By: ABP Desam | Updated at : 03 Aug 2021 09:11 AM (IST)
ఇవాల్టి బంగారం, వెండి ధరలు (ప్రతీకాత్మక చిత్రం)
భారత్‌లో బంగారం ధరలు గత రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆగస్టు 2న రూ.44,990 ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర, ఇవాళ (ఆగస్టు 3) కూడా అంతే కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర కూడా రెండు రోజుల క్రితం రూ.49,090 ఉండగా.. ఇవాళ కూడా అదే ధర స్థిరంగా ఉంది. గత పది రోజులుగా బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపించాయి. అంతక్రితం రూ.48,770 గా ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర తాజాగా రూ.49,090 కు చేరింది.
వెండి ధరల్లో మాత్రం గత 10 రోజులుగా హెచ్చుతగ్గులు కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా భారత్‌లో కిలో వెండి ధర రూ.72,900 గా ఉంది. నిన్న (ఆగస్టు 2న) రూ.73,100గా ఉంది. నిన్నటితో పోలిస్తే తాజాగా రూ.200 తగ్గింది.
Also Read: Weather Updates: ఏపీ, తెలంగాణలో ఈ ప్రాంతాల్లో ఇవాళ వర్షాలు.. హైదరాబాద్‌లో ఇలా..
హైదరాబాద్, విజయవాడలో తాజా ధరలు ఇవీ..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,990 ఉండగా.. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ.49,090 గా ఉంది. స్వచ్ఛమైన వెండి ధర కిలో తాజాగా రూ.72,900 కు పెరిగింది. ఏకంగా రూ.200 వరకూ ఎగబాకి ఈ ధర వద్ద స్థిరపడింది.
విజయవాడలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.44,990 కాగా.. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,090గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.72,900గా ఉంది. ఇక్కడ కూడా రెండు రోజులుగా బంగారం ధర స్థిరంగానే ఉంది.
వివిధ నగరాల్లో ఇలా..
దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,360ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,500గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,380 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,380ఉంది.
దేశంలోని ఇతర నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ వాణిజ్య రాజధాని అయిన ముంబయిలో ఆర్నమెంట్ బంగారం ధర రూ.47,380 గా ఉంది. బిస్కెట్ బంగారం ధర రూ.48,380 గా ఉంది. ఇక చెన్నైలో ఆగస్టు 3న 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,360 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,500 గా ఉంది.
ప్లాటినం ధర పైపైకి..
ఇక సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన మెటల్ అయిన ప్లాటినం ధర కొద్ది రోజులుగా హెచ్చుతగ్గులుగానే ఉంటోంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.25,130 గా ఉంది. విశాఖపట్నంలో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.25,130గా ఉంది.
Jeep Meridian: ఫార్చ్యూనర్ కంటే చాలా తక్కువ ధరకే - ఎంట్రీ ఇచ్చిన జీప్ మెరీడియన్ - అదిరిపోయే లుక్, ఫీచర్లు!
Hyundai New Car: రూ.7 లక్షలలోపే హ్యుండాయ్ కొత్త కారు - ఎలా ఉందో చూశారా?
Top Loser Today May 22, 2022 స్టాక్ మార్కెట్ సెన్సెక్స్, నిఫ్టీ టాప్ లాసర్స్ జాబితా
Top Gainer May 22, 2022 : స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్, నిఫ్టీ టాప్ గెయినర్స్
Petrol-Diesel Price, 23 May: శుభవార్త! నేడూ తగ్గిన ఇంధన ధరలు, ఈ ఒక్క నగరంలోనే పెరుగుదల
Mlc Anantababu Arrest : ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు, కాకినాడ జీజీహెచ్ లో వైద్య పరీక్షలు
AP News : విశాఖ రుషికొండ తవ్వకాల స్టే, సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కార్
Tirumala Darshan Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, రేపు ఆర్జితసేవా టికెట్ల ఆగస్టు నెల కోటా విడుదల
KTR IN Davos: తెలంగాణకు మరో అంతర్జాతీయ కంపెనీ- ఆగస్టు నుంచి స్విస్రే కంపెనీ కార్యకలాపాలు, ట్విట్టర్లో ప్రకటించిన కేటీఆర్