Pawan Kalyan Vs AP Ministers: పవన్ పై ఏపీ మంత్రులు ఫైర్.. జగన్ ను మాజీ సీఎం చేస్తే రాజకీయాల్లోంచి తప్పుకుంటానని మంత్రి కొడాలి నాని కౌంటర్
పవన్ వర్సెస్ ఏపీ మంత్రులు ఎడిసోడ్ కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వంపై వరుస విమర్శలు చేస్తున్న పవన్ పై మంత్రులు సైతం అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ మంత్రుల మధ్య మాటకు మాట ఇంకా కొనసాగుతోంది. జనసేన విస్తృతస్థాయి సమావేశంలో పవన్ ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ పరాభవం కాయమన్నారు. ఏపీలో జనసేనే ప్రధాన ప్రతిపక్షమంటూ, డైరెక్ట్ వార్ మొదలైందని కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై తాజా ఏపీ మంత్రులు కొడాలి నాని, సుచరిత, శంకర్ నారాయణ స్పందించారు. పవన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
Also Read : పోసాని ఇంటిపై రాళ్ల దాడి - భయపడబోనన్న పోసాని
అలా చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను: కొడాలి నాని
పవన్‌కల్యాణ్ విమర్శలపై మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. పవన్ కల్యాణ్ జీవితంలో సీఎం జగన్‌ను ఓడించలేరని ఎద్దేవా చేశారు. జగన్‌ను మాజీ ముఖ్యమంత్రిగా చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. ముందు ఎమ్మెల్యేగా గెలుస్తావో లేదో చూసుకోవాలని కొడాలి నాని ఎద్దేవా చేశారు. 2024లో పవన్ ఏంచేస్తారో చూద్దామన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ, కాంగ్రెస్‌తో కలిసి వచ్చినా పవన్ ఏం చేయాలేరన్నారు. ఇంకో జానీ సినిమా చూపించి భయపెడతారేమో అని ఎద్దేవా చేశారు. పవన్‌ను చూసి ఆయన అభిమానులు భయపడతారు కానీ వైసీపీ కాదన్నారు. సీఎం జగన్ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకే భయపడలేదన్నారు. పవన్ ప్రసంగాలకు జనం భయపడతారేమో గానీ జగన్ భయపడరన్నారు. చంద్రబాబు ఇచ్చే స్క్రిప్టులకు ఎవరూ భయపడరన్నారు. చంద్రబాబు, ప్రధాని మోదీ బూట్లు నాకే వ్యక్తి పవన్‌కల్యాణ్ అని కొడాలి నాని తీవ్రమైన వాఖ్యలు చేశారు.
Also Read: ‘ఇండస్ట్రీ’ పవన్‌ను వద్దనుకుందా? తమ కోసం పోరాడినా ఒంటరిని చేశారా?
ఇక్కడెవరూ తోలు తీయించుకోవడానికి సిద్ధంగా లేరు: హోంమంత్రి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై హోంమంత్రి మేకతోటి సుచరిత ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్ తోలు తీస్తానని హెచ్చరిస్తున్నాడని, ఇక్కడెవరూ తోలు తీయించుకోవడానికి సిద్ధంగా లేరన్నారు. నిలకడలేని పవన్ కల్యాణ్ ఎప్పుడు, ఎక్కడ ఉంటాడో తెలియదని విమర్శించారు. గత ఎన్నికల్లో రెండు చోట్లా ప్రజలు ఓడించారని ఎద్దేవా చేశారు. ఓసారి లెఫ్టిస్టునంటాడు, బీజేపీతో భాగస్వామినంటాడు, మరోసారి టీడీపీతో వెళ్తానంటాడు.. పవన్ కల్యాణ్ ఎలాంటి వారో ప్రజలకు సంపూర్ణంగా స్పష్టమైందన్నారు. పరిషత్ ఎన్నికల్లో ఎంపీపీ పదవులు పంచుకున్న జనసేన, టీడీపీ స్నేహం బయటపడిందన్నారు.
Also Read: మాటల్లో చెప్పిన ‘రాజకీయం’ చేతల్లో చూపిస్తే తిరుగులేనట్లే..! పవన్ కల్యాణ్ ‘సొంత’ బాట ..?
పవన్ కు తెలిసిందల్లా ప్రభుత్వంపై బురద చల్లడమే: మంత్రి శంకర నారాయణ
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ పవన్ పై విమర్శలు చేశారు. పవన్ దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారన్నారు. పవన్ కు తెలిసిందల్లా ప్రభుత్వంపై బురదచల్లడం మాత్రమేనన్నారు. వర్షాలు తగ్గాక రోడ్ల మరమ్మతు పనులు చేపడతామని వెల్లడించారు.
Also Read: పవన్ కల్యాణ్ తో సోము వీర్రాజు భేటీ... బద్వేలు ఉపఎన్నికలపై ప్రధానంగా చర్చ