News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Atmakur: మంత్రి మేకపాటి ఇలాకాలో వైసీపీ వర్సెస్ వైసీపీ.. అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు..

ఆత్మకూరు మున్సిపాలిటీలో వైసీపీ కౌన్సిలర్ల మధ్య లుకలుకలు మొదలయ్యాయని తెలుస్తోంది. మున్సిపాలిటీలో అక్రమాలు జరుగుతున్నాయంటూ వైసీపీ కౌన్సిలర్లు అధికారులను నిలదీశారు.

FOLLOW US: 
Share:

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సొంత నియోజకవర్గం నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మున్సిపాలిటీ సమావేశం వాడివేడిగా సాగింది. అధికార పార్టీ కౌన్సిలర్లే సమావేశాన్ని అడ్డుకున్న పరిస్థితి నెలకొంది. మున్సిపాలిటీలో అక్రమాలు జరుగుతున్నాయంటూ వైసీపీ కౌన్సిలర్లు అధికారులను నిలదీశారు. మంత్రికి చెడ్డపేరు తెస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. 

అక్రమ లే అవుట్లపై చర్చ.. 
ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో అక్రమ లే అవుట్లు వెలుస్తున్నాయని, మున్సిపాలిటీకి రావాల్సిన పన్నులు చెల్లించకుండా లే అవుట్లు వేసి అమ్మేస్తున్నారని కొంతమంది కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్రమ లే అవుట్లు వేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొంతమంది ఒత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో అభాసుపాలు కాకూడదనే ఉద్దేశంతోనే తాము ఈ సమస్యలను లేవనెత్తుతున్నామని చెప్పారు. 

Also Read: బద్వేలు ఉపఎన్నికపై సీఎం జగన్ సమావేశం... గతంలో కన్నా ఎక్కువ మెజారిటీ రావాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం... అన్ని వర్గాలను కలుపుకొని వెళ్లాలని ఆదేశం

ఆత్మకూరు మున్సిపాలిటీలో లుకలుకలు.. 
ఆత్మకూరు మున్సిపాలిటీలో వైసీపీ కౌన్సిలర్ల మధ్యే ఇటీవల కాస్త లుకలుకలు మొదలయ్యాయని తెలుస్తోంది. ఈ క్రమంలో ఓ గ్రూప్‌నకు అధికారులు ఒత్తాసు పలుకుతున్నారు. వారు జట్టు కట్టి మున్సిపాలిటీలో పెత్తనాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో అక్రమ లే అవుట్లకు ఈజీగా అనుమతులు వచ్చేస్తున్నాయి. వాటిల్లో అక్రమంగా గ్రావెల్ తరలింపునకు కూడా అనుమతులు ఆటోమేటిక్‌గా వచ్చేస్తున్నాయనేది వైరి వర్గం ఆరోపణగా ఉంది. అంతే కాదు.. మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలపై చర్చ జరపాలని కొంతమంది కౌన్సిలర్లు పట్టుబట్టారు. పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతుంటే అధికారులు పట్టించుకపోవడం పట్ల సభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు తెలియకుండానే తమ వార్డులలో పనుల గురించి ప్రకటించడం విడ్డూరంగా ఉందని అధికారులను నిలదీశారు. అక్రమ లేవుట్లకు అక్రమంగా గ్రావెల్ తరలిస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారని ప్రశ్నించారు. 

Also Read: పవన్ పై ఏపీ మంత్రులు ఫైర్.. జగన్ ను మాజీ సీఎం చేస్తే రాజకీయాల్లోంచి తప్పుకుంటానని మంత్రి కొడాలి నాని కౌంటర్

అడ్డుకునేదీ వారే.. అనుమతులు ఇచ్చేదీ వారే..
మున్సిపాలిటీ పరిధిలో ఏవైనా అక్రమ కట్టడాలు నిర్మిస్తుంటే అధికారుల అడ్డుకుని తిరిగి వారే అనుమతులు ఇవ్వడం విడ్డూరంగా ఉందని పలువురు కౌన్సిలర్లు వాపోయారు. డ్రైనేజీ, వీధి లైట్లు, తాగునీటి అవసరాలు, చేతి పంపుల మరమ్మతులు వంటి చిన్నపాటి సమస్యలు పరిష్కరించాలని అడిగినా నిధులు లేవంటూ అధికారులు ముఖం చాటేస్తున్నారని అధికార పార్టీ కౌన్సిలర్లు చెబుతున్నారు. అయితే అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేసిన కౌన్సిలర్లు, మంత్రికి చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. 

Also Read: ఏపీ మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై నాన్‌బెయిల్‌బుల్‌ వారెంట్‌

Also Read: ప్రశ్నించే గొంతుకలను అణిచివేస్తున్నారు.. అధికారంలోకి వచ్చాక బదులు తీర్చుకుంటాం.. భూపాలపల్లి సభలో రేవంత్‌రెడ్డి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Published at : 30 Sep 2021 10:26 PM (IST) Tags: YSRCP AP News Clashes Between YSRCP Councilors YSRCP Councilors Minister Mekapati Goutham Reddy Atmakur Nellore District

ఇవి కూడా చూడండి

APVVP: పశ్చిమ గోదావరి జిల్లాలో 57 మెడికల్, పారామెడికల్ పోస్టులు

APVVP: పశ్చిమ గోదావరి జిల్లాలో 57 మెడికల్, పారామెడికల్ పోస్టులు

APSRTC Special Offer: 60 ఏళ్లు దాటిన వారికి ఏపీఎస్ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్ - బస్సుల్లో 25 శాతం రాయితీ

APSRTC Special Offer: 60 ఏళ్లు దాటిన వారికి ఏపీఎస్ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్ - బస్సుల్లో 25 శాతం రాయితీ

AP DPHFW: ఏపీలో 434 స్టాఫ్ నర్సు పోస్టులు, జోన్లవారీగా ఖాళీల వివరాలు

AP DPHFW: ఏపీలో 434 స్టాఫ్ నర్సు పోస్టులు, జోన్లవారీగా ఖాళీల వివరాలు

సుప్రీంకోర్టుకు చంద్రబాబు- సీఐడీ విచారణపై క్వాష్ పిటిషన్ దాఖలు 

సుప్రీంకోర్టుకు చంద్రబాబు- సీఐడీ విచారణపై క్వాష్ పిటిషన్ దాఖలు 

Breaking News Live Telugu Updates: సుప్రీంకోర్టుకు చంద్రబాబు- సీఐడీ విచారణపై క్వాష్ పిటిషన్ దాఖలు

Breaking News Live Telugu Updates: సుప్రీంకోర్టుకు చంద్రబాబు- సీఐడీ విచారణపై క్వాష్ పిటిషన్ దాఖలు

టాప్ స్టోరీస్

MLA Durgam Chinnaiah: రైతులు ఆత్మహత్యలు చేసుకొని చావాలి - నోరుజారిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

MLA Durgam Chinnaiah: రైతులు ఆత్మహత్యలు చేసుకొని చావాలి - నోరుజారిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

Bigg Boss Season 7 Telugu: ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి వంటలక్క ఔట్? మౌనితాకే మూడో పవర్ అస్త్ర!

Bigg Boss Season 7 Telugu: ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి వంటలక్క ఔట్? మౌనితాకే మూడో పవర్ అస్త్ర!

Chandrababu Arrest: పర్మిషన్ లేకుండా ర్యాలీ నిర్వహిస్తే చర్యలు - వారికి విజయవాడ సీపీ వార్నింగ్ 

Chandrababu Arrest: పర్మిషన్ లేకుండా ర్యాలీ నిర్వహిస్తే చర్యలు - వారికి విజయవాడ సీపీ వార్నింగ్ 

Sagileti Katha Movie : రవితేజ 'సగిలేటి కథ' సెన్సార్ పూర్తి - విడుదల ఎప్పుడంటే?

Sagileti Katha Movie : రవితేజ 'సగిలేటి కథ' సెన్సార్ పూర్తి - విడుదల ఎప్పుడంటే?