుడూరు - విజయవాడ | 07261 |
67298 | విజయవాడ -గుడూరు | 07262 |
77281 | గుంటూరు - కాచిగూడ | 07269 |
77282 | కాచిగూడ- గుంటూరు | 07270 |
77693 | కాచిగూడ -రాయిచూర్ | 07797 |
77694 | రాయిచూర్ - కాచిగూడ | 07798 |
Salient Features of South Central Railway New Time Table with effect from 01st October' 2021.
— South Central Railway (@SCRailwayIndia) September 29, 2021
Passengers travelling from 01st October 2021 are advised to check actual train timings before the commencement of their journey. https://t.co/tdgovyFX24
Also Read: వైఎస్ షర్మిలతో ప్రశాంత్ కిషోర్ బృందం భేటీ.. పాదయాత్రపై చర్చ!
Also Read: జగతి పబ్లికేషన్స్ కేసులో దర్యాప్తు పూర్తయింది.. సీబీఐ కోర్టుకు తెలిపిన ఈడీ