Breaking News Live Updates: ఏపీ కొత్త సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన సమీర్ శర్మ
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా సెప్టెంబరు 30న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
LIVE
Background
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా సెప్టెంబరు 30న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
మెట్రో స్టేషన్ పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ మెట్రో స్టేషన్ నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి వివరాలు సేకరిస్తున్నారు.
ఏపీ కొత్త సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన సమీర్ శర్మ
ఏపీ కొత్త సీఎస్‌గా సమీర్ శర్మ గురువారం బాధ్యతలు స్వీకరించారు. సమీర్ శర్మకు మాజీ సీఎస్ ఆదిత్యనాథ్ బాధ్యతలు అప్పగించారు. తొమ్మిది నెలలపాటు ఆదిత్యనాథ్ దాస్ ఏపీ సీఎస్‌గా సేవలు అందించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సమీర్ శర్మ మీడియాతో మాట్లాడారు. నవరత్నాల అమలు కోసం కృషి చేస్తాన్నారు. సీఎస్‌గా తనకు అవకాశం ఇచ్చిన సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు.
కాంగ్రెస్‌లో చేరిన గండ్ర సత్యనారాయణ రావు..
భూపాలపల్లిలో నిర్వహించిన భారీ బహిరంగ సభ వేదికగా గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్‌లో చేరారు. గండ్ర సత్యనారాయణ రావుకు రేవంత్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సత్యనారాయణ రావుతో పాటు నియోజకవర్గంలోని ఆయా మండలాల్లోని పలువురు నాయకులు పెద్దఎత్తున కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరుతున్న నాయకులందరికీ రేవంత్‌రెడ్డి, మధుయాష్కీ గౌడ్, సీతక్క.. సభావేదికపైన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గండ్ర సత్యనారాయణ మాట్లాడుతూ.. నమ్ముకున్న పార్టీలు తనను మోసం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌కు డబ్బు మీద వ్యామోహం తప్ప ప్రజల సంక్షేమం పట్టదని విమర్శించారు. ప్రజలు టీఆర్ఎస్ పార్టీపై నమ్మకం కోల్పోయారని పేర్కొన్నారు.
కేసీఆర్ ఇంటిపేరు కల్వకుంట్ల కాదు.. కలవకుండా..
అధికార టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ విరుచుకుపడ్డారు. భూపాలపల్లి కాంగ్రెస్ సభలో ఆయన మాట్లాడుతూ.. బీటీ బ్యాచ్ అన్ని వర్గాలను దోచుకుంటోందని ఆరోపించారు. దళితబంధుతో టీఆర్ఎస్ మరోసారి దగా చేస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ ఇంటిపేరు కల్వకుంట్ల కాదు.. కలవకుండా అని ఓకవి అన్నారని పేర్కొన్నారు. తాగుడు గాళ్లు, వాగుడు గాళ్లు, గోకుడు గాళ్లు, గీకుడు గాళ్లు, గులాం గాళ్లు, గులాబీ గాళ్లు అని ఓకవి రాశాడని ఎద్దేవా చేశారు. కల్వకుంట్ల కుటుంబాన్ని రాజకీయంగా బొందపెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మనం సాధించింది సగం తెలంగాణనే అని.. సాధించాల్సింది సంపూర్ణ, సామాజిక తెలంగాణ అని వ్యాఖ్యానించారు.
సింగరేణి ప్రాంతాన్ని బొందలగడ్డగా మార్చిన ఘనత కేసీఆర్‌దే..
సింగరేణి ప్రాంతాన్ని బొందలగడ్డగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ సభలో ఆయన మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూం పేరుతో కథలు చెబుతున్నారే కానీ ఒక్క ఇళ్లూ కట్టించలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతీ గింజా కొంటామని హామీ ఇచ్చారు. రైతులు కేసీఆర్‌కు ఉరిబిగించే సమయం వచ్చిందని తెలిపారు. ఈ జన సమూహాన్ని చూస్తే టీఆర్ఎస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరగెడుతున్నాయని ఎద్దేవా చేశారు.