X
Super 12 - Match 18 - 26 Oct 2021, Tue up next
SA
vs
WI
15:30 IST - Dubai International Cricket Stadium, Dubai
Super 12 - Match 19 - 26 Oct 2021, Tue up next
PAK
vs
NZ
19:30 IST - Sharjah Cricket Stadium, Sharjah

KRMB: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ మరో లేఖ.. గాలేరు పనులను నిలువరించాలని వినతి..

ఏపీ ప్రభుత్వం చేపట్టిన గాలేరు - నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు ఆధునీకరణ, విస్తరణ పనులను నిలువరించాలని కృష్ణా బోర్డును తెలంగాణ కోరింది.

FOLLOW US: 

కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు (కేఆర్ఎంబీ) తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వం చేపట్టిన గాలేరు - నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు ఆధునీకరణ, విస్తరణ పనులను నిలువరించాలని కృష్ణా బోర్డును తెలంగాణ కోరింది. కృష్ణా బోర్డు ఛైర్మన్‌కు తెలంగాణ నీటిపారుదల ఈఎన్‌సీ మురళీధర్ ఈ మేరకు లేఖ రాశారు. ఈ విషయమై గతంలోనే తాము బోర్డుకు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. బోర్డు, అత్యున్నత మండలి ఆమోదం లేకుండానే ప్రాజెక్టు విస్తరణ చేపట్టిందని ఆరోపించారు. ప్రవాహ సామర్థ్యం పెరిగేలా జీఎన్ఎస్ఎన్ ప్రధాన కాల్వకు మరమ్మతులు, విస్తరణ, లైనింగ్ పనులు చేపట్టారని ప్రస్తావించారు. 150 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసి చెరువులను నింపేందుకు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారని తెలిపారు. 

Also Read: మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై నాన్‌బెయిలబుల్‌ వారంట్‌ జారీ!

గాలేరు - నగరికి నీటిని శ్రీశైలం ప్రధాన కుడికాల్వ, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి తీసుకుంటున్నారని ఈఎన్‌సీ లేఖలో వివరించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 34 టీఎంసీల నీటిని మాత్రమే తీసుకునే వీలుందని పేర్కొన్నారు. పాత 4 గేట్ల ద్వారా వరద సమయంలో గరిష్టంగా 11,150 క్యూసెక్కుల నీటిని మాత్రమే శ్రీశైలం ప్రధాన కుడికాల్వ, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తరలించవచ్చని లేఖలో వివరించారు. జీఎన్ఎస్ఎస్​కు నీటిని కేటాయించాలని కృష్ణా జలవివాదాల రెండో ట్రైబ్యునల్​ను ఏపీ కనీసం కోరలేదని లేఖలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు ఆధునీకరణ, విస్తరణ పనులను చేపట్టకుండా ఏపీని నిలువరించాలని తెలంగాణ ప్రభుత్వం బోర్డును కోరింది. ఈ అంశాన్ని కేంద్ర జలవనరుల శాఖ దృష్టికి తీసుకెళ్లాలని విన్నవించింది.

నీటి విడుదలలో తేడాలు సరిదిద్దండి.. 
నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాలువల ప్రవాహ సామ‌ర్థ్యాల‌లో ఉన్న అసమతుల్యతను సవరించాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది. బుధవారం ఈ మేరకు ప్రభుత్వం తరఫున మురళీధర్ కృష్ణా బోర్డు ఛైర్మన్‌కు లేఖ రాశారు. 1952లో ఆంధ్రా, హైదరాబాద్ రాష్ట్రాల మధ్య కుదిరిన అంతర్ రాష్ట్ర ఒప్పందం ప్రకారం నాగార్జున సాగర్ కుడి కాలువ (ఏపీ వైపు), ఎడమ కాలువ (తెలంగాణ వైపు) హెడ్ రెగ్యులేటర్ల విడుదల సామర్థ్యాలు సమానంగా ఉండాలని లేఖలో పేర్కొన్నారు.  

Also Read: పవన్ పై ఏపీ మంత్రులు ఫైర్.. జగన్ ను మాజీ సీఎం చేస్తే రాజకీయాల్లోంచి తప్పుకుంటానని మంత్రి కొడాలి నాని కౌంటర్ 

Also Read:  రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు.. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి.. దక్షిణ మధ్య రైల్వే వెల్లడి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: telangana Telangana Government nagarjuna sagar letter KRMB Krishna board TS Govt Letter to KRMB ENC

సంబంధిత కథనాలు

Delhi Fire Accident: దిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. నలుగురు సజీవదహనం

Delhi Fire Accident: దిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. నలుగురు సజీవదహనం

Corona Cases Update: భారత్ లో తగ్గిన కొవిడ్ కేసులు.. మధ్యప్రదేశ్ లో కొత్తరకం కరోనా వైరస్!

Corona Cases Update: భారత్ లో తగ్గిన కొవిడ్ కేసులు.. మధ్యప్రదేశ్ లో కొత్తరకం కరోనా వైరస్!

PornHub: వాట్ ఎన్ ఐడియా సర్ జీ.. పోర్న్ హబ్ లో పాఠాలు.. ఎంత సంపాదిస్తాడో తెలుసా?

PornHub: వాట్ ఎన్ ఐడియా సర్ జీ.. పోర్న్ హబ్ లో పాఠాలు.. ఎంత సంపాదిస్తాడో తెలుసా?

Telangana: ఈ పని వెంటనే చేయండి.. లేకుంటే మీకు రేషన్, పెన్షన్ కట్.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

Telangana: ఈ పని వెంటనే చేయండి.. లేకుంటే మీకు రేషన్, పెన్షన్ కట్.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

Ration Shop: పోలీసుల కళ్లలో కారం కొట్టి, రాడ్‌తో దాడి చేసిన మహిళ.. ఆర్డీవో, డీఎస్పీ ముందే నానాబీభత్సం

Ration Shop: పోలీసుల కళ్లలో కారం కొట్టి, రాడ్‌తో దాడి చేసిన మహిళ.. ఆర్డీవో, డీఎస్పీ ముందే నానాబీభత్సం
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Bhutan Culture: భూటాన్‌లో ఇళ్లపై అశ్లీల చిత్రాలు ఎందుకుంటాయ్? ప్రజలు అంత హ్యాపీగా ఎలా జీవిస్తున్నారు?

Bhutan Culture: భూటాన్‌లో ఇళ్లపై అశ్లీల చిత్రాలు ఎందుకుంటాయ్? ప్రజలు అంత హ్యాపీగా ఎలా జీవిస్తున్నారు?

IPL 2022 Format: ఐపీఎల్ 2022 ఫార్మాట్‌లో మార్పు.. ఈసారి మ్యాచ్‌లు ఎలా జరుగుతాయంటే?

IPL 2022 Format: ఐపీఎల్ 2022 ఫార్మాట్‌లో మార్పు.. ఈసారి మ్యాచ్‌లు ఎలా జరుగుతాయంటే?

Anger Management: కోవిడ్ తరువాత పెరుగుతున్న కోపం... ఇలా తగ్గించుకోండి

Anger Management: కోవిడ్ తరువాత పెరుగుతున్న కోపం... ఇలా తగ్గించుకోండి

Mahabubnagar: ఒకే చీరకు ఉరేసుకున్న వదిన, మరిది.. కారణం తెలిసి స్థానికులు షాక్

Mahabubnagar: ఒకే చీరకు ఉరేసుకున్న వదిన, మరిది.. కారణం తెలిసి స్థానికులు షాక్