Heritage Defamation: ఏపీ మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై నాన్‌బెయిల్‌బుల్ వారెంట్
ఏపీ మంత్రి కన్నబాబు, వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ప్రజాప్రతినిధుల కోర్టులో హెరిటేజ్ దాఖలు చేసిన పరువునష్టం కేసులో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.
హైదరాబాద్ లోని ప్రజాప్రతినిధుల కోర్టులో హెరిటేజ్ పరువునష్టం కేసు విచారణ జరిగింది. ఏపీ మంత్రి కన్నబాబు, వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు నాన్‌బెయిలబుల్ వారంట్ అమలు చేయాలని కోర్టు నిర్ణయించింది. కన్నబాబు, అంబటి విచారణకు గైర్హాజరవడంతో ఎన్‌బీడబ్ల్యూ జారీ చేసినట్లు కోర్టు తెలిపింది. హెరిటేజ్ ప్రతినిధి సాంబమూర్తి కూడా హాజరుకావాలని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేసింది.
Also Read: ఇంటిపై దాడులకు భయపడను.. చిరంజీవి మాట్లాడరా? పోసాని స్పందన.. ట్విస్ట్ ఇచ్చిన జనసేన నేత
విచారణకు గైర్హాజరు
ప్రజాప్రతినిధుల కోర్టులో హెరిటేజ్ పరువునష్టం కేసు విచారణ జరిగింది. ఈ కేసు విచారణకు ఏపీ మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు గైర్హాజరయ్యారు. దీంతో వారిద్దరిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. విచారణకు హెరిటేజ్ ప్రతినిధి సాంబమూర్తి కూడా హాజరుకావాలని ఆదేశించింది.
హాజరైన నేతలు
ఎన్నికల నిబంధనల కేసులో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. లాలాగూడ పీఎస్ లో నమోదైన కేసులో బాల్క సుమన్ కు నోటీసులు జారీ అయ్యాయి. అక్టోబరు 8న హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీచేసింది. ప్రజా ప్రతినిధుల కోర్టులో వేర్వేరు కేసులకు సంబంధించి పలువురు నేతలు హాజరయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, జగ్గారెడ్డి, కొండా సురేఖ, నాగం జనార్థన్ రెడ్డి, దేవేందర్ గౌడ్, కడియం శ్రీహరి, వేణుగోపాలాచారి, చిన్నారెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు కోర్టుకు హాజరయ్యారు.
Also Read: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ మరో లేఖ.. గాలేరు పనులను నిలువరించాలని వినతి..
వైఎస్ షర్మిల, విజయలక్ష్మికి ఊరట
వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల, ఆమె తల్లి విజయలక్ష్మికి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ఊరట లభించింది. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసును కోర్టు కొట్టివేసింది. పరకాల ఎన్నికల కేసు విచారణలో భాగంగా గురువారం కోర్టుకు వైఎస్ విజయలక్ష్మి, వైఎస్ షర్మిల హాజరయ్యారు. 2012లో పరకాల ఉప ఎన్నిక సందర్భంగా అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించారని, కోడ్ ఉల్లంఘించారని పరకాల పోలీస్ స్టేషన్‌లో విజయలక్ష్మి, షర్మిల, కొండా సురేఖ దంపతులపై కేసులు నమోదయ్యాయి. ఆ ఎన్నికల్లో పరకాల నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా కొండా సురేఖ బరిలో ఉన్నారు. కొండా సురేఖ, కొండా మురళి సహా తొమ్మిది మందిపై నమోదైన కేసును ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది.
Also Read : టెంట్ హౌస్‌లా పార్టీని కిరాయికి ఇస్తారు.. ఇండస్ట్రీతో పవన్‌కు సంబంధం లేదన్న పేర్ని నాని