IPO : షేర్లు కొనాలనుకుంటున్నారా..? ఒక్క సారి రాబోతున్న ఈ కంపెనీల ఐపీవోల గురించి తెలుసుకోండి..!
స్టాక్ మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి. ఐపీవోలకు వస్తున్న కంపెనీల షేర్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. దీంతో మరిన్ని కంపెనీలు పబ్లిష్ ఇష్యూలకు వస్తున్నాయి.
కోవిడ్ -19 కాలంలో వ్యాపార ప్రపంచంలో ముఖ్యంగా స్టాక్ మార్కెట్లలో ప్రతి ఒక్కరికీ హాట్ ఫేవరేట్లుగా కనిపిస్తున్నవి ఫార్మారంగ షేర్లు . ఆ రంగంలో ఉన్న కంపెనీలు కూడా పెద్ద ఎత్తున పబ్లిష్ ఇష్యూకు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఒక్క ఆగస్టు నెలలోనే ఐదు ఫార్మా రంగ కంపెనీలు ఐపీవోకు వస్తున్నాయి. ఈ ఐదు కంపెనీలు కలిసి దాదాపుగా రూ. ఎనిమిది వేల కోట్లను సమీకరించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.
ఎమ్‌క్యూర్ ఫార్మా కంపెనీ రూ. నాలుగు వేల కోట్లను ఐపీవో ద్వారా సమీకరించనుంది. ఇక డయాగ్నోస్టిక్స్ రంగంలో పేరెన్నిక గన్న విజయా డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా ఐపీవోకు వస్తోంది. ఈ సంస్థ రూ. 1500 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక క్రిష్ణా డయాగ్నోస్టిక్స్ రూ. 1200 కోట్లు, సుప్రియా లైఫ్ సైన్సెస్ రూ. 1200కోట్లు, విండ్‌లాస్ బయోటెక్ సంస్థ రూ. 400 కోట్లు ఈ నెలలో స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ అయి... సమీకరించడానికి సిద్ధం అయ్యాయి. ఇవన్నీ ఫార్మా రంగంలో మంచి పేరున్న కంపెనీలే. దీంతో అనుకున్న మొత్తాలను అవి సమీకరిస్తాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరంలో వివిధ సంస్థలు పబ్లిక్ ఇష్యూలకు వచ్చి.. మార్కెట్ నుంచి రూ. 27 వేల కోట్లను పెట్టుబడులుగా సమీకరించాయి. మొత్తంగా 12 కంపెనీలకు ఈ పెట్టుబడి దక్కింది. సెబీ దగ్గర దరఖాస్తు పెట్టుకున్న సంస్థలు.. వివిద అంచనాల ప్రకారం.. పలు సంస్థలు రూ. 70 వేల కోట్లను సమీకరించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుంటున్నాయి. కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోవడంతో గత ఏడాది... స్టాక్ మార్కెట్లలో ఐపీవోల ద్వారా సంస్థలు పెట్టుబడులుగా సమీకరించింది. కవలం రూ. 31,277 కోట్లు మాత్రమే. ఇది ఈ ఆర్థిక సంవత్సరం మూడింతలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ముందు ముందు బడా కంపెనీలు ఐపీవోలకు వస్తున్నాయి. టైల్స్ రంగంలో ప్రసిద్ధి చెందిన దేవ్యాని ఇంటర్నేషనల్, పేటీఎం, మోబిక్విక్, పాలసీబజార్, కాట్రాట్రేడ్, ఢిల్లీవరీ, న్యాకా షార్ట్‌లీ వంటి సంస్థ పెట్టుబడులకు ఐపీవోలకు రాబోతున్నాయి. ఈ సంవత్సరం స్టాక్ మార్కెట్ పరుగులు పెడుతోంది. సూచీలు ఆల్ టైం హైకి చేరుకున్నాయి. ఇటీవలే జొమాటో ఏకంగా రూ. లక్ష కోట్ల విలవైన కంపెనీగా ఐపీవో తర్వాత అవతరించింది. ముందు ముందు మరిన్ని కంపెనీలు.. లక్ష కోట్లకుపైగా విలువైన కంపెనీలుగా అవతరించే అవకాశం ఉంది. పేటీఎం, పాలసీబజార్ ఐపీవోలతో పాటు... ఫార్మా కంపెనీల ఐపీవోలపై అందరి గురి ఉంది.
Also Read:రెండ్రోజులుగా స్థిరంగా పసిడి ధర.. వెండి పైపైకి.. నేటి ధరలివీ..